హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మెన్స్ డే కోసం కవిత, లక్ష్మీప్రసన్న నవ్వులు (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఎఫ్ఐసిసిఐ ఎఫ్ఎల్ఓ, యెల్లో థార్స్ డే, జెఆర్సీ కన్వెన్షన్ అండ్ ట్రేడ్ అఫైర్స్‌ల భాగస్వామ్యంతో ఆరోగ్య సాధికారత కార్యక్రమాన్ని ప్రపంచ మహిళా దినోత్సవం మార్చి 8న జెఆర్సీ కన్వెన్షన్ సెంటర్, జూబ్లీహిల్స్ అపోలో హాస్పిటల్స్ నిర్వహించింది.

ఈ కార్యక్రమాన్ని ప్రముఖ నటి లక్ష్మీ ప్రసన్న, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, జెఆర్సీ కన్వెన్షన్ సెంటర్ హెడ్ కిర్షా రెడ్డిలు అధికారికంగా ప్రారంభించారు.

ఈ ప్రారంభోత్సవం సందర్భంగా అపోలో హాస్పిటల్స్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంగీతా రెడ్డి శనివారం కీలక సందేశాన్ని ప్రజలకు అందించారు.

ఐ యామ్ ఏ లేడీ

ఐ యామ్ ఏ లేడీ

రోజువారి జీవనశైలి, ఒత్తిడి ఆరోగ్యపరంగా ముందుగా వచ్చే రుతువిరత, చికాకు పెట్టే పేగువ్యాధి, అలసట, చర్మ సమస్యలతో పాటు ప్రమాదభరితమైన క్యాన్సర్ వంటి వ్యాధులకు దారితీస్తున్నాయి.

ఐ యామ్ ఏ లేడీ

ఐ యామ్ ఏ లేడీ

డాక్టర్ రూమ సిన్హా (గైనకాలజిస్ట్), డాక్టర్ ఆష సుబ్బలక్ష్మి (గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్), డాక్టర్ వినితా రెడ్డి (ఆంకాలజిస్ట్), డాక్టర్ పల్లవి రెడ్డి (డెర్మటాలజిస్ట్)లతో అపోలో హెల్త్ సిటీకి చెందిన ప్రఖ్యాత వైద్య బృందం ఇటువంటి పలురకాల సమస్యలను ఉద్దేశిస్తూ ప్రసంగించారు.

ఐ యామ్ ఏ లేడీ

ఐ యామ్ ఏ లేడీ

శ్రీమతి విజయ తుపురాణిచే నిర్వహించబడిన జుంబ సదస్సు, ఆరోగ్యకరమైన భోజనంపై ప్రదర్శింపబడిన గుడ్ మీల్ డెమోను ప్రేక్షకులు ఆసక్తిగా తిలకించారు.

ఐ యామ్ ఏ లేడీ

ఐ యామ్ ఏ లేడీ

ఈ కార్యక్రమంలో ఔత్సాహికుల కొరకు ఫోటోగ్రఫీ, కళా ప్రదర్సన, సాధారణ పెయింటింగ్‌లు ఏర్పాటు చేయబడ్డాయి. కార్యక్రమంలో మహిళా సృజనాత్మకత, ఔత్సాహిక కళాకారులను ప్రోత్సహించేందుకు శ్రీమతి లూణ లోగన్‌చే ఏర్పాటైన ఫోటోగ్రఫీ, కళా ప్రదర్శన మహిళలచే గొప్ప ఆధరణను అందుకున్నాయి.

ఐ యామ్ ఏ లేడీ

ఐ యామ్ ఏ లేడీ

సంగీతా రెడ్డి మాట్లాడుతూ... ఆరోగ్యం అనేది అతి ముఖ్యమైన విషయం, ఈ కార్యక్రమం మహిళల యొక్క సంపూర్ణ ఆరోగ్యాన్ని ఉద్దేశిస్తోందన్నారు.

ఐ యామ్ ఏ లేడీ

ఐ యామ్ ఏ లేడీ

ఐ యామ్ ఏ లేడీ అనబడే ఆన్ లైన్ పోర్టల్ మహిళల ఆరోగ్యం, సంక్షేమానికి సంబంధించిన సమాచారాన్ని అందిస్తుందని, ఈ పోర్టల్ వివిధ రంగాలకు చెందిన మహిళల వ్యక్తపరిచే ఆలోచనలు, కళలు, ఆశయం ప్రయోజనాలు, ఆందోళనలకు ఒక వేదికవుతుందని చెప్పారు.

ఐ యామ్ ఏ లేడీ

ఐ యామ్ ఏ లేడీ

చైనాలో శిశు మరణాల సంఖ్య 6000 కాగా, మన దేశంలో 56000గా ఉండటంతో మహిళల సంఖ్య గణనీయంగా తగ్గుతోందని సంగీతా రెడ్డి అన్నారు.

ఐ యామ్ ఏ లేడీ

ఐ యామ్ ఏ లేడీ

మంచు లక్ష్మీ మాట్లాడుతూ... మనం కోరుకునే మార్పును, పర్యావరణంలో మన కుటుంబాలు తీసుకు వచ్చే మార్పు ద్వారా సాధించవచ్చునని, సమాజంలో వచ్చే ఈ మార్పును మనం గమనించవచ్చునని చెప్పారు.

ఐ యామ్ ఏ లేడీ

ఐ యామ్ ఏ లేడీ

కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ.. కేవలం మహిళలు మాత్రమే మహిళా దినోత్సవాన్ని ఎందుకు కలిగి ఉండాలని, పురుషులు కూడా పురుషుల దినోత్సవాన్ని కలిగి ఉండాలని, ప్రతిరోజు పురుషులదే పైచేయి అవుతుండటంతో మహిళలకు ఒకే ఒకరోజు కేటాయించబడిందన్నారు.

ఐ యామ్ ఏ లేడీ

ఐ యామ్ ఏ లేడీ

ఎఫ్ఐసిసిఐ ఎఫ్ఎల్ఓ, యెల్లో థార్స్ డే, జెఆర్సీ కన్వెన్షన్ అండ్ ట్రేడ్ అఫైర్స్‌ల భాగస్వామ్యంతో ఆరోగ్య సాధికారత కార్యక్రమాన్ని ప్రపంచ మహిళా దినోత్సవం మార్చి 8న జెఆర్సీ కన్వెన్షన్ సెంటర్, జూబ్లీహిల్స్ అపోలో హాస్పిటల్స్ నిర్వహించింది.

English summary

 Actor and producer Lami Prasanna Manchu and Telangana Jagrithi president Kavitha participated in I am a lady.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X