హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

'మెట్రో' పై వెంకయ్య, నిజం లేదన్న ఎన్‌వీఎస్ రెడ్డి

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుపై తాజాగా ప్రతికా కధనాల విషయంలో తాను స్పందించనని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. ఇంతవరకు వచ్చాక మెట్రో ప్రాజెక్టు వెనక్కి వెళ్లడం సమంజసం కాదన్నారు. నిర్మాణ సంస్ద, ప్రభుత్వం చర్చల ద్వార సమస్యను పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు.

మెట్రో రైలు ఆగిపోతుందంటా ఇటీవల కొన్ని పత్రికల్లో వార్త కధనాలు వచ్చిన విషయం తెలిసిందే. మెట్రో రైలు ప్రాజెక్టుపైన వచ్చిన వివాదాస్పద వార్తలపై తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు బుధవారం వివరణ ఇచ్చారు. తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీసేవిధంగా మెట్రో రైలు పైన కొన్ని పత్రికలు వార్తలు రాస్తున్నాయని ఆయన తరపున ముఖ్యమంత్రి కార్యాలయం పత్రికా ప్రకటనను విడుదల చేసింది.

No comment on hyderabad metro rail : venkaiah naidu

మెట్రో ఎండీ ఎన్‌వీఎస్ రెడ్డి

మెట్రో భూములను ప్రవేటు వ్యక్తులకు ఇచ్చారని రాజకీయ పార్టీలు చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని, రాయదుర్గంలోని పదిహేను ఎకరాలు భూమి ఎల్ అండ్ టీకే ఉందని అన్నారు. మెట్రో రైలు భూములను ప్రయి వేటు వ్యక్తులకు ఇవ్వలేదని మెట్రో ఎండీ ఎన్‌వీఎస్ రెడ్డి తెలిపారు. జీవో నెంబర్ 123 ద్వారా టెర్మినల్ స్టేషన్ పార్కింగ్ అభివృద్దికి ఇచ్చామని పేర్కొన్నారు.

మెట్రో రైలు పనులకు ఎలాంటి ఇబ్బంది లేదని, సాఫీగానే సాగుతున్నాయని మెట్రో రైల్ ఎండీ ఎన్‌వీఎస్ రెడ్డి తెలిపారు. అలైన్‌మెంట్ మార్పునకు సంబంధించి ప్రభుత్వం అధ్యయనం చేస్తోందని, ప్రభుత్వం తుది నిర్ణయానికి వచ్చాక ఎల్ అండ్‌‌టీకి చెబుతామని ఆయన అన్నారు.

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జూదం, మట్కా కేంద్రాలపై దాడులు

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జూదం, మట్కా కేంద్రాలపై పోలీసులు ఈరోజు దాడులు నిర్వహించారు. 19 ప్రాంతాల్లో సాగిన ఈ దాడుల్లో 152 మందిని అరెస్టు చేశారు. ఈ దాడుల్లో రూ. 4.8 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.

English summary
Central minister venkaiah naidu said no comment on Hyderabad metro rail.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X