వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేఈకి నీరు బంద్!: తోసుకున్న టీ ఎమ్మెల్యే, ఏపీ ఎంపీ

By Srinivas
|
Google Oneindia TeluguNews

No water to J block in AP secretariat
హైదరాబాద్/ఏలూరు: ఆంధ్రప్రదేశ్ సచివాలయంలోని జే బ్లాక్‌లో నీటి సరఫరా బంద్ అయింది. మూడు నాలుగు రోజులుగా నీటి సరఫరా బంద్ ఉన్నప్పటికీ పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి ఈ బ్లాకులోనే ఉంటున్నారు. ఆయనతో పాటు పలువురు అధికారులకు మూడు నాలుగు రోజులుగా నీరు రాక ఇబ్బందులు పడుతున్నారంటున్నారు.

తెలంగాణ, ఏపీ ఎమ్మెల్యే, ఎంపీల తోపులాట

పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన పార్లమెంటు సభ్యులు మాగంటి బాబు, ఖమ్మం జిల్లాకు చెందిన అశ్వారావుపేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు పరస్పరం తోసుకున్నారు. వీరిద్దరి మధ్య గురువారం తోపులాట చోటుచేసుకుంది.

పశ్చిమ గోదావరి జిల్లా కుక్కునూరులో జరిగిన పోలవరం ముంపు అంశంపై సమావేశం జరిగింది. రివ్యూ సమావేశాన్ని ఆపాలంటూ ఎమ్మెల్యే వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలోని తెలంగాణవాదులు అడ్డుకున్నారు. అలాగే స్థానిక సమస్యల పైన ఎంపీని నిలదీశారు.

ఇప్పుడు తెలంగాణ ఏంటి? ఈ మండలాలు ఆంధ్రాలో కలిశాయని మాగంటి బాబు సమావేశాన్ని కొనసాగించారు. దీంతో, ఎమ్మెల్యే వెంకటేశ్వర్లు, ఎంపీ బాబుల మధ్య తోపులాట జరిగింది. దీంతో, రివ్యూ మీటింగ్ రసాభాసగా మారింది. సమావేశం అర్ధాంతరంగా నిలిచిపోయింది.

English summary
No water to J block in Andhra Pradesh secretariat from three four days.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X