హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అర్జున్ 'రంగుల జాతర' కళాత్మకంగా (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఆధునిక కళా చిత్ర ప్రక్రియలో వినూత్న ప్రయోగం చేసిన ఎం. అర్జున్ ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంది. తెలంగాణ పల్లెల్లోని సంప్రదాయాలను, సంస్కృతిని ఆధునిక కళా చిత్ర ప్రక్రియలోఅర్జున్ కళాత్మకంగా ఆవిష్కరించారు. రవీంద్రభారతిలోని కళాభవన్ ఐసిసిఆర్ ఆర్ట్ గ్యాలరీలో జాతర దృశ్యం పేర ఈ కళా చిత్ర ప్రదర్శన జరిగింది.

ఈ ప్రదర్శనను శనివారం సాయంత్రం ప్రముఖ చలనచిత్ర దర్శకుడు బి. నర్సింగరావు ప్రారంభించారు. ఈ ప్రదర్శన జులై 30వ తేదీ వరకు ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు వీక్షకులకు కనువిందు చేసింది.

తెలంగాణ పల్లెల్లోని జాతర దృశ్యాలకు సరికొత్త ఫొటోగ్రఫీ, పెయింటింగ్‌ను మేళవించి అర్జున్ ప్రదర్శించారు. అర్జున్ జెఎన్ఎఫ్ఎయు పూర్వ విద్యార్థి. తెలంగాణలో జరిగే జాతరలు ఆయన చిత్రాల్లో కళాత్మంగా మెరిశాయి.

జాతర దృశ్యం

జాతర దృశ్యం

తెలంగాణలోని ఏడు పాయల జాతర, కొమురెల్లి మల్లన్న జాతర, కలేశ్వరం సరస్వతీ పుష్కరాలు, మంజీరా కుంభమేళ, కొత్తకొండ జాతర వంటి పది జాతరలకు చెందిన దృశ్యాలకు టెక్నాలజీ జోడించి అర్జున్ ప్రదర్శించారు.

జాతర దృశ్యం

జాతర దృశ్యం

ఫొటోగ్రఫీ, పెయింటింగ్ కలగలిపిన ఈ రకమైన చిత్రాల రూపకల్పనను డిజిటల్ ఆర్ట్ అంటారని కళాకారుడు అర్జన్ చెప్పారు.

జాతర దృశ్యం

జాతర దృశ్యం

అర్జున్ తన కళాత్మక దృష్టితో ఓ దృశ్యానికి తన చిత్రకళా నైపుణ్యాన్ని జోడించి ఇలా తీర్చి దిద్దాడు. చూడండి.

జాతర దృశ్యం

జాతర దృశ్యం

పుష్కరాల దృశ్యం అర్జున్ చేతిలో పడి ఇలా కళాత్మకంగా రూపుదిద్దుకుంది.

జాతర దృశ్యం

జాతర దృశ్యం

కొమురెల్లి మల్లన్న జాతర తెలంగాణలో విశేషంగా ప్రజలకు ఆదరణీయంగా మారింది. ఆ జాతరకు సంబంధించిన ఓ కళాఖండం ఇలా..

జాతర దృశ్యం

జాతర దృశ్యం

జాతర సందర్భంగా ప్రజలు గుడుల వద్దకు చేరుకుని ఇలా బయట వండుకోవడం, అక్కడే ఆరగించడం, నైవేద్యాలు చేసుకోవడం పరిపాటి.

జాతర దృశ్యం

జాతర దృశ్యం

తెలంగాణలో శైవరూపాలే ఎక్కువ. శూద్రులు దాదాపుగా శైవ భక్తులే. శివాలయాలకు చేరుకునే భక్తులు ఇలా ఉంటారు..

జాతర దృశ్యం

జాతర దృశ్యం

శివార్చన శూద్రులకు అనువైన రీతిలో ఉంటుంది. అందుకు సంబంధించిన పూజాసామగ్రి కూడా విభిన్నంగానే ఉంటుంది.

జాతర దృశ్యం

జాతర దృశ్యం

తెలంగాణలోని ఓ జాతర సందర్భంగా స్నానాలు చేసే భక్తులతో కూడిన దృశ్యం ఇలా కనువిందు చేసింది.

జాతర దృశ్యం

జాతర దృశ్యం

జాతరలో ఓ దృశ్యం ఇలా.. దరువులు వేయడం కూడా ఉంటుంది. శూద్రులే ఎక్కువగా పూజాదిక కార్యక్రమాలు చేస్తారు.

జాతర దృశ్యం

జాతర దృశ్యం

ఇలా మట్టి కుండలను అలంకరించడం కూడా జాతరలో ఓ భాగం. వీళ్లు బహుశా మొక్కు తీర్చుకుంటున్నారో, కడుతున్నారో...

జాతర దృశ్యం

జాతర దృశ్యం

కొమురెల్లి మల్లన్న తదితర జాతరలకు పల్లె ప్రజలు బండ్లు కట్టుకుని వెళ్తారు. దేవాలయాల వద్ద బండ్లు ఇలా విడిచి...

జాతర దృశ్యం

జాతర దృశ్యం

శివాలయాలకు గానీ ఇతర జాతరలకు గానీ బండ్లలో తమకు కావాల్సిన సామగ్రిని వేసుకుని వస్తారు.

జాతర దృశ్యం

జాతర దృశ్యం

మట్టి పాత్రల స్థానంలో లోహ పాత్రలు వచ్చినట్లున్నాయి. దైవానికి సమర్పించడానికి ఇలా...

జాతర దృశ్యం

జాతర దృశ్యం

జాతరల్లో భక్తులు ఇలా విడిది చేసి, ఇలా కనిపిస్తుంటారు. వారు అక్కడే భోజనాలు వండుకుంటారు. అక్కడే తింటారు.

జాతర దృశ్యం

జాతర దృశ్యం

శూద్ర మహిళలు రంగు రంగుల చీరెల్లో జాతర సందర్భంగా తమకు నచ్చిన రీతిలో ముస్తాబై ఇలా వంటలూ చేస్తూ కనిపిస్తారు.

జాతర దృశ్యం

జాతర దృశ్యం

జాతరల్లో ఇటువంటి దృశ్యాలు సాధారణంగా కనిపిస్తాయి. చేటలు, బుట్టలు అమ్ముతూ ఇలా కొంత మంది జీవనం సాగిస్తారు కూడా..

జాతర దృశ్యం

జాతర దృశ్యం

ప్రముఖ చలన చిత్ర దర్శకుడు, చిత్రకారుడు, కవి నర్సింగ రావు ఎ. అర్జున్ చిత్ర ప్రదర్శనను ప్రారంభించారు.

English summary
Arjun's Telangana Jatara drishyam digital art exhibition has been launched by film director B Narsinga Rao at Ravindra Bharathi in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X