వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పవన్ కళ్యాణ్ ఆగ్రహం: బాబుకు చిక్కులు, బిజెపి సేఫ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ విజయవాడ లోకసభ టిక్కెట్‌ను కేశినేని నానికి ఇచ్చినప్పటికీ... ఆ కలకలం కొనసాగుతోంది. ఇందుకు ప్రధాన కారణం జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్‌కు అత్యంత సన్నిహితుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త పొట్లూరి వర ప్రసాద్‌కి ఆ సీటు దక్కడకపోవడమే. చివరి వరకు విజయవాడ ఎంపి సీటు ఆశపడి భంగపడ్డ పివివి, ఆయన వర్గం తెలుగుదేశం పార్టీపై గుర్రుగా ఉంది.

ఆ సీటు పివిపి పేరు పరిశీలించాల్సిందిగా పవన్ కళ్యాణ్ స్వయంగా టిడిపి అద్యక్షులు నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లినట్లుగా వార్తలు వచ్చాయి. పవన్ నేరుగా బిజెపికి మద్దతివ్వడం, రాష్ట్రంలో బిజెపి, టిడిపిల మధ్య పొత్తు కుదరడంతో పరోక్షంగా పవన్ టిడిపికి కూడా మద్దతిచ్చినట్లే భావించాల్సి ఉంటుంది. దీంతో పవన్ ప్రభావంతో సీమాంధ్రలో టిడిపికి కాస్త బలం చేకూరుతుందని భావించిన చంద్రబాబు తొలుత విజయవాడ సీటు పివిపి కేటాయించేందుకు సిద్ధపడినట్లు సమాచారం.

ఆ దిశగా కేశినేనిని ఒప్పించేందుకు పార్టీ ముఖ్య నేతలు సుజానా చౌదరి, కొణకళ్ల నారాయణ తదితరులను రంగంలోకి దించారు. కష్టకాలంలో పార్టీని అండగా ఉన్నానని సీటు తనకే కేటాయించాలని కేశినేని నాని చెప్పి నెగ్గించుకున్నారు. దీంతో పవన్ లాబీయింగ్‌తో సీటు దక్కుతుందనుకున్న పివిపి వర్గం టిడిపిపై ఆగ్రహంగా ఉంది. నాని ఓడించేందుకు సర్వ శక్తులొడ్డుతామని, అవసరమైతే పివిపిని స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దించుతామని పివివి వర్గం చెబుతోందట.

Pawan Kalyan angered by Chandrababu Naidu’s snub to industrialist Potluri Vara Prasad

కాగా విజయవాడ సీటుపై చివరి వరకు గంపెడు ఆశలు పెట్టుకుని నిరాశకు గురైన పివిపి.. పవన్ కళ్యాణ్ కలిసి చర్చించారు. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ ఎన్నికల్లో విజయవాడ లోకసభ స్థానంతో పాటు మరో ఆరు స్థానాలకు పోటీ చేస్తుందని వార్తలు వచ్చాయి. అయితే మొదట ఆ ఆరు స్థానాలు అసెంబ్లీ అని చెప్పినప్పటికీ... అవి కూడా లోకసభ అని తెలుస్తోంది. విజయవాడతో కలిపి మొత్తం ఏడు లోకసభ స్థానాలకు జనసేన పోటీ చేయనుందంటున్నారు.

అదే నిజమైతే టిడిపి, చంద్రబాబుకు ఇబ్బంది తప్పదంటున్నారు. ఇప్పటికే పురంధేశ్వరికి రాజంపేట కేటాయింపుపై టిడిపి అసంతృప్తితో ఉంది. బిజెపి-టిడిపి పొత్తుపై ప్రభావం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు పవన్ ఏడు లోకసభ స్థానాల్లో అభ్యర్థులను నిలిపి వారి తరఫున ప్రచారం చేస్తే ఇబ్బందులు తప్పవంటున్నారు.

పవన్ అభ్యర్థులు టిడిపి అభ్యర్థుల స్థానాల్లోనే పోటీ చేసే అవకాశాలున్నాయంటున్నారు. బిజెపి పోటీ చేసే నాలుగు నియోజకవర్గాల్లో వారి తరఫున పవన్ ప్రచారం చేయవచ్చునని అంటున్నారు. తద్వారా బిజెపి సేఫ్ సైడ్‌లో ఉండగా.. బాబుకు చిక్కులు తప్పవంటున్నారు. పవన్ ప్రచారంతో ఎంతో కొంత లబ్ధి పొందుదామని భావించిన టిడిపికి పవన్ నిర్ణయాలతో లాభం కంటే నష్టమే ఎక్కువ జరిగే అవకాశం ఉంది.

English summary

 Pawan Kalyan had sent feelers to the BJP-Telugudesam combine to spare the Vijayawada Lok Sabha seat for his industrialist-producer friend Potluri Vara Prasad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X