కరీంనగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పోకిరీ పోలీస్‌కు దేహశుద్ధి, చర్లపల్లి జైల్లో తనిఖీలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లాలో ఓ పోకిరీ పోలీసుకు ప్రజలు దేహశుద్ధి చేశారు. కథలాపూర్‌లో ఓ హెడ్ కానిస్టేబుల్ బస్టాప్ వద్ద మహిళలు, యువతులతో అభ్యంతరకరంగా ప్రవర్తించాడు. ఇది గమనించిన స్థానికులు అతనికి దేహశుద్ధి చేశారు.

చర్లపల్లి జైల్లో పోలీసుల తనిఖీలు

హైదరాబాదులోని చర్లపల్లి జైల్లో మంగళవారం ఉదయం పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా స్వర్ణముఖి బ్యారక్‌లో ఖైదీల నుంచి ఆరు సెల్‌ఫోన్లు, అరకిలో గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

యూరియా అధిక ధరకు విక్రయిస్తే షాపు లైసెన్స్‌ రద్దు

Locals beat pokiri police

కర్నూలు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో యూరియా బ్లాక్‌మార్కెట్లో అమ్ముతున్నట్లు ముఖ్యమంత్రి దృష్టికి వచ్చిందని వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు హెచ్చరించారు. ఎరువుల కొరత లేదని, ఎక్కడైనా యూరియా ఎక్కువధరకు అమ్మితే షాపు లైసెన్స్‌ రద్దుచేసి ఆ ప్రాంతంలోని మండల వ్యవసాయశాఖ అధికారి, ఏడీలను సస్పెండ్‌ చేయాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు.

గుంటూరు కలెక్టరేట్‌లో వీడియో కాన్ఫరెన్స్‌హాలు నుంచి సోమవారం మంత్రి 13 జిల్లాల కలెక్టర్లు, వ్యవసాయ శాఖ జేడీలు ఇతర అధికారులతో యూరియా బ్లాక్‌ మార్కెట్‌, పొలం పిలుస్తోంది, మార్కెట్‌యార్డుల్లో రైతు సదస్సులు తదితర అంశాలను వీడియో కాన్ఫరెన్స్‌లో సమీక్షించారు. ప్రధానంగా కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో యూరి యా అమ్మకాలపై అనేక ఆరోపణలు వస్తున్నట్లు చెప్పారు.

English summary
Locals beat pokiri police in Karimnagar district on Tuesday morning.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X