నెల్లూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కోరిక తీర్చలేదని నడిరోడ్డుపై కామాంధుడి దారుణం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Man murder attempt on woman
నల్గొండ: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఆదివారం దారుమం జరిగింది. తన కోరిక తీర్చలేదన్న కోపంతో ఓ కామాంధుడు నెల్లూరులోని టక్కేమిట్టలో ఓ మహిళపై హత్యాయత్నానికి పాల్పడ్డాడు. కోనేటిమిట్ట గిలకబావి ప్రాంతానికి చెందిన శ్రీను అనే వ్యక్తి తన ఇంటి పక్కనే ఉన్న ఓ మహిళ పైన కన్నేశాడు.

తన కోరిక తీర్చాలని ఆమెను పలుమార్లు వేధించాడు. ఎవరు లేని సమయంలో ఇంటికి వెళ్లి వేధింపులకు గురి చేసేవాడు. అతని వ్యవహారంతో విసిగిపోయిన ఆమె ఇల్లు మారింది.

ఆదివారం ఆమె ఇంట్లోకి వస్తువులు కొనేందుకు బజారుకు వచ్చింది. ఈ సమయంలో శ్రీని రెచ్చిపోయాడు. కనిపించకుండా తిరుగుతావా.. అంటూ దుర్భాషాలు ఆడి, ఆమె పైన పిడిగుద్దులు కురిపించాడు. కత్తితో ఆమె చాతి పైన రెండుసార్లు పొడిచాడు. అనంతరం పరారయ్యాడు.

మహిళను చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. కాగా, మహిళపై విచక్షణారహితంగా దాడికి పాల్పడిని శ్రీనును అరెస్టు చేసి, కఠినంగా శిక్షించాలని బంధువులు, గ్రామస్తులు డిమాండ్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని అతని కోసం గాలిస్తున్నారు.

English summary
Man murder attempt on woman
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X