హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సిటీలో లక్నో అమ్మాయి అనుమానాస్పద మృతి

By Pratap
|
Google Oneindia TeluguNews

 Lucknow girl ends life in Hyderabad
హైదరాబాద్: ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోకు చెందిన అమ్మాయి హైదరాబాదులో ఆత్మహత్య చేసుకుంది. అయితే, ఆమె మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతురాలిని అంకిత సింగ్‌గా గుర్తించారు. ఆమె హైదరాబాదులోని పంజగుట్టలో గల హిల్ టాప్ కాలనీలో తన గదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

ఉద్యోగం కోసం అంకిత హైదరాబాద్ వచ్చింది. బంజారాహిల్స్‌లోని రోడ్ నెంబర్ 2లో గల ఓ టెక్స్‌టైల్ దుకాణంలో ఆమె పని చేస్తూ ఉండేది. మూడు నెలల క్రితం ఆ ఉద్యోగాన్ని వదిలేసింది. తన రూమ్మేట్ వచ్చేసరికి ఆమె గదిలో ఉరేసుకుని కనిపించింది.

పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గదిని తనిఖీ చేశారు. సూసైడ్ నోట్ ఏదీ కనిపించలేదు. అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

అంకిత ఆత్మహత్యకు గల కారణాలను పోలీసులు కనుక్కోవడానికి ప్రయత్నిస్తున్నారు. మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి, తల్లిదండ్రులకు సమాచారం అందించారు.

English summary
A 24-year-old woman hanged herself to death in her room in Hill Top Colony in Panjagutta on Friday. The victim Ankitha Singh belongs to Lucknow.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X