వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పటేల్‌పై ఆగ్రహం, అక్కడ దండాలు, నిజాంపై..(పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: భారత దేశంలో పెద్దదైన హైదరాబాద్ సంస్థానాన్ని విలీనం పేరుతో పటేల్ యూనియన్ సైన్యాలు తెలంగాణ ప్రజల గుండెల్లో అశాంతిని నిలిపి, పల్లెల్లో రక్తపుటేరులు సాధించిన దినం సెప్టెంబర్ 17 ముమ్మాటికి విద్రోహదినమని సీపీఐ(ఎంఎల్)న్యూడెమోక్రసీ ఆరోపించింది.

కానీ కొన్ని రాజకీయ పార్టీలు, సంస్థలు విలీనం, విమోచనం అంటూ చరిత్రను వక్రీకరిస్తున్నాయని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. చరిత్రను వక్రీకరించడం సరికాదన్నారు.

విద్యానగర్‌లోని ఐఎఫ్టీయూ రాష్ట్ర కార్యాలయంలో సెప్టెంబర్ 17ను వారు విద్రోహదినంగా పాటించారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.

సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ

సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ

తెలంగాణ సాయుధ పోరాటం భూముల కోసం, భుక్తికోసం, భారత దేశ విముక్తి కోసం జరిగిన పోరాటమని, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించిందని వక్తలు అన్నారు.

సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ

సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ

10 లక్షల ఎకరాల భూమిని పంచి 3వేల ఎకరాల గ్రామాల్లో కమ్యూనిస్టు రాజ్యాలను ఏర్పాటు చేసుకొని పాలన సాగిస్తున్నారని, దీనిని అడ్డుకోవడానికే పటేల్ సైన్యాలు కమ్యూనిస్టు విప్లవకారులను ఊచకోత కోయించారన్నారు.

సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ

సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ

అదే విధంగా కాశీమ్ రజ్వీ ప్రయివేటు సైన్యాల నుండి ప్రజలను రక్షించే పేరిట లక్షలాదిమంది యువకులను హత్య చేశారని, ఈ సైన్యాలు ప్రజా పోరాటాలను అణిచివేసే లక్ష్యంతో పనిచేసి ప్రజలకు అందాల్సిన రాజ్యాన్ని దూరం చేశాయన్నారు.

గాంధీ భవన్

గాంధీ భవన్

హైదరాబాదులోని గాంధీ భవన్‌లో విలీన దినోత్సవాన్ని నిర్వహించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ పటానికి నివాళులు అర్పిస్తున్న జానారెడ్డి.

గాంధీ భవన్

గాంధీ భవన్

హైదరాబాదులోని గాంధీ భవన్‌లో విలీన దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జనగణమణ గీతాన్ని ఆలపిస్తున్న తెలంగాణ కాంగ్రెస్ నాయకులు.

గాంధీ భవన్

గాంధీ భవన్

హైదరాబాదులోని గాంధీ భవన్‌లో విలీన దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతున్న తెలంగాణ పీసీసీ అధ్యక్షులు పొన్నాల.

English summary
Photos of cpml new democracy celevbrations.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X