వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పవన్ సభ, వేదికపై మరో ఇద్దరే: ఏం చెప్తారు?(పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

విశాఖ/హైదరాబాద్: విశాఖ నగరంలోని ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియంలో గురువారం జరగనున్న జనసేన పార్టీ బహిరంగ సభకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. పవన్ కళ్యాణ్ పార్టీ ప్రకటించిన తరువాత జరుగుతున్న మొట్టమొదటి సభ కావడంతో సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. పవన్ ఈ సభలో ఏమీ మాట్లాడుతారు? ఎన్నికల్లో పోటీకి సంబంధించి ఎటువంటి ప్రకటన చేస్తారు? అని అభిమానులు, ఇతరులు ఉత్కంఠతో ఉన్నారు.

సభను విజయవంతం చేసే బాధ్యతను అభిమానులు భుజాన వేసుకున్నారు. మున్సిపల్ స్టేడియంలో భారీ వేదిక ఏర్పాటు దాదాపు పూర్తి కావొచ్చింది. సభకు వచ్చే మహిళల కోసం ప్రత్యేకంగా గ్యాలరీ ఏర్పాటు చేస్తున్నారు. గురువారం ఉదయం విశాఖ చేరుకోనున్న పవన్ కళ్యాణ్‌కు విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికేందుకు అభిమానులు సిద్ధమవున్నారు. సీమాంధ్రలోని వివిధ జిల్లాల నుంచి భారీగా అభిమానులు పవన్ సభకు తరలిరానున్నారని పవన్ ఫ్యాన్స్ అసోసియేషన్ తెలిపింది.

జనసేన బహిరంగ సభకు భారీఎత్తున యువత తరలివస్తున్నట్టు పవన్ ఫ్యాన్స్ అసోసియేషన్ నగర అధ్యక్షుడు శివప్రసాద్ రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సభలో పవన్ ప్రసంగం యువతను ఉద్దేశించే ఎక్కువగా ఉంటుందన్నారు. ఈ నేపథ్యంలో యువత భారీగా తరలివచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. బుధవారం ఉదయం మద్దిలపాలెం నుంచి కొమ్మాది, ఆర్కే బీచ్ వరకూ భారీ ర్యాలీ నిర్వహించనున్నట్టు చెప్పారు.

సాయంత్రం బీచ్ రోడ్డులో 'జనసేన వాక్' నిర్వహిస్తామన్నారు. ఈ సందర్భంగా జనసేన బ్రోచర్‌ను విడుదల చేశారు. ఈ సభకు ఎస్.రాయవరంలోని పోలవరం గ్రామానికి చెందిన మత్స్యకార యువకులు 60 మంది 97 కిలోమీటర్లు పాదయాత్రగా, బహిరంగ సభకు చేరుకుంటారని పవన్ అభిమానులు తెలిపారు.

పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్ సభ కోసం గురువారం మధ్యాహ్నం విశాఖకు చేరుకుంటారు. ఇక హైటెక్ హంగులతో ఏర్పాటుచేసిన బహిరంగ సభా వేదికపై సాయంత్రం నాలుగు గంటల నుంచి కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. ఆరు గంటలకు పవన్ కల్యాణ్ సభా వేదిక వద్దకు చేరుకుంటారు.

పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్

వేదికపై ఆయనతో పాటు మరో ఇద్దరు, ముగ్గురు ఆశీనులవుతారంటున్నారు. ఆయనకు సన్నిహితుడైన రాజు రవితేజతోపాటు రెండువేల అడుగుల జెండాను రూపొందించిన మరో అభిమాని వేదికపై కూర్చుంటారని స్థానిక నేతలు చెబుతుంటారు. ఆ జెండాను పవన్ ఆవిష్కరిస్తారు.

పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్

జనసేన బహిరంగ సభకు భారీఎత్తున యువత తరలివస్తున్నట్టు పవన్ ఫ్యాన్స్ అసోసియేషన్ నగర అధ్యక్షుడు శివప్రసాద్ రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సభలో పవన్ ప్రసంగం యువతను ఉద్దేశించే ఎక్కువగా ఉంటుందన్నారు.

పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్ సభకు యువత భారీగా తరలివచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. బుధవారం ఉదయం మద్దిలపాలెం నుంచి కొమ్మాది, ఆర్కే బీచ్ వరకూ భారీ ర్యాలీ నిర్వహించనున్నట్టు చెప్పారు. ఈ సభలో ఇజం పుస్తకాన్ని ఆవిష్కరించనున్నారు.

English summary
Pawan Kalyan's public meet on 27th march in Vishakapatnam.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X