వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కెసిఆర్‌కు కోదండ షాకిస్తే, వివేక్ వెళ్లిపోయారు (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: 'నా తెలంగాణ - నా ప్రజలు' పుస్తకాన్ని సోమవారం హైదరాబాదులో కాంగ్రెసు పార్టీ సీనియర్ నేతలు వెంకట స్వామి(కాకా), ఎం సత్యనారాయణలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తెలంగాణ.. ముఖ్యమంత్రి పదవి కోసం కాదన్నారు. తెరాస మునికిపోతున్న నావ వంటిందన్నారు.

ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ వల్లనే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని సత్యనారాయణ అన్నారు. తెలంగాణ వచ్చింది.. తెచ్చింది కాంగ్రెసు పార్టీయేనని కరీంనగర్ ఎంపి పొన్నం ప్రభాకర్ అన్నారు.

1954 నుండి తెలంగాణ ఉద్యమం జరుగుతోందని, అప్పట్లోనే ఉస్మానియా విశ్వవిద్యార్థులు తీవ్రస్థాయిలో ఉద్యమించారని చెప్పారు. 'నా తెలంగాణ - నా ప్రజలు' పుస్తకం పొన్నం ప్రభాకర్ లోకసభలో మాట్లాడిన ప్రసంగాలతో రూపొందించినది.

పొన్నం ప్రభాకర్

పొన్నం ప్రభాకర్

'నా తెలంగాణ - నా ప్రజలు' పుస్తకం కరీంనగర్ కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు పొన్నం ప్రభాకర్ లోకసభలో మాట్లాడిన ప్రసంగాలతో రూపొందించినది.

కోదండరామ్

కోదండరామ్

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో అణగారిన వర్గాలకు మేలు జరగాలని తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరామ్ అన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత జయ నామ సంవత్సరం ప్రవేశించిందని, ఈ సంవత్సరంలో తెలంగాణకు అంతా జయమే జరగాలని ఆకాంక్షించారు.

కాకా

కాకా

తెలంగాణ.. ముఖ్యమంత్రి పదవి కోసం కాదని, తెరాస మునికిపోతున్న నావ వంటిదని, 1954 నుండి తెలంగాణ ఉద్యమం జరుగుతోందని, అప్పట్లోనే ఉస్మానియా విశ్వవిద్యార్థులు తీవ్రస్థాయిలో ఉద్యమించారని కాకా అన్నారు.

వివేక్

వివేక్

కాంగ్రెస్ కురువృద్ధుడు కాకా తనయులు కారు దిగి మళ్లీ కాంగ్రెస్‌లో చేరారు. గత ఏడాది జూన్ రెండున సీనియర్ నేత కె కేశవ రావు, మరో ఎంపీ మంద జగన్నాథంతో కలిసి వివేక్, వినోద్ టీఆర్ఎస్‌లో చేరిన సంగతి తెలిసిందే.

వివేక్

వివేక్

తెలంగాణపై నిర్ణయం తీసుకోవటంలో కాంగ్రెస్ చేస్తున్న జాప్యాన్ని తప్పుబడుతూ గులాబీ తీర్థం పుచ్చుకుంటున్నట్లు వివేక్ అప్పట్లో ప్రకటించినా నాటి సిఎం కిరణ్‌పై వ్యతిరేకత, తెలంగాణ రాష్ట్రంలో తొలి సిఎం దళితుడే అనే తెరాస విధాన నిర్ణయం కూడా వారు పార్టీ మారటానికి దోహదం చేశాయనే ప్రచారం జరిగింది.

పుస్తకం

పుస్తకం

'నా తెలంగాణ - నా ప్రజలు' పుస్తకాన్ని సోమవారం హైదరాబాదులో కాంగ్రెసు పార్టీ సీనియర్ నేతలు వెంకట స్వామి(కాకా), ఎం సత్యనారాయణలు ఆవిష్కరించారు.

వివేక్

వివేక్

అయితే, తెరాసలో అన్ని రకాలుగా బలమైన దళిత నేత ఎవరూ లేకపోవడంతో పార్టీ విధాన నిర్ణయం ప్రకారం తెలంగాణ రాష్ట్రానికి తొలి సిఎం తానేనని వివేక్ భావించారని చెబుతున్నారు. ఈ మేరకు ఈసారి లోకసభకు కాకుండా అసెంబ్లీకి పోటీ చేయాలని తలపోశారని అంటున్నారు. అయితే, ఇప్పుడు కెసిఆర్‌కు షాకిచ్చారు.

English summary
My Telangana and My People book released by Venkata Swamy and M Satyanarayana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X