హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చంద్రబాబు క్యాంప్ ఆఫీసులో వ్యక్తి ఆత్మహత్యాయత్నం

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు క్యాంప్ కార్యాలయంలో ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేసినట్లుగా తెలుస్తోంది. విజిటర్స్ వెయిటింగ్ రూంలో ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశారు. అతనిని భద్రతా సిబ్బంది వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఆయనకు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఆ వ్యక్తి విజిటింగ్ రూంలో కాసేపు కూర్చొని, ఆ తర్వాత కేకలు వేస్తూ విషం తాగినట్లుగా తెలుస్తోంది. కాగా, అతను విషం తాగాడా లేక మరో ప్రమాదకర ద్రావకం తాగాడా తెలియాల్సి ఉంది.

Man tries to commit suicide in camp office

వాగులో యువకుల గల్లంతు

గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం అమీన్ సాహెబ్ పాలెం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కుప్పగంజి వాగు వంతెన పైన బైక్‌ను కారు ఢీకొంది. దాంతో బైక్ పైనున్న ఇద్దరు యువకులు ఎగిరి వాగులో పడ్డారు.

భారీ వర్షాలు

ఎడతెరపిలేకుండా కురిసిన వర్షాలకు రాజమండ్రిలో మురుగు నీరు పొంగి ప్రవహిస్తోంది. కప్పాలచెరువు సెంటర్‌, శ్యామలా సెంటర్‌, రైల్వేస్టేషన్‌ పరిసరాల్లో మోకాళ్ల లోతులో నీరు నిలిచిపోయాయి. రాజమండ్రి అర్బన్‌ తహశీల్దార్‌ కార్యాలయం, సబ్‌ రిజిస్టార్‌ కార్యాలయం, షాడేగౌడ్స్‌ హైస్కూల్‌లోకి వర్షపు నీరు వచ్చి చేరింది.

నాగార్జునసాగర్‌కు వరద ఉధృతి తగ్గుముఖం పట్టింది. సాగర్‌ ఇన్‌ఫ్లో 73,500 క్యూసెక్కులుకాగా, ఔట్‌ ఫ్లో 75,400 క్యూసెక్కులుగా నమోదైంది. అధికారులు సాగర్‌ నాలుగు గేట్లు ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేశారు. డ్యాం ప్రస్తుత నీటిమట్టం 590 అడుగులుగా ఉంది. అటు శ్రీశైలం డ్యామ్‌ గేట్లను అధికారులు మూసివేశారు.

English summary
A man tries to commit suicide in Andhra Pradesh CM camp office on Friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X