గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రేసింగ్: ఎమ్మెల్యే కొడుకుని పట్టుకుని వదిలేశారు

By Pratap
|
Google Oneindia TeluguNews

MLA’s son counselled over bike racing
గుంటూరు: గుంటూరు జిల్లా మంగళగిరి బైపాస్‌ రోడ్డులో ఆదివారం బైక్‌ రేస్‌ నిర్వహిస్తున్న 8 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బైక్‌ రేసులు నిర్వహించకుండా కౌన్సిలింగ్‌ ఇచ్చారు. పోలీసులకు చిక్కిన వారిలో విజయవాడ సెంట్రల్‌ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు తనయుడు కూడా ఉన్నాడు.

పోలీసులు వారి తల్లిదండ్రులను పిలిపించి, కౌన్సిలింగ్‌ ఇచ్చారు. మరోసారి పునరావృతం అయితే కేసులు పెడతామని హెచ్చరించి విడిపిపెట్టారు. యువకులు ఆదివారం ఉదయం బైక్‌లతో కాజాకు చేరుకున్నారు. స్థానికులపై ఆ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు యువకులను అదుపులోకి తీసుకున్నారు. బైండింగ్ ఓవర్ కూడా తీసుకోకుండా యువకులను వదిలేయడం విమర్శలకు తావు ఇస్తోంది. వారి చిరునామాలను మాత్రం తీసుకున్నారు. అయితే, బైండోవర్ చేయలేదనే విమర్శలను గుంటూరు డిఎస్పీ మధుసూదన రావు ఖండించారు.

పోలీసులను చూసిన తర్వాత యువకులు కదలలేదని, పైగా వారితో వివాదానికి దిగారని అంటున్నారు. యువకుల నుంచి పోలీసులు కొన్ని వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు చెబుతున్నారు. అయితే, ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని వాహనాలను తిరిగి ఇప్పించినట్లు ఆరోపణలు వస్తున్నాయి.

English summary

 The son of a Vijayawada MLA was among 8 youngsters reportedly counselled,’ by the police here, after they were heading for a bike racing on the national highway.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X