వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గల్లా జయదేవ్‌కు మహేష్ ఓటు, టిడిపిలో ఉత్సాహం

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తన బావ, గుంటూరు లోకసభకు తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్న గల్లా జయదేవ్‌కు ప్రముఖ హీరో మహేష్ బాబు మద్దతు తెలిపారు. రాజకీయాల పైన మహేష్ బాబు తొలిసారి పెదవి విప్పారు. తానెప్పుడూ రాజకీయాలకు దూరాన్ని పాటిస్తానని చెప్పిన మహేష్... అదే సమయంలో తన బావ జయదేవ్‌కు మద్దతిస్తానని చెప్పారు. గల్లా జయదేవ్‌కు మద్దతిస్తానని మహేష్ బాబు చెప్పడం తెలుగుదేశం పార్టీలో కొత్త ఉత్సాహాన్ని రేకెత్తించింది.

గల్లా జయదేవ్‌కు మహేష్ బాబు మద్దతు అంటే పరోక్షంగా తెలుగుదేశం పార్టీకి మద్దతు అన్నట్లేనని వారు అంటున్నారు. మహేష్ బాబు ఆయన బావకు ప్రచారం చేస్తే ఆ ప్రభావం చుట్టు పక్కన నియోజకవర్గాలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా పడుతుందని ఆశిస్తున్నారు. కాగా, జయదేవ్ గురించి మహేష్ తన మనసులోని భావాలను వెల్లడించారు.

Mahesh support to Jayadev, TDP happy

తన సోదరి పద్మను గల్లా జయదేవ్ వివాహం చేసుకున్నప్పుడు తన వయసు 13 ఏళ్లని, ఆయన తనకు స్ఫూర్తినిచ్చిన వ్యక్తి అన్నారు. తన రోల్ మోడల్ అన్నారు. తనను చూసిన తీరు, తన పట్ల తీసుకున్న శ్రద్ధే అందుకు కారణమన్నారు. అమరరాజా గ్రూప్, అమరాన్ బ్రాండ్‌ను ఆయన ఏ స్థాయికి తీసుకెళ్లారో తెలిసిందేనన్నారు. మీడియా, పారిశ్రామిక రంగం ఆయన విజయాలను గుర్తించిందన్నారు.

జయదేవ్ ఎప్పుడూ రాజకీయాల్లోకి రావాలని అంటుంటారని కానీ, ఎందుకో తనకెప్పుడూ అర్థం కాలేదన్నారు. రాజకీయాలతోనే మార్పు సాధ్యమని ఆయన నమ్ముతారన్నారు. అభివృద్ధి, ప్రజలకు సేవ రాజకీయాల ద్వారా చేయవచ్చునని ఆయన భావిస్తారన్నారు.

తాను ఆయన్ని నమ్ముతున్నానని, ఆయన మార్పు తీసుకొస్తారని ఆశిస్తున్నానని, తన ఓటు, తన మద్దతు బావ గల్లా జయదేవ్‌కే అన్నారు. గుంటూరు, ఆంధ్రప్రదేశ్, భారత్ భవిష్యత్తు కోసం మీరూ ఆయనకు మద్దతిస్తారని ఆశిస్తానని వ్యాఖ్యానించారు. మహేష్ బాబు ట్విట్టర్ ద్వారా స్పందించారు.

English summary
Prince Mahesh Babu support to Galla Jayadev, Telugudesam happy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X