వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బియాస్ బాధిత ఫ్యామిలీలకు నాయిని చెక్కు (పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నిర్లక్ష్యంగా వ్యవహరించి 24 మంది విద్యార్థుల మృతికి కారణమైన విఎన్‌ఆర్ విజ్ఞాన జ్యోతి కాలేజీపై చర్యలు తీసుకుంటామని తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి స్పష్టం చేశారు. బియాస్ ప్రమాదంపై ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ఒక కమిటీ ఏర్పాటు చేశారని, 15 రోజుల్లో కమిటీ నివేదిక అందజేస్తుందని చెప్పారు. నివేదిక ఆధారంగా కాలేజీ యాజమాన్యంపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.

బియాస్ ప్రమాద బాధిత కుటుంబాలకు గురువారం సాయంత్రం సచివాలయంలో హిమాచల్‌ప్రదేశ్ ప్రభుత్వం పంపించిన రూ. 1.5 లక్షల చెక్కును నాయిని అందజేశారు. 24 మంది విద్యార్థుల తల్లిదండ్రులకు చెక్కులను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హిమాచల్‌ప్రదేశ్ హైకోర్టు ఆదేశాల మేరకు లార్జీ డ్యాం అథారిటీ నుంచి 2.50 లక్షలు, కాలేజీ యాజమాన్యం నుంచి మరో 2.50 లక్షలు త్వరలోనే విద్యార్థుల తల్లిదండ్రులకు అందుతాయని చెప్పారు.

చెక్కుల పంపిణీ

చెక్కుల పంపిణీ

నిర్లక్ష్యంగా వ్యవహరించి 24 మంది విద్యార్థుల మృతికి కారణమైన విఎన్‌ఆర్ విజ్ఞాన జ్యోతి కాలేజీపై చర్యలు తీసుకుంటామని తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి స్పష్టం చేశారు.

చెక్కుల పంపిణీ

చెక్కుల పంపిణీ

బియాస్ ప్రమాదంపై ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ఒక కమిటీ ఏర్పాటు చేశారని, 15 రోజుల్లో కమిటీ నివేదిక అందజేస్తుందని చెప్పారు.

చెక్కుల పంపిణీ

చెక్కుల పంపిణీ

నివేదిక ఆధారంగా కాలేజీ యాజమాన్యంపై చర్యలు తీసుకుంటామని మంత్రి నాయిని తెలిపారు.

చెక్కుల పంపిణీ

చెక్కుల పంపిణీ

బియాస్ ప్రమాద బాధిత కుటుంబాలకు గురువారం సాయంత్రం సచివాలయంలో హిమాచల్‌ప్రదేశ్ ప్రభుత్వం పంపించిన రూ. 1.5 లక్షల చెక్కును నాయిని అందజేశారు.

చెక్కుల పంపిణీ

చెక్కుల పంపిణీ

బియాస్ ఘటనలో మృతి చెందిన 24 మంది విద్యార్థుల తల్లిదండ్రులకు చెక్కులను అందించారు.

చెక్కుల పంపిణీ

చెక్కుల పంపిణీ

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హిమాచల్‌ప్రదేశ్ హైకోర్టు ఆదేశాల మేరకు లార్జీ డ్యాం అథారిటీ నుంచి 2.50 లక్షలు, కాలేజీ యాజమాన్యం నుంచి మరో 2.50 లక్షలు త్వరలోనే విద్యార్థుల తల్లిదండ్రులకు అందుతాయని చెప్పారు.

చెక్కుల పంపిణీ

చెక్కుల పంపిణీ

బియాస్ బాధిత కుటుంబాలకు ఐదు లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటి వరకు ఆ మొత్తాన్ని అందించలేదని దుయ్యబట్టారు.

చంద్రబాబుకు చెక్కు

చంద్రబాబుకు చెక్కు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అభివృద్ధి కోసం రూ. 2 లక్షల చెక్కును ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అందజేస్తున్న చెస్ క్రీడాకారణి కోనేరు హంపి తల్లిదండ్రులు.

బియాస్ బాధిత కుటుంబాలకు ఐదు లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటి వరకు ఆ మొత్తాన్ని అందించలేదని దుయ్యబట్టారు. ప్రమాదం తర్వాత సంఘటనా స్థలానికి ఆంధ్రప్రదేశ్ మంత్రులు విహార యాత్రలకు వచ్చినట్టు ఇలా వచ్చి అలా వెళ్లిపోయారని ఎద్దేవా చేశారు. బియాస్ బాధితులకు మొదటి నుంచి తెలంగాణ ప్రభుత్వం అండగా ఉందని ఆయన చెప్పారు.

అదేవిధంగా ప్రమాద బాధిత కుటుంబాల విద్యార్థులకు కాలేజీలో సీట్లు ఇవ్వాలని, విద్యార్థుల బ్యాంకు రుణాలు కాలేజీ యాజమాన్యమే చెల్లించాలని, విద్యార్థుల కుటుంబాల్లో ఒకరికి కాలేజీలో ఉద్యోగం ఇవ్వాలని ఇప్పటికే కాలేజీకి సూచించామని నాయిని చెప్పారు. అందుకు కాలేజీ యాజమాన్యం కూడా అంగీకరించిందని అన్నారు. ఇచ్చిన హామీలపై వెనక్కి తగ్గితే కాలేజీ చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇది ఇలా ఉండగా ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు చెస్ క్రీడాకారిణి కోనేరు హంపి తల్లిదండ్రులు రూ. 2లక్షల చెక్కు ఏపి రాజధాని అభివృద్ధి కోసం అందించారు.

English summary
Telangana Home Minister Nayani Narasimha Reddy today handed over cheques of Rs 1.5 lakh each to 25 families of those deceased or washed away in Beas River incident given by Himachal Pradesh Government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X