వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఈవిఎంలు పగులుతాయేమో: లోకేష్ జోరు (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ సోమవారం తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు.

రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పదే పదే చెప్పిన బడుగు, బలహీన వర్గాలకు రాజ్యాధికారం ఒక్క తెలుగుదేశంతోనే సాధ్యమన్నారు.

నారా లోకేశ్ యువ ప్రభంజనం యాత్ర సోమవారం ప్రకాశం జిల్లాలోని పర్చూరు, అద్దంకి, ఒంగోలు నియోజకవర్గాల్లో జరిగింది. వేలాదిగా తరలివచ్చిన ప్రజలనుద్దేశించి లోకేశ్ ప్రసంగించారు.

నారా లోకేష్

నారా లోకేష్

బడుగు, బలహీన వర్గాలకు రాజ్యాధికారం కల్పించిన ఘనత తెలుగుదేశం పార్టీదేనన్నారు. అసెంబ్లీ స్పీకర్‌గా ప్రతిభాభారతిని, పార్లమెంట్ స్పీకర్‌గా బాలయోగిని నియమించిన ఘనత టిడిపిదేనని చెప్పారు.

నారా లోకేష్

నారా లోకేష్

అంబేద్కర్ స్ఫూర్తితో బడుగుల రాజ్యాధికారం కోసం టీడీపీ కృషి చేస్తుందన్నారు. గత పదేళ్లుగా రాష్ట్రంలో యువతకు ఉపాధి కల్పించిన దాఖలాలు లేవన్నారు.

నారా లోకేష్

నారా లోకేష్

ప్రకాశం జిల్లాలో ఏడాదికి 25 వేల మంది, రాష్ట్రంలో పది లక్షల మంది యువత ఉద్యోగ, ఉపాధి లేక అవస్థలు పడుతున్నారని తెలిపారు.

 నారా లోకేష్

నారా లోకేష్

అలాంటి వారందరికీ ఉపాధి కల్పించేందుకు టీడీపీ కృషి చేస్తుందని మరో మూడు వారాల్లో జరగనున్న ఎన్నికల్లో ప్రజలంతా సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి చంద్రబాబును గెలిపించాలని లోకేశ్ కోరారు.

నారా లోకేష్

నారా లోకేష్

సీమాంధ్రను సింగపూర్‌లా అభివృద్ధి చేయగల ఒకే ఒక్క మగాడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు మాత్రమేనన్నారు.

నారా లోకేష్

నారా లోకేష్

ఒక యువ నాయకుడు నాలుగు సంతకాలతో మీ జీవితాలు మారుస్తానని చెబుతున్నాడని, ఆ సంతకాలతో మన జీవితాలు మారతాయో లేదో కానీ ఆ తర్వాత చేసే సంతకాలతో ఆయన కుటుంబ సభ్యుల జీవితాలు మార్చుకుంటారని జగన్‌ను ఉద్దేశించి అన్నారు.

నారా లోకేష్

నారా లోకేష్

ఆయన ప్రజలను మోసం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. రాజకీయాల్ని అడ్డుపెట్టుకొని ఒక వ్యక్తి లక్ష కోట్లు దోచేస్తాడని ఎన్నడూ అనుకోలేదన్నారు.

నారా లోకేష్

నారా లోకేష్

టిడిపి అధికారంలోకి వచ్చాక అలాంటి దోపిడీ వ్యక్తి నుంచి ఆ సొమ్మును కక్కించి ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం ఖర్చు చేస్తామని చెప్పారు.

నారా లోకేష్

నారా లోకేష్

40 ఏళ్ల రాజకీయ అనుభవం, పదేళ్ల పాలనానుభవంతో మన నేత చంద్రబాబు రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలను మిళితం చేస్తూ రూపొందించిన ఎన్నికల మేనిఫెస్టో రాష్ట్ర ప్రజల భవిష్యత్‌ను మార్చి వేస్తుందన్నారు

నారా లోకేష్

నారా లోకేష్

ప్రజల్లో వస్తున్న స్పందన చూస్తే ఎన్నికల్లో ఈవిఎంలు పగిలిపోయేలా సైకిల్ గుర్తుపై ఓట్లు వేసేందుకు సిద్ధంగా ఉన్నారన్న విషయం స్పష్టమవుతున్నదని సభికులను ఉత్తేజపరిచారు

నారా లోకేష్

నారా లోకేష్

కాగా, నారా లోకేశ్ యువ ప్రభంజనం యాత్ర మంగళవారం నెల్లూరు జిల్లాలో జరుగుతుంది. పాత బస్టాండ్, నర్తికి సెంటర్లలో బహిరంగ సభల్లో ప్రసంగిస్తారు.

English summary
Photos: Nara Lokesh in Prakasam
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X