వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గణేష్ ఉత్సవాలు: కరెంట్ కెసిఆర్ వచ్చాక... (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: భాగ్యనగరంలో ఆగస్టు 29 నుండి సెప్టెంబర్ 8వ తేదీ వరకు వరకు నిర్వహించనున్న సామూహిక గణేశ ఉత్సవాలను ఘనంగా నిర్వహించడానికి జరుగుతున్న ఏర్పాట్లను తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ బుధవారం సమీక్షించారు. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రతినిధులు, వివిధ ప్రభుత్వ విభాగాల అధిపతులతో సచివాలయంలోని సి బ్లాకు లో ఈ సమీక్షా సమావేశం జరిగింది.

ఈ సమావేశంలో భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి అద్యక్షులు శ్రీ జి . రాఘవ రెడ్డి, ప్రధాన కార్యదర్శి డాక్టర్ భగవంత రావు, పార్లమెంట్ సభ్యులు, ఉత్సవ సమితి సలహాదారులు బండారు దత్తాత్రేయ, ఉపాధ్యక్షులు కరోడిమల్, రామరాజు, కార్యదర్శులు రావినూతల శశిధర్, మహేందర్, ఖడేల్, సంయుక్త కార్యదర్శి పుఖ్రాజ్ జోషి, కోశాద్యక్షులు శ్రీకృష్ణ మాలని, నగరానికి చెందిన ప్రజా ప్రతినిధులు డాక్టర్ లక్ష్మణ్, చింతల రామచంద్ర రెడ్డి, ఎన్.వి.ఎస్.ఎస్. ప్రభాకర్, రాజాసింగ్ ,రాజ్యసభ సభ్యులు వి. హనుమంత రావు పాల్గొన్నారు.

ఈ ఏడాది జరిగే ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేస్తామని, ఏ విధమైన పోలీసు వేధింపులు లేకుండా భక్తిపూరిత వాతావరణంలో ఉత్సవాలు నిర్వహించడానికి ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుందని, వినాయక ఉత్సవాలపై, హిందువుల ధార్మిక విశ్వాసాలపై జరుగుతున్న విష ప్రచారం అరికట్టడానికి అన్ని చర్యలు తీసుకుంటామని, దీనికి సంబంధించి మీడియాకు కూడా సరైన మార్గదర్శకాలు విడుదల చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది .

నిమజ్జనానికి ఏర్పాట్లు

నిమజ్జనానికి ఏర్పాట్లు

నిమజ్జనం జరిగే హుస్సేన్ సాగర్ ట్యాంక్ తో పాటు నగర శివారులలోని అన్ని చెరువుల వద్ద నిమజ్జనానికి కావలసిన క్రేన్ల ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం తెలిపింది.

విద్యుత్తు సరఫరాకు ఏర్పాట్లు

విద్యుత్తు సరఫరాకు ఏర్పాట్లు



ఉత్సవాలు జరిగే రోజుల్లో నిరంతర విద్యుత్ సరఫరా, మంచినీటి సరఫరా ఉండేటట్లు తగు చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హామీ ఇచ్చింది.

భక్తి కార్యక్రమాలు

భక్తి కార్యక్రమాలు

అడిషనల్ రేషన్ కోటా విడుదల చేస్తామని, దేవాదాయ ధర్మాదాయ మరియు సాంస్కృతిక శాఖ ద్వారా దేశ భక్తి -దైవ భక్తి కార్యక్రమాల ప్రచారం నిర్వహిస్తామని తెలియజేశారు.

కెసిఆర్ వచ్చాక...

కెసిఆర్ వచ్చాక...

గత ప్రభుత్వం నిర్ణయించిన విధంగా మండపాలకు ఉచిత కరెంట్ ఇవ్వడానికి, గణేష్ ఉత్సవాలకు ప్రత్యేక నిధులు కేటాయించడానికి ముఖ్యమంత్రి విదేశాలనుండి వచ్చాక మరోసారి సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం తెలిపింది.

English summary

 Telangana Deputy CM Mahamood Ali, Home Minister Nayani Narsimha Reddy Review Meeting with Ganesh Uthsava Committe at Secretariat.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X