వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

145 పేజీలు, 12 అధ్యాయాలు: ఇదే పవన్‌కళ్యాణ్ ఇజం!

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్/విశాఖ: పవర్ స్టార్ గురువారం సాయంత్రం విశాఖలో ఇజం పుస్తకాన్ని లాంచ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ పుస్తకంలో ఎన్నో అంశాలు ఉన్నాయంట. 145 పేజీలు, 12 అధ్యాయాలతో కూడిన ఈ పుస్తకంలో సమాజ హితమే ప్రాతిపదికగా ఉందట. ఇజం.. జనసేన పార్టీ సిద్ధాంతం. నోబుల్ థింగ్స్ ఆర్ నెవర్ ఈజీ... నార్ ఆర్ దె కామన్.. అనే సూక్తితో పుస్తకం మొదలవుతుందట. న్యాయం కోసం పరి తపించే ప్రతి ఒక్కరికీ.. ఈ పుస్తకాన్ని అంకితం చేశారట.

స్టేట్ అనే పదాన్ని దేశం అనే అర్థంలోనే వాడామని తెలిపారు. కమ్యూనిటీని కులం అనే అర్థంలో వాడలేదు. రాజు రవితేజ్‌తో కలిసి పవన్ రచించిన ఈ పుస్తకంలో ఎన్నో అంశాలు ఉన్నాయట. ఇజం అంటే ఏమిటి... పవన్ కళ్యాణ్ ఐడియాలజీ ఏమిటి తదితర అంశాలు ఇందులో పొందుపర్చారట. ఇజం అంటే ఐడియలిజం... అనే ఉద్దేశ్యంతోనే ఆ పేరు పెట్టారట.

Pawan Kalyan

ఇజం.. పవన్ చేస్తున్న సైద్ధాంతిక ప్రకటన అని రాజు రవితేజ్ పేర్కొంటున్నారు. ప్రజలతో, సమాజంతో స్పష్టమైన సైద్ధాంతిక బంధం ఏర్పాటు చేసుకోవాలని పవన్ భావిస్తున్న సమయంలోనే ఈ పుస్తకం రాశామని తొలి అధ్యాయం హౌ ఇజం వాజ్ కన్సీవ్డ్ అండ్ రిటన్‌లో పేర్కొన్నారు.

ఈ సమాజానికి ఎలాంటి సైద్ధాంతిక ప్రాతిపదిక ఉండాలి? అని పవన్ కళ్యాణ్ ముప్పై ఏళ్లుగా ప్రశ్నించుకుంటూనే ఉన్నారని, తనకు తాను వేసుకున్న ఈ ప్రశ్నకు.. తాను ఇస్తున్న సమాధామే ఈ పుస్తకమంటున్నారు. ఒక్కో అధ్యాయంలో ఒక్కో అంశం గురించి వివరించారట.

English summary
Hectic preparations are underway for Pawan Kalyan public address in Vishakapatnam. The Power Star will address the crowds at the Indira Priyadarshini Stadium in Vishakapatnam.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X