హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

61ఏళ్ల అరబ్‌షేక్‌కు ఇద్దరు గర్ల్స్‌తో పెళ్లి, అరెస్ట్ (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: హైదరాబాదులోని పాతబస్తీలో అరబ్ షేక్‌లతో బలవంతపు పెళ్లి ఆకృత్యం వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. అతను వారం రోజుల్లోనే ఇద్దరు మైనర్లను పెళ్లి చేసుకున్నాడు.

ఇద్దరు అమ్మాయిలను అరబ్ షేక్‌లతో అక్రమంగా పెళ్లిళ్లు చేయించిన 12 మంది దళారులు, ఖాజీలను అదుపులోకి తీసుకున్నట్టు శనివారం దక్షిణ మండలం డీసీపీ సర్వశ్రేష్ట త్రిపాఠి శనివారం తెలిపారు.

వారి నుంచి మూడు సెల్‌ఫోన్లు, ఒమన్ దేశానికి చెందిన పాసుపోర్టులు, 5 వేల రూపాయలు, 2725 డాలర్లు, 120 రియాళ్లను స్వాధీనం చేసుకున్నారు.

మసూద్

మసూద్

దక్షిణ మండలం డిసిపి కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో సర్వశ్రేష్ట త్రిపాఠి ఇతర పోలీసులతో కలిసి వివరాలను వెల్లడించారు. ఒమన్‌కు చెందిన అల్ మదసారి రాహెద్ మసూద్ రషీద్ (61) ఈ నెల 5న విజిట్ వీసాపై నగరానికి చేరుకున్నారు.

మసూద్

మసూద్

బంజారాహిల్స్‌లోని రోడ్ నంబర్ 11లోని పటేల్ అవెన్యూలో బస చేశారు. అరబ్ షేకులతో అక్రమ పెళ్లిళ్లు నిర్వహించే పాతబస్తీకి చెందిన ఏజెంట్‌లు, బ్రోకర్లను ఆయన సంప్రదించారు. ఈ నెల 9న మహ్మద్ జాఫర్ అలీ, కరీమున్నిసా బేగం అలియాస్ బి ఆమీనా బేగం, మహ్మద్ ఉస్మాన్ రాబియ బేగం సహాయంతో ఓ 14 ఏళ్ల బాలికను పెళ్లి చేసుకోవడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు.

మసూద్

మసూద్

ఆ అమ్మాయి తల్లిదండ్రులకు రూ. 60 వేలు ఇచ్చి పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత ఆ బాలికను బంజారాహిల్స్‌కు తీసుకెళ్లగా ఆ అమ్మాయి అక్కడినుంచి తప్పించుకుని మేనమామ ఇంటికి వచ్చింది.

మసూద్

మసూద్

రెండు రోజుల తర్వాత భవానీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. భవానీనగర్ పోలీసులు ప్రత్యేక బృందాలతో బంజారాహిల్స్‌లోని లాడ్జిపై దాడి చేశారు.

మసూద్

మసూద్

అల్ మదసారి రాషెద్ మసూద్ రషీద్, మరో మైనర్(15)తో ఉండడంతో అదుపులోకి తీసుకున్నారు. మొదటి మైనర్ పెళ్లిలో పాత్ర ఉన్న మహ్మద్ జాఫర్ అలీ(28), కరీమున్నిసా బేగం(70), ఆమీనా బేగం(40), మహ్మద్ ఉస్మాన్(47) వివాహం జరిపించిన ఖాజి మహ్మద్ గౌస్ మొయినుద్దీన్ (60), రాబియా బేగంను అదుపులోకి తీసుకున్నారు.

మసూద్

మసూద్

రెండో మైనర్ (15) కేసులో అరబ్ షేక్‌తోపాటు దళారులు మహ్మద్ జాఫర్అలీ, షహనాజ్ బేగం, హసీనా బేగం, షాకిరా బేగం, మహ్మద్ జాహెద్ అలీ హైదర్, రషీద్ అలీ మసీదు మౌజన్, రెండో పెళ్లి చేసిన ఖాజీలను అదుపులోకి తీసుకున్నారు.

మసూద్

మసూద్

వారిని విచారించగా రెండో పెళ్లి చేసుకున్న బాలిక తల్లిదండ్రులకు రూ.80 వేలు ఇచ్చినట్టు నిందితులు ఒప్పుకున్నారు. 12 మందిని రిమాండ్‌కు తరలించినట్టు డిసిపి చెప్పారు. మైనర్ల పెళ్లి విషయంలో ఇంకా ఎంతమంది పాత్ర ఉందో విచారణ జరుపుతున్నట్టు ఆయన తెలిపారు.

మసూద్

మసూద్

హైదరాబాదులోని పాతబస్తీలో అరబ్ షేక్‌లతో బలవంతపు పెళ్లి ఆకృత్యం వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఆయనతో పాటు పలువురిని పోలీసులు అరెస్టు చేశారు.

English summary
In yet another case of sham marriage, a 61 year old Omani national married two minor girls from Old City in Hyderabad within one week.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X