వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పవన్ కళ్యాణ్ రాష్ట్ర యువత: బెజవాడలో ఫ్యాన్స్ భేటీ!

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు కొత్తగా అభిమాన సంఘాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమైనట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. వీరు పవన్ కళ్యాణ్ రాష్ట్ర యువత పేరుతో అభిమాన సంఘాన్ని ఏర్పాటు చేయనున్నారని తెలుస్తోంది.

చిరంజీవి అభిమాన సంఘం భేటీ కంటే ముందే పవన్ కళ్యాణ్ అభిమానులు భేటీ కావాలని నిర్ణయించుకున్నారని వినికిడి. ఈ సమావేశం రాజమండ్రి లేదా విజయవాడలో ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది.

Pawan Kalyan fans to meet before September 30

కాగా, చిరంజీవి, పవన్ కళ్యాణ్ అభిమానుల మధ్య చీలిక వచ్చిన విషయం తెలిసిందే. తిరుపతిలో ఏర్పాటు చేస్తున్న చిరంజీవి అభిమాన సంఘాల సమావేశానికి హాజరు కావద్దని హైదరాబాద్‌ నుంచి ఆదేశాలు వచ్చినట్టు పవన్‌ కళ్యాణ్ అభిమాన సంఘం చిత్తూరు జిల్లా అధ్యక్షుడు కిరణ్‌ ఇటీవల తెలిపారు. త్వరలోనే పవన్‌ కళ్యాణ్‌ అభిమానుల సమావేశం నిర్వహిస్తామని, రాష్ట్రస్థాయి పవన్‌ అభిమాన సంఘాన్ని త్వరలోనే ఏర్పాటు చేస్తామని కిరణ్‌ తెలిపారు.

ఈ నెల 30 తిరుపతిలో చిరంజీవి, పవన్‌ అభిమాన సంఘాల సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు చిరంజీవి అభిమాన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు స్వామి నాయుడు తెలిపారు. 30న ఫ్యాన్స్‌డేగా జరపాలని నిర్ణయించామని చెప్పారు.

పవన్ కళ్యాణ్‌ రాజకీయ విధానాన్ని తాము వ్యతిరేకిస్తామన్నారు. అయితే చిరు సోదరుడిగా ఆయన్ని అభిమానిస్తామన్నారు. చిరు, పవన్, చెర్రీ, అల్లు అర్జున్ అభిమానుల మధ్య ఎలాంటి విభేదాల్లేవన్నారు. అయితే, స్వామి నాయుడు ఏర్పాటు చేసే సమావేశానికి హాజరు కావద్దని కిరణ్.. పవన్ కళ్యాణ్ అభిమానులను కోరారు.

English summary
It is said that, Jana Sena party chief Pawan Kalyan fans to meet before September 30 in Vijayawada or Rajahmundry.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X