మెదక్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మాసాయిపేట: మృత్యుంజయుడు వరుణ్ (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: 36 రోజులుగా ఆస్పత్రి పడకపై ఉండి, వెంటిలేటర్‌పైనే చికిత్స పొందుతున్న వరుణ్ మృత్యువును జయించాడు. మాసాయిపేట వద్ద స్కూలు బస్సును రైలు ఢీకొన్న సంఘటనలో తీవ్రంగా గాయపడిన వరుణ్‌ పూర్తిగా కోలుకున్నాడు.

గురువారం యశోద ఆస్పత్రి నుంచి డిశ్చార్చి అయ్యాడు. తల్లి ఒడిలో ఒదిగిపోయాడు. ఇదే ప్రమాదంలో గాయపడి ఇదివరకే ఇంటికి వెళ్లిన అక్కయ్య రుచితతో కలిసి ఇంటికి వెళ్లాడు.

వరుణ్ వయసు ఏడేళ్లు. గత నెల 24న జరిగిన మాసాయిపేటలో రైలు దుర్ఘటనలో తీవ్రంగా గాయపడిన 20 మంది విద్యార్థులను సికింద్రాబాద్‌ యశోద ఆస్పత్రికి తీసుకువచ్చారు. అందులో ఇద్దరు చిన్నారులు చనిపోయారు. మిగిలిన 18 మందిని వైద్యులు కాపాడారు.

 వరుణ్‌

వరుణ్‌

గాయపడ్డ వారిలో వరుణ్‌ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. అతని పరిస్థితి అత్యంత విషమంగా ఉందని వైద్యులు మొదట్లోనే ప్రకటించారు.

 వరుణ్‌

వరుణ్‌

వరుణ్‌ను బతికించడం కష్టమనే నిర్ధారణకు వైద్యులు వచ్చారు. ఈ ప్రమాదంలో వరుణ్‌ పై మెదడు, మెదడు కింది భాగం, మధ్యభాగంలో బలమైన గాయాలయ్యాయి.

 వరుణ్‌

వరుణ్‌

ముఖ్యమైన మధ్య మెదడు చాలా చితికిపోయింది. ఛాతీపై గాయాలయ్యాయి. చర్మ మంతా గీసుకుపోయింది. ఆసుపత్రికి తీసుకువచ్చే సమయానికే వరుణ్‌లో కదలిక లేదు. చూపు లేదు.

 వరుణ్‌

వరుణ్‌

దీంతో వరుణ్‌ గొంతుకు రంధ్రం చేసి వెంటిలేటర్‌ చికిత్స ప్రారంభించారు. ఆ సమయంలో పలు మార్లు ఫిట్స్‌ వచ్చాయి. కొన్నిసార్లు రోజుకు ఇరవైసార్లు ఫిట్స్‌ వచ్చాయి.

 వరుణ్‌

వరుణ్‌

ఇక వరుణ్‌ను బతికించడం కష్టమని వైద్యులు భావించారు. అప్పటికీ పట్టు వదలకుండా చికిత్సలో మార్పులు చేస్తూ వచ్చారు. వైద్యుల కృషి ఫలించడంతో ఫిట్స్‌ తగ్గి వరుణ్‌ సాధారణ స్థాయికి చేరుకున్నాడు.

 వరుణ్‌

వరుణ్‌

వరుణ్‌ ఇప్పుడు అన్నం తినగలుగుతున్నాడని, తన పనులను తా ను చేసుకుంటున్నాడని, అందరినీ గుర్తుపడుతున్నాడని మెడికల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ లింగయ్య చెప్పారు.

 వరుణ్‌

వరుణ్‌

ఇంటి వాతావరణంలో కుటుంబ సభ్యులతో గడిపితే అతని ఆరోగ్యం మరింత మెరుగుపడుతుందని వైద్యులు వివరించారు. కాగా, మాసాయిపేట రైలు దుర్ఘటనలో గాయపడిన విద్యార్థులకు తమ ఆస్పత్రికి చెందిన మూడు శాఖల వైద్యులు కృషి చేశారని మెడికల్‌ సూపరింటెండెంట్‌ లింగయ్య చెప్పారు.

 వరుణ్‌

వరుణ్‌

మొత్తం 50 మంది వైద్యులు, 100 మంది నర్సులు, మరో 100 మంది సాంకేతిక, పారా మెడికల్‌, ఇతర సిబ్బంది వైద్య చికిత్సలో పాల్గొన్నారన్నారు. విద్యార్థుల చికిత్స కోసం ఏడు వెంటిలేటర్లు, ఆక్సిజన్‌ పరికరాలు, లంగ్‌ ఫంక్షన్‌ పరికరాలను వినియోగించినట్లు చెప్పారు.

English summary
Seven-year-old Varun Goud was on ventilator support for over a month but he held on for dear life. On Thursday, he was the last of those critically injured in last month’s Masaipet train accident to be discharged from Secunderabad’s Yashoda Hospital.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X