వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ పోలీస్ 007ఏ, వాహనాలు ఇలా.. (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పోలీసింగ్‌కు దేశంలోనే నెం.1 స్థానం కల్పించడంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర తలపెట్టిన నయా వాహనాల నమూనా సిద్ధమైంది.

టీఎస్‌ 007ఏ నెంబర్‌ ప్లేట్‌తో ఉన్న ఈ నమూనా వాహనాలను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఓకే చేశారు.

డీజీపీ అనురాగ్‌ శర్మ, ఇతర ఉన్నతాధికారులు నయా పోలీసింగ్‌లో భాగంగా వాడుకలోకి తేవాల్సిన వాహనాల నమూనాల్ని కేసీఆర్‌కు గురువారం సచివాలయంలో పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా చూపించారు.

 తెలంగాణ రాష్ట్ర పోలీసు వాహనాలు

తెలంగాణ రాష్ట్ర పోలీసు వాహనాలు

వాహనాల నమూనా, పని తీరు గురించి అధికారుల్ని అడిగి తెలుసుకున్న కేసీఆర్ రెండు కార్లను ఓకే చేశారు. పోలీస్‌ లోగోతో నీలిరంగులో ఉండే ఇన్నోవా కార్లను శాంతి భద్రతలకు, మరో కారును ట్రాఫిక్‌, హైవే పెట్రోలింగ్‌కు ఉపయోగించాల్సిందిగా ఆదేశించారు.

తెలంగాణ రాష్ట్ర పోలీసు వాహనాలు

తెలంగాణ రాష్ట్ర పోలీసు వాహనాలు

శాంతి భద్రతలకు ఉపయోగించే కార్లు, ద్విచక్ర వాహనాల్ని గోపి ఫకీర రూపొందించగా, మరో కారును ఇబ్రాండ్‌ ఇండియా డిజైన్‌ సంస్థ రూపొందించింది. కొత్త వాహనాల్లో జీపీఎస్‌, పీసీ, బార్‌లైట్లు, సైరన్‌, పీఏ సదుపాయం ఉంటుంది. వాహనాల ఎంపిక విషయంలో ముఖ్యమంత్రి వద్ద జరిగిన సమావేశంలో డీజీపీతో పాటు సీఎం సలహాదారు రమణాచారి, పాపారావు, ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌ రావు, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.

తెలంగాణ రాష్ట్ర పోలీసు వాహనాలు

తెలంగాణ రాష్ట్ర పోలీసు వాహనాలు

నయా పోలీసింగ్‌ విధానంలో భాగంగా.. మొత్తం 1650 ఇన్నోవా కార్లు, 1500 ద్విచక్ర వాహనాల్ని కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఈమేరకు కొత్త వాహనాలు ఎలా ఉండాలి అనేదానిపై ప్రత్యే క అధ్యయనానికి డీజీపీ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి వారు ఇచ్చిన సలహాలు, సూచనల మేరకు వాహనాల ఎంపిక, అందులోని సదుపాయాలపై నిర్ణయం తీసుకున్నారు.

 తెలంగాణ రాష్ట్ర పోలీసు వాహనాలు

తెలంగాణ రాష్ట్ర పోలీసు వాహనాలు

అయితే.. అన్ని వాహనాల్ని ఒకేసారి వాడుకలోకి తీసుకురావడం ఇబ్బందితో కూడుకున్న వ్యవహారం కావడంతో మొదటి విడతలో హైదరాబాద్‌, సైబరాబాద్‌ కమిషనరేట్ల పరిధిలోని ఒక్కో పోలీసు స్టేషన్‌కు ఒక కారు, రెండు ద్విచక్ర వాహనాల్ని కేటాయించనున్నారు.

English summary
Photos of New police vehicles to be introduced in Telangana State police
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X