హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

లేపాక్షి షోరూంలో మట్టి వినాయక విగ్రహాలు(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నగరంలోని ఆర్టీసి క్రాస్ రోడ్స్ లోని లేపాక్షి షోరూంలో మట్టి వినాయక విగ్రహాలను విక్రయిస్తున్నారు. వివిధ రూపాల్లో మట్టి ప్రతిమలను కొనుగోలుదారులకు అందుబాటులో ఉంచారు. అమ్మకాలు ఆగస్టు 29 వరకు జరుగుతాయని లేపాక్షి మేనేజర్ విజయసారథి తెలిపారు. పర్యావరణాన్ని పరిరక్షించేందుకు మట్టి విగ్రహాల విక్రయాలు చేపట్టామని ఆయన చెప్పారు.

శరవేగంగా ఖైరతాబాద్ గణనాథుని విగ్రహ తయారీ

దేశంలోనేకాక ప్రపంచంలోనే ప్రత్యేకత సంతరించుకున్న ఖైరతాబాద్ గణనాథుని విగ్రహ తయారీ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఉత్సవాలు ప్రారంభమై 60 సంవత్సరాలు కావడంతో పాటు తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన అనంతరం మొదటిసారి జరగనున్న ఈ ఉత్సవాలకు మరింత ప్రత్యేకత సంతరించుకోనుంది. మే 28న కర్రపూజతో ప్రారంభమైన ఈ పనులు జూన్ 4న షెడ్ నిర్మాణం అనంతరం బేస్‌ల నిర్మాణం, షెడ్ నిర్మాణం పూర్తి చేసుకుంది.

కుల, మత, ప్రాంతాలకతీతంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, చెన్నై, కలకత్తా, గోవా రాష్ట్రాలకు చెందిన కార్మికులు తోపాటు మహాగణపతి ఫినిషింగ్ పనులను మహ్మద్, కబీర్ నిర్వహించడం ఇక్కడ జరిగే వేడుకలకు మరింత ప్రత్యేకతను తీసుకువస్తున్నది. మొదటగా ఆదిలాబాద్‌కు చెందిన సుధాకర్ ఆధ్వర్యంలోని 15 మంది బృందం సుమారు 10 రోజులు శ్రమించి షెడ్ పనులను పూర్తిచేశారు. అనంతరం విశాఖపట్నంకు చెందిన శేషాద్రి ఆధ్వర్యంలో 25 మంది వెల్డింగ్ పనుల్లో పాల్గొన్నారు.

శిల్పి రాజేంద్రన్ ఆధ్వర్యంలో సుమారు 150 మంది కార్మికులు రోజుకు 16 నుంచి 18 గంటలు మహాగణపతి నిర్మాణం పనుల్లో వున్నారు. ఈసారి కైలాస విశ్వరూప మహాగణపతి ఆకారంలో గణనాథున్ని సుందరంగా తీర్చిదిద్దుతున్నట్లు శిల్పి రాజేంద్రన్ తెలిపారు. విశ్వకళ్యాణాన్ని కాంక్షిస్తూ కైలాస విశ్వరూప మహాగణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేయదలిచామని అన్నారు. ఇందులో భాగంగా 60 అడుగుల ఎత్తు, 28 అడుగుల వెడల్పుతో తయారు చేస్తున్నట్లు చెప్పారు.

వినాయకులు

వినాయకులు

నగరంలోని ఆర్టీసి క్రాస్ రోడ్స్ లోని లేపాక్షి షోరూంలో మట్టి వినాయక విగ్రహాలను విక్రయిస్తున్నారు.

వినాయకులు

వినాయకులు

లేపాక్షి షోరూంలో వివిధ రూపాల్లో మట్టి ప్రతిమలను కొనుగోలుదారులకు అందుబాటులో ఉంచారు.

వినాయకులు

వినాయకులు

అమ్మకాలు ఆగస్టు 29 వరకు జరుగుతాయని లేపాక్షి మేనేజర్ విజయసారథి తెలిపారు.

వినాయకులు

వినాయకులు

పర్యావరణాన్ని పరిరక్షించేందుకు మట్టి విగ్రహాల విక్రయాలు చేపట్టామని ఆయన చెప్పారు.

వినాయకులు

వినాయకులు

లేపాక్షి షోరూంలో వివిధ రూపాల్లో కొలువుదీరిన మట్టి వినాయక విగ్రహాలు.

వినాయకులు

వినాయకులు

లేపాక్షి షోరూంలో వివిధ రూపాల్లో కొలువుదీరిన మట్టి వినాయక విగ్రహాలను పరిశీలిస్తున్న సందర్శకులు.

వినాయకులు

వినాయకులు

లేపాక్షి షోరూంలో వివిధ రూపాల్లో కొలువుదీరిన మట్టి వినాయక విగ్రహాలను పరిశీలిస్తున్న సందర్శకులు.

English summary
Lepakshi show room sells clay Lord Ganesha statues at RTC cross roads in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X