వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నాన్న నేను ఒకే ఇంట్లో ఉంటున్నాం: స్థానికతపై కెటిఆర్

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: "1956 స్థానికత గురించి మాట్లాడేముందు మీడియా వారు తమ కెమెరాలను ఆపేయాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే మా నాన్న నేనూ కలిసే ఉంటున్నాం. మా ఇద్దరి మధ్య అపోహలకు తావు లేకుండా బ్యాలెన్స్‌డ్‌గా చెప్పటానికి ప్రయత్నిస్తా" అని కెటి రామారావు అన్నారు.

బుధవారం హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో ఫిక్కీ లేడీస్‌ ఆర్గనైజేషన్‌ (ఎఫ్‌ఎల్‌ఓ), యంగ్‌ ఫిక్కీ లేడీస్‌ ఆర్గనైజేషన్‌ (వైఎఫ్‌ఎల్‌ఓ) సంయుక్తంగా ‘విజన్‌ ఫర్‌ తెలంగాణ' పేరిట నిర్వహించిన సమావేశంలో కెటిఆర్ పలు ప్రశ్నలకు సమాధానమిస్తూ ఆ విధంగా అన్నారు.

స్థానికత అనేది ఫీజు రీ ఇంబర్స్‌మెంట్‌ గురించి వచ్చిందని ఆయన అన్నారు. ఎవరినీ ఇబ్బంది పెట్టేందుకు కాదని టెర్రాకుయ అమెరికాలాంటి దేశంలోనే ఐదేళ్లు ఉంటే స్థానికునిగా గుర్తిస్తుండగా ఇక్కడ 1956 నియమం పెట్టడం ఏమిటని చాలామంది అడుగుతున్నారని ఆయన అన్నారు. నిజమే, అలాగని అమెరికాలో అన్ని బెనిఫిట్స్‌ అందించటం లేదు కదా అని అన్నారు.

ఖఊఈ - ఇఘణణఘ

తెలంగాణ కోసం తమ రక్తం ధారపోసిన వారికి లబ్ధి చేకూర్చటానికే 1956ను ప్రామాణికంగా తీసుకున్నామని, 1956 ముందు రెవెన్యూ ప్రాంతాలన్నీ ఆంధ్రలో కలిపేయమని అడుగుతున్న ఆంధ్ర నాయకులు మాటల వల్లనే ఇలా అనాల్సి వచ్చిందని, అయినా, మేం ఇంకా అధికారికంగా ఏమీ ప్రకటించలేదని, ఆ సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నామని ఆయన వివరించారు.

అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని అయినా, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి అయినా ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలిచిందీ నిలుస్తున్నది హైదరాబాదేనని. రాష్ట్రాభివృద్ధికి ఇంధనం హైదరాబాద్‌ నగరమేనని, తెలంగాణ రాష్ట్రంతోపాటు దేశంలో కూడా స్థిరమైన ప్రభుత్వాలు ఏర్పడ్డాయని, రెండుచోట్లా ధైర్యంగా నిర్ణయాలు తీసుకోగలిగిన నేతలే ఉన్నారని అన్నారు. తెలంగాణ అభివృద్ధి పథంలో ముందుకు పయనిస్తోందని, రాబోయే ఐదేళ్లలో హైదరాబాద్‌ కచ్చితంగా స్మార్ట్‌సిటీగా ఉంటుందని, నగరంలో మురికివాడలు అనేవి లేకుండా చేయాలన్నది కేసీఆర్‌ లక్ష్యమని అన్నాకుయ

మనదేశంలో రాష్ట్రాల విభజన ప్రక్రియ సరిగా జరగలేదని, రాష్ట్రాల విభజనకు తగిన ప్రమాణాలు కూడా అనుసరించలేదని, ప్రపంచంలోనే ఆరో అతిపెద్ద పరిపాలనా యూనిట్‌గా గుర్తింపు పొందిన ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం మన దేశంలోనే ఉందని. గోవా ఎంత చిన్న రాష్ట్రమో తెలిసిందేనని అన్నారు.

English summary
Telangana IT minister and Telangana CM K Chandrasekhar Rao's son KT Rama Rao said that he is staying in his father's house.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X