హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఫోన్లో ఖైరతాబాద్ గణేషుడు, గ్యాలరీలో '108' (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఖైరతాబాద్ గణేశుడు భక్తులకు దర్శనమిచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. శుక్రవారం వినాయక చవితి కావడంతో ఖైరతాబాద్ గణేషుడి నిర్వాహకులు అడ్డంగా ఉన్న బంధనాలను తొలగిస్తున్నారు. మరోవైపు, మండపాల ఏర్పాటుకు సంబంధించి అధికారులు అనుమతుల జారీ ప్రక్రియను పూర్తి చేశారు. గ్రేటర్‌లో ఈ ఏడాది మొత్తం 27 వేల మండపాలు ఏర్పాటు కాబోతున్నాయి.

హైదరాబాద్‌లో 15 వేలు, సైబరాబాద్‌లో 12 వేల మండపాలకు అధికారులు అనుమతు లిచ్చారు. అదేవిధంగా బందోబస్తుకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేశారు. రెండు కమిషనరేట్లలో మొత్తం 25 వేల మందితో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నా రు. హైదరాబాద్‌లో 15 వేల మంది, సైబరా బాద్‌లో 10 వేల మంది బందోబస్తు నిర్వహించబోతున్నారు. ఈసారి ఇతర జిల్లాల నుంచి తక్కువ సంఖ్యలో బలగాలను రప్పిస్తు న్నారు.

6 వేల మందిని మాత్రమే ఇతర ప్రాంతాల నుంచి బందోబస్తు నిమిత్తం తీసుకొస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరుగుతున్న తొలి గణేశ్‌ ఉత్సవాలను స్నేహపూరిత వాతావరణంలో నిర్వహించు కోవాలని అధికారులు ఉత్సవ కమిటీ నిర్వాహ కులను కోరారు. అన్ని మండలాల్లోనూ శాంతి కమిటీలను ఏర్పాటుచేశారు. బందోబస్తుకు సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అధికారులు ఆయా సిబ్బందికి ఇప్పటికే తెలియజేశారు.

ప్రతి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోనూ కట్టదిట్టమైన నిఘా ఉండాలని ఆదేశించారు. నగరంలో ఉత్సవాల నిర్వహణను కమిషనరేట్‌ లోని కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ నుంచి అధికారులు పర్యవేక్షిస్తారు. నిమజ్జనం పూర్తయ్యే వరకు రేయింబవళ్లు పనిచేసేలా సీసీసీలో ప్రత్యేక సిబ్బందిని నియమిస్తున్నారు. ఉత్సవాల బందోబస్తు నిర్వహణకు ప్రభుత్వం 9 కోట్ల 21 లక్షల రూపాయలు విడుదల చేసింది. దీనికి సంబంధించి బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్‌ కమిషనరేట్‌కు 6 కోట్ల 21 లక్షల 10 వేల రూపాయలు, సైబరాబాద్‌ కమిషనరేట్‌కు 3 కోట్ల రూపాయలు విడుదల చేసింది.

ఖైరతాబాద్ గణేషుడు

ఖైరతాబాద్ గణేషుడు

ఖైరతాబాద్ గణేశుడు భక్తులకు దర్శనమిచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. శుక్రవారం వినాయక చవితి కావడంతో ఖైరతాబాద్ గణేషుడి నిర్వాహకులు అడ్డంగా ఉన్న బంధనాలను తొలగిస్తున్నారు.

ఖైరతాబాద్ గణేషుడు

ఖైరతాబాద్ గణేషుడు

ఖైరతాబాద్ గణేశుడు భక్తులకు దర్శనమిచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. నిర్వాహకులు అడ్డంగా ఉన్న బంధనాలను తొలగిస్తున్న దృశ్యం.

ఖైరతాబాద్ గణేషుడు

ఖైరతాబాద్ గణేషుడు

ఖైరతాబాద్ గణేశుడు భక్తులకు దర్శనమిచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. ఖైరతాబాద్ గణేషుడికి ఓ పక్కన కొలువుదీరిన లక్ష్మీనరసింహ స్వామి.

ఖైరతాబాద్ గణేషుడు

ఖైరతాబాద్ గణేషుడు

ఖైరతాబాద్ గణేషుడిని తన సెల్‌ఫోన్‌లలో బందిస్తున్న భక్తులు. బారీకేడ్లకు బయట ఉండి వినాయకుడిని వారు తమ ఫోన్లలో బంధిస్తున్నారు.

ఖైరతాబాద్ గణేషుడు

ఖైరతాబాద్ గణేషుడు

ఖైరతాబాద్ గణేశుడు భక్తులకు దర్శనమిచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. శుక్రవారం వినాయక చవితి కావడంతో ఖైరతాబాద్ గణేషుడి నిర్వాహకులు అడ్డంగా ఉన్న బంధనాలను తొలగిస్తున్నారు.

ఖైరతాబాద్ గణేషుడు

ఖైరతాబాద్ గణేషుడు

ఖైరతాబాద్ గణేశుడు భక్తులకు దర్శనమిచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. గణేషుడిని చూసేందుకు వేలాది మంది భక్తులు వస్తారు. ఇందుకోసం ఏర్పాట్లు చేస్తున్న దృశ్యం.

ఖైరతాబాద్ గణేషుడు

ఖైరతాబాద్ గణేషుడు

ఖైరతాబాద్ గణేశుడు భక్తులకు దర్శనమిచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. శుక్రవారం వినాయక చవితి కావడంతో ఖైరతాబాద్ గణేషుడి నిర్వాహకులు అడ్డంగా ఉన్న బంధనాలను తొలగిస్తున్నారు.

ఖైరతాబాద్ గణేషుడు

ఖైరతాబాద్ గణేషుడు

ఖైరతాబాద్ గణేశుడు భక్తులకు దర్శనమిచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. ఖైరతాబాద్ గణేషుడికి ఓ పక్కన కొలువుదీరిన అమ్మవారు.

ఖైరతాబాద్ గణేషుడు

ఖైరతాబాద్ గణేషుడు

ఖైరతాబాద్ గణేషుడిని తన సెల్‌ఫోన్‌లలో బందిస్తున్న భక్తులు. బారీకేడ్లకు బయట ఉండి వినాయకుడిని వారు తమ ఫోన్లలో బంధిస్తున్నారు.

'108 గణేష'

'108 గణేష'

వినాయక చవితి సందర్భంగా స్టేట్ గ్యాలరీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో '108 గణేష' పేరుతో తొమ్మిది రోజుల ప్రత్యేక చిత్ర ప్రదర్శన ఉంటుంది.

 '108 గణేష'

'108 గణేష'

మాదాపూర్‌లోని చిత్రమాయి స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ఏర్పాటు చేశారు. 108 మంది చిత్రకారులు గీసిన ఈ అద్భుత ప్రదర్శనను తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేవీ రమణచారీ ప్రారంభించారు.

'108 గణేష'

'108 గణేష'

మాదాపూర్‌లోని చిత్రమాయి స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ఏర్పాటు చేశారు. 108 మంది చిత్రకారులు గీసిన ఈ అద్భుత ప్రదర్శనకు పర్యాటక ప్రత్యేక ప్రభుత్వ కార్యదర్శి చందనఖాన్ హాజరయ్యారు.

 '108 గణేష'

'108 గణేష'

ఈ సందర్భంగా వారు ఆర్ట్ గ్యాలరీలోని కళాఖండాలను తిలకించారు. విభిన్నంగా 108 రకాల గణేషును చిత్రకళాఖండాల సమ్మేళనం అబ్బురపరుస్తుందని అతిథులు అన్నారు.

'108 గణేష'

'108 గణేష'

108 మంది చిత్రకారులు జాలువారిన వర్ణ కళాఖండాలు ప్రదర్శన ఆగస్టు 4వ తేదీ వరకు ఉంటుందని, ుదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు ప్రదర్శన ఉంటుందని డైరెక్టర్ మనోహర్ తెలిపారు.

'108 గణేష'

'108 గణేష'

వినాయక చవితి సందర్భంగా స్టేట్ గ్యాలరీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో '108 గణేష' పేరుతో తొమ్మిది రోజుల ప్రత్యేక చిత్ర ప్రదర్శన ఉంటుంది.

 '108 గణేష'

'108 గణేష'

మాదాపూర్‌లోని చిత్రమాయి స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ఏర్పాటు చేశారు. 108 మంది చిత్రకారులు గీసిన ఈ అద్భుత ప్రదర్శనను తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేవీ రమణచారీ ప్రారంభించారు.

 '108 గణేష'

'108 గణేష'

మాదాపూర్‌లోని చిత్రమాయి స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ఏర్పాటు చేశారు. 108 మంది చిత్రకారులు గీసిన ఈ అద్భుత ప్రదర్శనకు పర్యాటక ప్రత్యేక ప్రభుత్వ కార్యదర్శి చందనఖాన్ హాజరయ్యారు.

'108 గణేష'

'108 గణేష'

ఈ సందర్భంగా వారు ఆర్ట్ గ్యాలరీలోని కళాఖండాలను తిలకించారు. విభిన్నంగా 108 రకాల గణేషును చిత్రకళాఖండాల సమ్మేళనం అబ్బురపరుస్తుందని అతిథులు అన్నారు.

English summary
Photos of 'Khairatabad ganesh' ready to vinayaka Chavithi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X