మెదక్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆర్తనాదాలు, ఫ్యామిలీలోని పిల్లలందరు(పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

మెదక్/హైదరాబాద్: మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మాసాయిపేట వద్ద నాందేడ్ ప్యాసెంజర్ రైలు పాఠశాల బస్సును ఢీకొన్న ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్ సహా 16 మంది చిన్నారులు మృతి చెందిన విషయం తెలిసిందే.

గురువారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేటు పాఠశాల బస్సు గేట్‌మ్యాన్ లేని లెవల్ క్రాసింగు వద్ద దాటుతుండగా నాందేడ్ ప్యాసింజర్ రైలు ఢీ కొట్టింది.

సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించగా, తీవ్రంగా గాయపడిన వారిని సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. కాగా, ఈ ప్రమాదంలో ఒకే ఫ్యామిలీకి చెందిన చిన్నారులు పలు కుటుంబాల వారు చనిపోయారు.

ప్రమాదం

ప్రమాదం

మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మాసాయిపేట వద్ద నాందేడ్ ప్యాసెంజర్ రైలు పాఠశాల బస్సును ఢీకొన్న ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్ సహా 17 మంది చిన్నారులు మృతి చెందిన విషయం తెలిసిందే.

ప్రమాదం

ప్రమాదం

గురువారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేటు పాఠశాల బస్సు గేట్‌మ్యాన్ లేని లెవల్ క్రాసింగు వద్ద దాటుతుండగా నాందేడ్ ప్యాసింజర్ రైలు ఢీ కొట్టింది.

 ప్రమాదం

ప్రమాదం

సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించగా, తీవ్రంగా గాయపడిన వారిని సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు.

ప్రమాదం

ప్రమాదం

ప్రమాదం జరిగిన వెంటనే 13 మంది విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. ఇంకొందరు ఆసుపత్రులలో చికిత్స పొందుతూ మృతి చెందారు.

ప్రమాదం

ప్రమాదం

ప్రమాదానికి గురైన బస్సు తూప్రాన్‌ను చెందిన కాకతీయ పాఠశాలది. కాపలా లేని రైల్వే గేట్ వద్ద రైలు వస్తున్న విషయాన్ని గమనించని బస్సు డ్రైవర్ దూకుడుగా పట్టాలు దాటించేందుకు ప్రయత్నించగా ఇంతలోనే బస్సును రైలు ఢీకొట్టి కిలో మీటర్ మేర ఈడ్చుకెళ్లింది.

ప్రమాదం

ప్రమాదం

ఈ ప్రమాదంలో బస్సు నుజ్జునుజ్జు అయ్యింది. ప్రమాదస్థలి వద్ద మృతదేహాలు చెల్లాచెదురుగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతులు ఇస్లాంపూర్, వెంకటాపల్లి, గునపల్లి ప్రాంతానికి చెందిన విద్యార్థులుగా గుర్తించారు.

ప్రమాదం

ప్రమాదం

మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందంటున్నారు. రైల్వే గేట్ వద్ద మలుపు ఉండటంతో రైళ్లు కనిపించే అవకాశం తక్కువని, రైల్వే గేటు వెయ్యక పోవడంతోనే డ్రైవర్ ముందుకు వెళ్లినట్లు స్థానికులు తెలిపారు.

ప్రమాదం

ప్రమాదం

రోజూ ఇదే సమయానికి ఎక్స్‌ప్రెస్ రైలు అటు వైపు వెళ్తుందని వారు చెబుతున్నారు. స్కూల్‌కు వెళ్లిన తమ బిడ్డలు విగతజీవులుగా మారడంతో విద్యార్థుల తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.

ప్రమాదం

ప్రమాదం

పాఠశాల యాజమాన్యం గురువారం నాడు రోజూ అలవాటు ఉన్న డ్రైవర్‌ను గాక కొత్త డ్రైవర్‌ను పంపించింది. ఈ డ్రైవర్ మూడు రోజుల క్రితమే వచ్చాడు. ప్రమాదంలో అతను కూడా చనిపోయాడు.

 ప్రమాదం

ప్రమాదం

మెదక్ జిల్లా మాసాయిపేట వద్ద ఇవాళ ఉదయం ప్రమాదానికి గురైన స్కూల్ బస్సులో ఎంతమంది చిన్నారులున్నారన్న దానిపై స్పష్టత వచ్చింది.

 ప్రమాదం

ప్రమాదం

బస్సులో మొత్తం 36 మంది చిన్నారులు ప్రయాణిస్తున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత ఘటనాస్థలిలోనే కొందరు ప్రాణాలు కోల్పోయారని మెదక్ జిల్లా కలెక్టర్ ప్రకటించారు.

ప్రమాదం

ప్రమాదం

వీరితో పాటు బస్సు డ్రైవర్, క్లీనర్ మృతి చెందారు. వారి పేర్లను కూడా కలెక్టర్ వెల్లడించారు. మరికొందరు పిల్లలు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే కన్నుమూశారు.

ప్రమాదం

ప్రమాదం

మరో 20 మంది చిన్నారులు సికింద్రాబాదు యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని యశోదా ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. దీంతో ఆ బస్సులో 36 మంది విద్యార్థులు ఉన్నట్లు స్పష్టమవుతోంది.

ప్రమాదం

ప్రమాదం

మెదక్ జిల్లా మాసాయిపేట వద్ద గురువారం ఉదయం జరిగిన స్కూల్ బస్సు ప్రమాదంపై గవర్నర్ నరసింహన్ సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు గవర్నర్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

ప్రమాదం

ప్రమాదం

రైల్వే ఉన్నతాధికారులు తమ కిందిస్థాయి అధికారుల లోపాలు ఎంచుతారు తప్ప సమస్యల పరిష్కారానికి చొరవ చూపరని తెలంగాణ రాజకీయ జేఏసీ ఛైర్మన్ కోదండరాం ఆరోపించారు.

ప్రమాదం

ప్రమాదం

హైదరాబాదులోని యశోద ఆసుపత్రిలో క్షతగాత్ర బాలలను పరామర్శించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ వ్యాప్తంగా 14 వేలకు పైగా రైల్వే గేట్లు లేని జంక్షన్లు ఉన్నాయని రైల్వే నివేదిక తెలుపుతోందని అన్నారు.

ప్రమాదం

ప్రమాదం

ఈ జంక్షన్లలో గేట్లు నిర్మించాలని కోదండరామ్ డిమాండ్ చేశారు. మృతుల తల్లిదండ్రుల కడుపుకోత ఎవరు తీర్చగలరని ఆయన ప్రశ్నించారు. ఇకపై ఇలాంటి దుర్ఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.

ప్రమాదం

ప్రమాదం

ఎన్నికల తరువాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తొలిసారి బయటకు వచ్చారు. మెదక్ జిల్లా మాసాయిపేట వద్ద జరిగిన ప్రమాదంలో క్షతగాత్రులైన పసివారిని పరామర్శించారు.

ప్రమాదం

ప్రమాదం

పరామర్శించిన అనంతరం పవన్ మాట్లాడుతూ... ప్రభుత్వాలు శ్రద్ధ చూపితే ఇలాంటి దారుణాలు చోటుచేసుకోవని అన్నారు. ఈ సంఘటనను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.

ప్రమాదం

ప్రమాదం

పసివారి హృదయవిదారక యాతన చూస్తుంటే ఏం చేయాలో పాలుపోవడం లేదని పవన్ పేర్కొన్నారు. మరో 12 గంటలు గడిస్తే కానీ క్షతగాత్రుల పరిస్థితి చెప్పలేమని వైద్యులు తెలిపారని పవన్ తెలిపారు.

ప్రమాదం

ప్రమాదం

మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మాసాయిపేట వద్ద నాందేడ్ ప్యాసెంజర్ రైలు పాఠశాల బస్సును ఢీకొన్న ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్ సహా 17 మంది చిన్నారులు మృతి చెందిన విషయం తెలిసిందే.

 ప్రమాదం

ప్రమాదం

గురువారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేటు పాఠశాల బస్సు గేట్‌మ్యాన్ లేని లెవల్ క్రాసింగు వద్ద దాటుతుండగా నాందేడ్ ప్యాసింజర్ రైలు ఢీ కొట్టింది.

English summary
Photos of children killed in train-school bus collision in Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X