వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మెగా కిక్: 'అన్నయ్య' మదిలో 'తమ్ముడు', షాకైనా..

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: మెగా సోదరులు... చిరంజీవి, పవన్ కళ్యాణ్‌లు ఒకరిపై ఒకరు చూపించుకుంటున్న ఆప్యాయత అభిమానులకు కొండంత ఊరటనిస్తుందనే చెప్పవచ్చు. నిన్న జనసేన పార్టీని స్థాపించిన పవన్ కళ్యాణ్.. చిరును సమర్థిస్తే, నేడు తన పుట్టిన రోజు సందర్భంగా వివిధ పత్రికలకు ఇచ్చిన ఇంటర్వ్యూలలో చిరంజీవి 'తమ్ముడ్ని' వెనుకేసుకొచ్చారు. తద్వారా అభిమానులకు మెగా సోదరులు 'కిక్' ఇచ్చారంటున్నారు.

ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసు పార్టీలో విలీనం చేసినప్పటి నుండి పవన్ అన్నయ్య పైన అలక వహించినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. మెగా ఫ్యామిలీ సినిమా వేడుకల పైన పవన్ కనిపించక పోవడంపై పదేపదే వివరణ ఇవ్వాల్సి వచ్చేది. అనంతరం పవన్ జనసేన పార్టీ స్థాపించడం సంచలనం కలిగించింది. పవన్ పార్టీ పెడతారని చాలామంది ఊహించలేదు. దానిని కేవలం రూమర్‌గా కొట్టి పారేసిన వారు ఉన్నారు.

Chiranjeevi - Pawan Kalyan

అయితే, పవన్ జనసేన పార్టీని స్థాపించడంతో.. సార్వత్రిక ఎన్నికల్లో అన్నాదమ్ముల సవాల్ అన్నట్లుగా కథనాలు వచ్చాయి. ప్రచారం సమయంలో పవన్ కళ్యాణ్ సభలకు జనం ఎగబడ్డారు. చిరు సభలు వెలవెలపోయినట్లుగా కథనాలు వచ్చాయి. చిరంజీవి కాంగ్రెసు పార్టీలో ఉండగా.. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించడంతో ఇరువురు మధ్య విభేదాలు తారాస్థాయికి చేరినట్లేనని అందరు భావించారు.

అయితే, పార్టీ పెట్టిన సమయంలోను, ఆ తర్వాత కూడా పవన్ 'అన్నయ్య' పైన వివరణ ఇచ్చారు. తాను అన్నయ్యకు వ్యతిరేకం కాదని చెప్పారు. ఓ సమయంలో విభజన తీరును తప్పుపడుతూ.. అది కాంగ్రెసు పార్టీ చేసిన తప్పు అని, తన అన్నయ్య ఏం చేస్తారన్నట్లుగా మాట్లాడారు. తనకు ఆయనతో విభేదాల్లేవని చెప్పారు. ఇప్పుడు చిరంజీవి కూడా పవన్‌ను వెనుకేసుకొచ్చారు. గతంలోను ఆయన తమ్ముడి గురించి మాట్లాడారు.

పుట్టిన రోజు సందర్భంగా వివిధ పత్రికలకు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. పవన్ పార్టీ పెడుతున్నానని చెప్పినప్పుడు షాకయ్యానని, కానీ తాను (చిరు) ఎందుకు పార్టీ పెట్టాడు, ప్రజలకు మేలు చేయాలని ఎలా అనుకున్నానో తను కూడా అలాగే అనుకుంటున్నాడని, ప్రజలకు సేవ చేసేందుకు వేరే మార్గం ఎంచుకున్నాడు.. అంతేనని, దానికి తాను బాధపడాల్సిన అవసరం లేదని భావించానని చిరు చెప్పారు.

అంతేకాదు, తాను రాజకీయాల్లోకి రావడం, పార్టీ పెట్టడమనేది తమ సంబంధాలను దెబ్బతీయలేదని, అందరి కుటుంబాల మాదిరిగానే తాము కలుస్తూ ఉంటామని చెప్పారు. తమ మధ్య విభేదాలున్నాయనేది అవాస్తవమన్నారు. తమది బలహీనమైన బంధం కాదని, రాజకీయం తమ జీవితం కాదని, రాజకీయాల్లోను తాను నాకు వ్యతిరేకం కాదని చిరు అన్నారు. మరో మార్గం మాత్రమే ఎంచుకున్నాడన్నారు.

English summary
Megastar Chiranjeevi, who is all set to make his 
 
 comeback to films, has finally opened up on the 
 
 rumours about the tiff between him and his brother 
 
 Pawan Kalyan on his 59th birthday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X