వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కొడంగల్: గుర్నాథ్ రెడ్డి పోటీ, రేవంత్ రెడ్డికి గండమే

By Pratap
|
Google Oneindia TeluguNews

Kodangal: Will Revanth Reddy regain?
మహబూబ్‌నగర్: జిల్లాలోని కొండగల్ శాసనసభా నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రేవంత్ రెడ్డికి విజయం అంత సులభమేమీ కాదు. గతంలో ఐదుమార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన గురునాథ్‌రెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అభ్యర్థిగా రంగంలోకి దిగడంతో రేవంత్ రెడ్డి ఎదురీదక తప్పదని అంటున్నారు. కాగా, మాజీ ఎంపి విఠల్‌రావు కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్నారు. విఠల్ రావు కూడా తక్కువేమీ తినలేదు.

ఇటీవల గురునాథ్‌రెడ్డి తెరాసలో చేరి పోటీకి దిగడంతో ఫలితాన్ని అంచనా వేయడం కష్టంగా మారింది. తొలి అసెంబ్లీ ఎన్నికలు 1952లో అనంతరెడ్డి, 1957లో అచ్యుతారెడ్డి, 1962లో రుక్మారెడ్డి, 1967లో అచ్యుతారెడ్డిలు ఎమ్మెల్యేలుగా గెలుపొందుతూ వచ్చారు. కాగా 1972 సంవత్సరంలో జరిగిన ఎన్నికలు స్థానికుల మధ్యలో జరిగాయి. 1972లో స్వతంత్ర అభ్యర్థిగా నందారం వెంకటయ్య ఎమ్మెల్యేగా గెలుపొందారు.

1978లో గురునాథ్‌రెడ్డి స్వతంత్ర అభ్యిర్థిగా పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత గురునాథ్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరగా, నందారం వెంకటయ్య అప్పట్లో తెలుగుదేశం పార్టీలో చేరారు. అప్పటి నుండి గురునాథ్‌రెడ్డి, నందారం కుటుంబం మధ్య రాజకీయ పోరు కొనసాగింది. 1996లో నందారం వెంకటయ్య మృతి కారణంగా తన తనయుడు సూర్యనారాయణ ఉప ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. టిడిపి తరపున సరైన అభ్యర్థి లేని కారణంగా 1999, 2004లో గురునాథ్‌రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు.

2009లో కూడా అదే పరిస్థితి వస్తుందని గ్రహించి తెలుగుదేశం పార్టీ రేవంత్‌రెడ్డిని బరిలోకి దించింది. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన గురునాథ్‌రెడ్డిపై రేవంత్‌రెడ్డి ఐదువేల ఓట్లకు పైగా మెజారిటీతో గెలుపొందారు. అయితే, ఈసారి మాత్రం గుర్నాథ్ రెడ్డికి రాజకీయ అనుభవానికి, తెలంగాణవాదం తోడు అవుతోంది. మొత్తం మీద ముక్కోణపు పోటీ రసవత్తరంగా సాగుతోంది.

English summary
Sitting MLA and Telugudesam party candidate Revanth Reddy is facing tough fight from Telangana Rastra Samithi (TRS) candidate Gurnath Reddy and Congress candidate Vittal Rao at Kodangal assembly segment in Mahaboobnagar district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X