వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సంతోషంలో, బాబు బొమ్మతో నాగలి దున్నారు(పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రుణమాఫీ పైన రైతు కుటుంబాల్లో ఆనందం వెల్లివిరుస్తోందని, ఆర్థిక పరిస్థితులు అనుకూలించకపోయినా, రైతాంగానికి బాసటగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిలిచారని, పల్లెలు, పట్టణాలు, అన్నిచోట్ల ముఖ్యమంత్రి నిర్ణయం పైనే ఆసక్తికర చర్చ జరుగుతోందని, రైతు, డ్వాక్రా మహిళలకు కేబినెట్ నిర్ణయం కొండంత బలాన్ని ఇచ్చిందని బుధవారం కమీషనర్, సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి నుండి ఓ ప్రకటన జారీ అయింది.

రైతు కష్టాలను వస్తున్నా మీకోసం పాదయాత్రలో చంద్రబాబు కళ్లారా చూశారని, రైతులు కూడా రుణాలను మాఫీ చేస్తానని హామీ ఇచ్చారని, రుణమాఫీ వల్ల ఇబ్బందులుంటాయని, రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి కూడా అనుకూలంగా ఉందని, ఎవరెన్ని కారణాలు రైతులకు చెప్పినా ఇచ్చిన మాటను చంద్రబాబు నిలుపుకున్నారని, సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రుణమాఫీ పైన తొలి సంతకం చేసిన చంద్రబాబు, కమిటీ అధ్యయనం చేసి నివేదిక ఇచ్చిన తర్వాత 45 రోజుల్లో విధివిధానాలను ప్రకటిస్తానని కేవలం 43 రోజుల వ్యవధిలో ప్రకటించారని పేర్కొన్నారు.

రాష్ట్రంలో ప్రతి రైతు కుటుంబానికి గరిష్టంగా లక్షన్నర వరకు రుణమాఫీ చేయాలని కేబినెట్లో నిర్ణయించినట్లు ప్రకటించారని, రైతులకు రుణమాఫీ వల్ల దాదాపు 96 శాతం పైగా రైతాంగానికి మేలు జరుగుతుందని, రాష్ట్ర ప్రభుత్వంపై సుమారు 37వేల కోట్ల రుపాయల అదనపు భారం పడుతుందని, అలాగే రాష్ట్రంలో ఉన్న 7.6 లక్షల డ్వాక్రా సంఘాలకు రూ.లక్ష వరకు రుణాలను మాఫీ చేశారని, ఈ మొత్తం కూడా రూ.7600 కోట్లు అవుతుందని అంచనా వేశారని, చేనేత కార్మికులు, ఎస్సీల రుణాలు కూడా మాఫఈ చేస్తామని సీఎం మాట ఇచ్చారని ప్రకటనలో పేర్కొన్నారు.

రైతులు

రైతులు

కేంద్ర ప్రభుత్వాలు మాత్రమే ఇప్పటి వరకు వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తూ ఉన్నాయని, అందులో వీపీసింగ్ ప్రధానిగా ఉన్న 1989 కాలంలో రైతులకు రూ.10వేల వరకు మాత్రమే రుణాలు మాఫీ చేశారని, 2008లో కాంగ్రెసు ప్రభుత్వం రుణ కంతులు సరిగ్గా చెల్లించని రైతుల రుణాలనే మాఫీ చేసిందని, అయినా దేశవ్యాప్తంగా అంతా కలిపి రూ.58,000 కోట్లు మాత్రమే మాఫీ అయిందని, అందులో అప్పటి ఉమ్మడి ఏపీలో రాష్ట్రానికి మాఫీ అయిన రుణాలు కేవలం రూ.8,600 కోట్లేనని పేర్కొన్నారు.

 రైతులు

రైతులు

ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకున్న నిర్ణయం జాతీయస్థాయిలో కూడా రైతులు, వ్యవసాయ రంగంతో అనుబంధంగా ఉండే వారి నుండి ప్రశంసలు అందుతున్నాయన్నారు. రాష్ట్రంలో పలు జిల్లాల నుండి రైతు బృందాలు, డ్వాక్రా మహిళా బృందాలు సీఎంను కలిసి అభినందనలతో ముంచెత్తుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు ఆధ్వర్యంలోని కృష్ణా జిల్లా రైతుల బృందం చంద్రబాబు నాయుడుకు కేక్ తినిపించి తన ఆనందం పంచుకున్నారని పేర్కొన్నారు.

రైతులు

రైతులు

తమ జీవితంలో మరిచిపోలేని మేలును చేశారని బుధవారం ముఖ్యమంత్రికి గుంటూరు రైతులు కృతజ్ఞతలు తెలిపారని, తమకు చేసిన మేలు ఎన్నటికీ మరవమని గుంటూరు జిల్లా వినుకొండ నుండి వచ్చిన డ్వాక్రా మహిళలు చంద్రబాబుకు అభినందనలు తెలిపారన్నారు.

 రైతులు

రైతులు

అఖిలపక్ష రైతు సంఘం నాయకులు, మాట నిలబెట్టుకున్న సీఎం అంటూ పొగడ్తలతో ముంచెత్తారని పేర్కొన్నారు. రైతు సంఘాలు కలిసి తాము ఇప్పటి వరకు పడ్డ కష్టాలు తీరినట్లేనని ఆనంద పడ్డారన్నారు. చంద్రబాబు ప్రకటన సంతోషాన్నిచ్చిందని కర్నూలు జిల్లా ఆలూరు మండలంలోని హత్తిబెళగల్ గ్రామానికి చెందిన రైతు హర్షం వ్యక్తం చేశారని ప్రకటనలో పేర్కొన్నారు.

English summary
Photos of Farmers happy with Andhra Pradesh Chandrababu Naidu decision.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X