హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అనారోగ్యమే: మావోయిస్టు దంపతులు (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: అనారోగ్యంతోనే ప్రభుత్వానికి లొంగిపోయామని మాజీ మావోయిస్టు రవీందర్ దంపతులు పేర్కొన్నారు. గతనెల రాష్ట్ర డిజిపి ఎదుట చంబాల రవీందర్ దంపతులు లొంగిపోయారు. గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు.

రివార్డు కోసం లొంగిపోయారన్న వాదనలో నిజం లేదని తెలిపారు. తన భార్య రణితకు టిబి, అల్సర్ వ్యాధులు ఉన్నాయని రవీందర్ చెప్పారు. ప్రస్తుతం ఉద్యమంలో ఉన్నవారికి, కొత్తగా చేరబోయేవారిని ఎలాంటి సలహా ఇవ్వదలుచు కోలేదని, తమకు చేతనైనంత కాలం పార్టీలో పనిచేశామని, ఇప్పుడు తమ వల్ల కావడం లేదని అన్నారు.

పార్టీకి లేఖ రాసి, ఆయుధాలు వదిలేసి వచ్చామని, పూర్తిగా జనజీవన స్రవంతిలో జీవిస్తామని తెలిపారు. ఈశాన్య రాష్ట్రాల తీవ్రవాదం, ఐఎస్‌ఐతో మవోయిస్టు పార్టీకి సంబంధాలు పూర్తి అబద్ధమని, నేపాల్ మావోయిస్టులతో సంబంధాలు మాత్రం కొట్టిపారేయలేమని చెప్పారు.

తెలుగువాళ్లదే నాయకత్వం

తెలుగువాళ్లదే నాయకత్వం

జాతీయ స్థాయిలో తెలుగువాళ్లే నాయకత్వం వహిస్తున్నారని, పార్టీలో ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. కుటుంబ సభ్యులతో చర్చించిన తర్వాత భవిష్యత్‌ను రూపొందించుకుంటామని అన్నారు.

రహస్యాలు చెప్పలేదు

రహస్యాలు చెప్పలేదు

మవోయిస్టు పార్టీకి సంబంధించిన రహస్యాలను వెల్లడించలేదని, తమకు ఎవరి వలన ప్రాణభయం లేదని రవీందర్ తెలిపారు.

అనారోగ్యంతోనే..

అనారోగ్యంతోనే..

కొంతకాలంగా నడుము, కాళ్లు, కంటి వ్యాధులతో బాధపడుతున్నామని చంబల రవీందర్ అన్నారు. దాంతోనే లొంగిపోయామని అన్నారు.

మావోయిస్టు అగ్రనేత...

మావోయిస్టు అగ్రనేత...

మావోయిస్టులకు తెలంగాణకు చెందిన ముప్పాళ్ల లక్ష్మణ రావు అలియాస్ గణపతి సారథ్యం వహిస్తున్నారు.

English summary
Chambala Ravinder couple surrendered before DGP in Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X