వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పిపిఏల రద్దుపై ఏపికి లోకాయుక్త నోటీసులు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: పిపిఏల రద్దుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లోకాయుక్తా బుధవారం నోటీసులు జారీ చేసింది. తెలంగాణతో విద్యుత్ ఒప్పందాలు ఎందుకు రద్దు చేసుకున్నారని ఏపి ప్రభుత్వాన్ని లోకాయుక్త ప్రశ్నించింది. ఇది చట్టాన్ని ఉల్లంఘించడమేనని పేర్కొంది.

పిపిఏల రద్దుపై జనవరి 19లోగా వివరణ ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని లోకాయుక్త ఆదేశించింది. తెలంగాణకు విద్యుత్ సరఫరా నిలిపివేయడం పునర్వవ్యస్థీకరణకు బిల్లుకు విరుద్ధమని తెలిపింది. తెలంగాణకు రావాల్సిన విద్యుత్ వాటా విషయంలో ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ లోకాయుక్తా ఏపి ప్రభుత్వాన్ని మందలించింది.

Lokayukta issued notices to AP Govt

విభజన చట్టం ప్రకారం తెలంగాణకు 54 శాతం విద్యుత్ వాటా రావాల్సి ఉంది. కృష్ణపట్నంలో తెలంగాణ కంపెనీలు 700 కోట్ల పెట్టుబడులు పెట్టాయి. అయినప్పటికీ కృష్ణపట్నం నుంచి తెలంగాణకు కరెంట్ ఇవ్వకుండా ఏపి సిఎం చంద్రబాబు అడ్డుకుంటున్నాన్నరని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే తెలిపింది.

విద్యుత్ విషయంలో తెలంగాణ, ఏపీ రాష్ర్టాల మధ్య వివాదాలు నెలకొన్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో పునర్విభజన చట్టాన్ని ఉల్లంఘించి తెలంగాణకు రావాల్సిన విద్యుత్‌ను ఏపీ ప్రభుత్వం అడ్డుకుంటోందని తెలంగాణ ప్రభుత్వం ఆరోపించింది.

English summary
Lokayukta on Wednesday issued notices to Andhra Pradesh Government on cancellation of PPAs.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X