వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కలర్‌టివి-డిష్: ఎపి కాంగ్రెస్ మేనిఫెస్టో, జగన్‌పై చిరు ఫైర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ (సీమాంధ్ర) కాంగ్రెసు పార్టీ శుక్రవారం ఉదయం తమ ఎన్నికల ముసాయిదాని విడుదల చేసింది. మేనిఫెస్టోలో ఆడవాళ్లకు డిష్ కనెక్షన్‌తో పాటు కలర్ టివిలు ఉచితంగా ఇస్తామని, ప్రభుత్వ కార్యాలయాల్లో పని దినాలను ఐదు రోజులకు కుదిస్తామని పొందుపర్చారు. కేంద్రమంత్రి జైరాం రమేష్, ఎపిసిసి చీఫ్ రఘువీరా రెడ్డి, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవిలు మేనిఫెస్టోను విడుదల చేశారు.

ఈ సందర్భంగా చిరు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి, టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పైన మండిపడ్డారు. టిడిపి, జగన్ పార్టీ మేనిఫెస్టోలు నమ్మవద్దన్నారు. జగన్ అయిదు సంతకాలతో పంచభూతాలు అమ్మేస్తారన్నారు. విద్యార్థులకు లాప్‌టాప్‌లు ఇస్తామన్నారు. ఆడపిల్లలకు బంగారుతల్లికి అదనంగా ప్రియదర్శిని పథకం తెస్తామన్నారు. ప్రజల మనోభావాల ప్రకారమే తమ మేనిఫెస్టో ఉందన్నారు.

Manifesto for AP Congress

తాము ఆచరణ సాధ్యమయ్యే వాటినే పేర్కొన్నామన్నారు. తమది ప్రజల మేనిఫెస్టో అన్నారు. ప్రజల సంక్షేమం కోసం తమ మేనిఫెస్టో అన్నారు. ఇచ్చిన హామీలను కచ్చితంగా అమలు చేస్తామన్నారు. జగన్ అధికారంలో లేనప్పుడే దోచుకున్నారని.. ఇక అధికారంలోకి వస్తే ఏమీ ఉండదన్నారు.

మేనిఫెస్టోలోని అంశాలు....

రానున్న ఐదేళ్లు విద్యుత్ ఛార్జీలు పెంచడం ఉండదు
కృష్ణా, గోదావరి, పెన్నా నదుల అనుసంధానం
విశాఖ, విజయవాడ, తిరుపతిల్లో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులు
పేదలకు జనతా వస్త్రాల పంపిణీ
ప్రభుత్వ ఇంటర్ కళాశాల విద్యార్థులకు లాప్‌టాప్‌లు
జిల్లా ఆసుపత్రికి అనుబంధంగా మెడికల్ కాలేజీలు
ప్రయివేటు రంగంలో రిజర్వేషన్లు
స్వయం సహాయక రుణాల మాఫీ
ఆడపిల్ల పుడితే 100 గజాల స్థలం
బెల్టు షాపులు మూసివేయించడం
ప్రభుత్వ కార్యాలయాల్లో ఐదు రోజుల పని దినాలు
రిటైర్మెంట్ వయస్సు అరవయ్యేళ్లు
5వేల కోట్లతో రైతుల అత్యవసర సహాయనిధి
వ్యవసాయానికి తొమ్మిది గంటల ఉచిత విద్యుత్

English summary
Manifesto for Andhra Pradesh Congress.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X