హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

స్నేక్ గ్యాంగ్: మరో ముగ్గురు అరెస్ట్, ఐదు రేప్ కేసుల్లో..

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: స్నేక్ గ్యాంగ్‌పై కేసుల సంఖ్య పెరుగుతోంది. గ్యాంగ్‌ ప్రధాన సూత్రధారులు పైసల్‌ దయాని, సాలం హందీని మూడురోజుల కస్టడీకి తీసుకున్న పోలీసులు విచారణను పూర్తి చేశారు. లోగడ హైదరాబాద్‌, సైబరాబాద్‌లో చేసిన ఆకృత్యాలకు సంబంధించిన వివరాలను రాబట్టారు. వీటిని క్రోడీకరించి మరో మూడు కేసులు నమోదు చేశారు. ఇప్పుడు మరో రెండు కేసుల నమోదుతో ఆ సంఖ్య ఐదుకు చేరింది.

ఫతేనగర్‌లో రెండేళ్ల క్రితం పర్వీన్‌బేగం అనే మహిళకు చెందిన స్థలాన్ని దయానితోపాటు హుస్సేన్‌, హబీబ్‌ కలిసి కబ్జా చేశారు. దీనికి సంబంధించి బేగం ముందుకు రావడంతో క్రైం నంబర్‌ 351/2014తో ఒక కేసు నమోదు చేశారు. పహాడీషరీఫ్‌లోని షాహింనగర్‌లో సయ్యద్‌ నసీరుద్దీన్‌కు చెందిన స్థలాన్ని కబ్జా చేశారు. అప్పట్లో అడ్డుకోబోయిన అతడ్ని చిత్రహింసలు పెట్టారు. దీనిపై నసీరుద్దీన్‌ ఫిర్యాదు చేయడంతో క్రైం నెంబర్‌ 343/2014తో మరో కేసు నమోదు చేశారు.

కులాంతర వివాహం చేసుకున్న జంటను భయపెట్టి ఇంటి నుంచి వెళ్లగొట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనిపై హజీజ్‌ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో క్రైం నంబర్‌ 348/2014తో కేసు నమోదైంది.

More snake gang victims surface

కస్టడీ గడువు పూర్తి కావడంతో పైసల దయాని, సాలం హందీని పోలీసులు రంగారెడ్డి జిల్లా కోర్టులో శనివారం హాజరుపరిచారు. న్యాయమూర్తి వారికి సెప్టెంబర్‌ నాలుగో తేదీ వరకు రిమాండ్‌ విధించారు. ఈ గ్యాంగ్‌ నుంచి ఇంకా అనేక విషయాలు రాబట్టాల్సి ఉన్నందున మరోమారు కస్టడీకి తీసుకోవాలని పోలీసులు భావిస్తున్నారు.

మరో ముగ్గురు అదుపులో...

స్నేక్ గ్యాంగ్ ముఠాకు చెందిన మరో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చాంద్రాయణగుట్ట పోలీసు స్టే,న్ పరిధిలోని అబుద్, ఇతని సోదరుడితో పాటు పైసల్ దయానీ ప్రధాన అనుచరుడైన మరో యువకుడినిపోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లుగా తెలుస్తోంది. కాగా, దయానీ ముఠాకు మరో అయిదు అత్యాచార కేసులలో సంబంధం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ దిశగా పూర్తి వివరాలు రాబట్టే పనిలో పడ్డారు.

English summary
More crimes of the snake gang have come to light with three more victims approaching the Cyberabad police accusing them of land grabbing, criminal intimidation and attempt to murder. As the gang was using snakes to threaten victims, the police has booked an additional case for cruelty to animals against them.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X