వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సానియా గురించి అడిగితే, వద్దన్న ఏపీకి వద్దన్న బాబు!

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్‌గా క్రీడాకారిణి సానియా మీర్జా నియామకమైన విషయం తెలిసిందే. దీని పైన గురువారం రాత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును విలేకరులు ప్రశ్నించారు. తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ నియామకం గురించి విలేకర్లు ప్రస్తావించగా.. స్పందించని బాబు, ఆంధ్రప్రదేశ్‌కు అంబాసిడర్ అక్కరలేదని చెప్పారు.

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక గుర్తింపు ఉన్నందు వల్లనే కొందరు అడ్డుకునే ప్రయత్నాలు చేసినా నాడు బిల్ క్లింటన్ హైదరాబాదుకు వచ్చారని చంద్రబాబు అన్నారు. వ్యక్తులను బట్టి ప్రత్యేక గుర్తింపు లభిస్తుందని చెప్పారు. గురువారం రాత్రి మానవ వనరుల అభివృద్ధి రంగం పైన శ్వేతపత్రం విడుదల చేసిన సమయంలో చంద్రబాబు పై వ్యాఖ్యలు చేశారు.

ఏపీ కేబినెట్ భేటీ ప్రారంభం

No need: Chandrababu on Brand Ambassador

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం శుక్రవారం ఉదయం లేక్‌వ్యూ గెస్ట్‌హౌస్‌లో జరిగింది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణపై వారు చర్చించారు. రుణమాఫీ, ఫీ రీయింబర్స్‌మెంట్ పైనా సమావేశంలో చర్చ జరిపినట్లుగా తెలుస్తోంది.

సచివాలయ ప్రధాన ద్వారం రక్షణ వ్యవస్థకు కోటి

తెలంగాణ రాష్ట్ర సచివాలయం ప్రధాన ద్వారం రక్షణ వ్యవస్థ కోసం రూ.1.04 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

English summary
AP CM Nara Chandrababu Naidu on Thursday said no need of Brand Ambassador to AP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X