వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీతో పవన్, నాగ్: భిన్నంగా ఎన్టీఆర్ ఇలా! (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీని టాలీవుడ్ ప్రముఖులు వరుసగా కలవడం రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. దీంతో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను మలుపు తిప్పిన స్వర్గీయ నందమూరి తారక రామారావు పేరు మరోసారి చర్చకు వస్తోంది. ఆయన నుండి... రాజకీయాల్లోకి వస్తున్న నేటి నటులు తెలుసుకోవాల్సి ఉందా? అనే కోణంలోను వార్తలు వెలువడుతున్నాయి.

రాష్ట్ర రాజకీయాల్లో ఎన్టీఆర్ టిడిపిని స్థాపించి ఓ రెవెల్యూషన్ తీసుకు వచ్చారు. అతను ప్రజల్లోకి చొచ్చుకు పోయారు. రాజకీయాల్లోకి రావడం ఎన్టీఆర్‌తోనే ప్రారంభం కాదు... ఎన్టీఆర్‌తోనే ఆఖరు కాదు. కానీ రాష్ట్ర రాజకీయాల్లోను, సినిమా పరిశ్రమలోను ఆయన ముద్ర కచ్చితంగా కనిపిస్తుందంటున్నారు. ఎన్టీఆర్‌లా చాలామంది నటులు రాజకీయాల్లోకి వచ్చినప్పటికీ ఆయనలా విజయం సాధించలేకపోయారంటున్నారు.

అటు రాజకీయాల్లో, ఇటు సినిమాల్లో.. రెండింట్లోను దిగ్గజంగా నిలిచిపోయింది మాత్రం ఎన్టీఆరే అంటున్నారు. ఇందుకు ఎన్నో కారణాలు ఉన్నాయంటున్నారు. ఆరాధ్య దైవాలైన రాముడు, కృష్ణుడు పాత్రలు పోషించడం, పార్టీ పెట్టాక ప్రజల్లోకి బాగా వెళ్లడం తదితర ఎన్నో కారణాలు ఉన్నాయంటున్నారు. ఇవన్నింటిని పక్కన పెడితే ఎన్టీఆర్ ప్రజల కోసం తమ తన స్వార్థం కోసం రాజకీయాల్లోకి రాలేదనే టిడిపి వాదనను గుర్తు చేస్తున్నారు.

 ఎన్టీఆర్

ఎన్టీఆర్

స్వర్గీయ నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి ప్రభంజనం, సంచలనం సృష్టించారు.

 చిరంజీవి

చిరంజీవి

ప్రస్తుత కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి 2008లో ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు. 2009 ఎన్నికల్లో చిరు పార్టీ గెలుపొందడం ఖాయమని లేదా అరవై నుండి 70 స్థానాల వరకు గెలవడం ఖాయమని భావించారు. కానీ 18 స్థానాలతో సరిపెట్టుకుంది.

 పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్

ఇటీవలె జనసేన పార్టీ స్థాపించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్... బిజెపి ప్రధాన మంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీని కలిసి సంచలనం సృష్టించారు. తన పోటీ లేదా జనసేన పార్టీ పోటీ, టిడిపితో పొత్తు తదితర అంశాలపై పవన్ ఇంకా సైలంటుగా ఉన్నారు.

నాగార్జున

నాగార్జున

యువసామ్రాట్ అక్కినేని నాగార్జున కూడా ఇటీవల నరేంద్ర మోడీని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. మోడీ వద్దకు టాలీవుడ్ నేతలు క్యూ కడుతున్నారంటూ... ఇంకా పలువురి పేర్లు వినిపిస్తున్నాయి.

 ఎన్టీఆర్

ఎన్టీఆర్

ఎన్టీఆర్ తన వ్యాపార, ఇతర లాభాల కోసం రాజకీయ ఆరంగేట్రం చేయలేదని, కానీ ఇప్పటి తారలు మాత్రం తన వ్యాపార.. ఇతర అవసరాల కోసం రాజకీయ నేతలను కలుస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

English summary
When the legendary N T Rama Rao hung up his jackboots and chose to don the political robes, he was a revolution. He could effortlessly connect with the masses.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X