వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అపోహలు వద్దు: సిటీ మెట్రో రైలుపై కెటిఆర్ (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: హైదరాబాద్‌లో మెట్రో రైలు నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఐటీ శాఖ మంత్రి కె. తారక రామారావు స్పష్టం చేశారు. మెట్రో రైలుపై వస్తున్న వార్తలు అపోహలు మాత్రమేనని ఆయన తెలిపారు. శుక్రవారం మెట్రో రైలు పీజీ కోర్సును ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మెట్రో మార్గాన్ని 250 కిలోమీటర్ల మేర విస్తరించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుందని ఆయన అన్నారు. సెంబ్లీ వద్ద భూగర్భ మెట్రో నిర్మాణంపై మెట్రో ఎండీ ఎంవీఎస్ రెడ్డి, మిగతా ఏజన్సీలు సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారని తెలిపారు.

చిన్న చిన్న సమస్యలు అవాంతరాలు ఉంటే ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావుతో మెట్రో ఎండీ మాట్లాడి అన్ని విషయాలు మీడియాకు వివరిస్తారని ఆయన అన్నారు. ప్రభుత్వ పరంగా తాము మాత్రం మెట్రో రైలుకు కట్టుబడి ఉన్నామని కేటిఆర్ మరోసారి స్పష్టం చేశారు. మెట్రో విస్తరణకు కూడా ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన చెప్పారు.

మెట్రో రైలుపై కెటిఆర్

మెట్రో రైలుపై కెటిఆర్

హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టును తాము పూర్తి చేసి తీరుతామని, దానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి కెటి రామారావు చెప్పారు.

మెట్రో రైలుపై కెటిఆర్

మెట్రో రైలుపై కెటిఆర్

హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుపై అనుమానాలు అవసరం లేదని, చిన్న చిన్న సమస్యలు పరిష్కారమవుతాయని అన్నారు.

మెట్రో రైలుపై కెటిఆర్

మెట్రో రైలుపై కెటిఆర్

మెట్రో రైలు ప్రాజెక్టును విస్తరించేందుకు కూడా తమ తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని కెటి రామారావు స్పష్టం చేశారు.

మెట్రో రైలు

మెట్రో రైలు

చారిత్రక కట్టడాలను పరిరక్షించాలనే ఉద్దేశంతో కెసిఆర్ కొన్ని చోట్ల భూగర్భ మార్గం వేయాలని పట్టుబడుతున్నారు.

English summary
Telangana It minister KT Rama Rao clarified that the Hyderabad metro rail project will be completed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X