హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వర్షం: నవ్విన జీహెచ్ఎంసీ!యువతులు ఇలా..(పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రాజధాని హైదరాబాదులో ఆదివారం కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు వరదనీటితో నిండిపోయాయి. పలు ప్రాంతాల్లో రోడ్లపై వర్షం నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.

పంజాగుట్ట, జూబ్లీహిల్స్‌, మాదాపూర్‌, సోమాజిగూడ, ఖైరతాబాద్‌, మెహిదీపట్నం, లంగర్‌హౌజ్‌, బాలానగర్‌, రాజేంద్రనగర్‌, అమీర్‌పేట, బేగంపేట ప్రధాన రహదారులు వర్షపునీటితో నిండిపోయాయి.

మరోవైపు, వర్షం రైతులతో పాటు జీహెచ్ఎంసీకి కూడా సంతోషాన్ని తీసుకు వచ్చిందని చెప్పవచ్చు. కొంతకాలంగా తాగునీటికి నగరంలో ఇబ్బంది కనిపిస్తోంది. వర్షం కారణంగా హిమయత్ సాగర్, ఉస్మాన్ సాగర్‌లు నిండటం ఊరట కలిగించిందనవచ్చు.

 వర్షం

వర్షం

పంజాగుట్ట హిందూ శ్మశాన వాటికలో దోభిఘాట్‌లో నాలా రిటైనింగ్‌ వాల్‌ కూలి ఇళ్లలోకి వర్షంనీరు చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

 వర్షం

వర్షం

మోతీనగర్‌లోని సప్దర్‌నగర్‌, రాజీవ్‌గాంధీ నగర్‌లలో వరదనీరు ఇళ్లలోకి చేరడంతో స్థానికులు అవస్థలు పడ్డారు. పలు ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు వర్షపునీటితో నిండిపోయాయి.

 వర్షం

వర్షం

ఆదివారం కుత్బుల్లాపూర్‌లో 21 మిల్లీమీటర్ల వర్షపాతం, సికింద్రాబాద్‌లో 1.25 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యాయని వాతవరణ శాఖ అధికారులు తెలిపారు.

 వర్షం

వర్షం

రోడ్లు గుంతలమయంగా మారడంతో వర్షపు నీరు రోడ్లపై నిలిచి పోవడంతో ట్రాఫిక్‌ నిలిచిపోయి వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.

వర్షం

వర్షం

ఆదివారం ఉదయం నుంచి కురిసిన వర్షానికి రోడ్లు కుంటలను తలపించాయి. అమీర్‌పేట మైత్రీవనం, పంజాగుట్ట, సోమాజిగూడ, ఖైరతాబాద్‌, బేగంపేట, సికింద్రాబాద్‌, కోఠి, తార్నాక, నెక్లెస్‌రోడ్‌ ప్రాంతాల్లో వర్షపునీరు రోడ్లపై నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.

 వర్షం

వర్షం

వెంగళ్‌రావునగర్‌, మధురానగర్‌, కూకట్‌పల్లి, వివేకానందానగర్‌, తిరుమలగిరి, కృష్ణానగర్‌ ప్రాంతాల్లో రోడ్లపై వరదనీరు నిలిచిపోయింది.

వర్షం

వర్షం

చార్మినార్‌, మదీన, చత్తాబజార్‌, చౌమహల్లా ప్యాలెస్‌, తలాబ్‌కట్ట, నషేమాన్‌నగర్‌, హాఫిజ్‌ బాబానగర్‌ ప్రాంతాలలో రోడ్లపై వరద నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.

వర్షం

వర్షం

తాడ్‌బంద్ చౌరస్తాలో వర్షానికి ఓ హోటల్లోకి నీరు చేరింది. వరదనీరు నాలాల్లోకి చేరడంతో పలు ప్రాంతాల్లో అవి పొంగి మురుగునీరు రోడ్లపై ప్రవహించింది.

 వర్షం

వర్షం

ఫలక్‌నుమా, నవాబ్‌సాబ్‌కుంట, రమ్నస్‌పురా, కిషన్‌బాగ్‌ ప్రాంతాల్లో డ్రైనేజీ పైపులైన్లు పగలడంతో మురుగునీరు రోడ్లపైకి చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు.

 వర్షం

వర్షం

మోతీనగర్‌లోచెట్టు విరిగిపడడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో నగరవాసులలో ఉత్సాహం వెల్లివిరుస్తోంది.

 వర్షం

వర్షం

గండిపేట జలాశయంలోకి వరద నీరు తక్కువగా వచ్చినా, హి మాయత్‌సాగర్‌కు భారీగా రావడంతో జనం పెద్ద సంఖ్యలో తిలకించేందుకు వచ్చారు. వర్షంలో తడుస్తూ, ఆటలు ఆడుతూ, పాటలు పాడుతూ ఎంజాయ్‌ చేశారు.

వర్షం

వర్షం

మరోవైపు, ఆదివారం మధ్యాహ్నం నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కు మంటూ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని కాలం వెల్లదీస్తున్నారు.

 వర్షం

వర్షం

గత రెండు రోజుల క్రితం కురిసిన వర్షానికే ప్రజలు తీవ్ర ఇబ్బందుల ఎదుర్కొంటూ పండగ పబ్బం లేకుండా ఇళ్లలోకి నీరు చేరి, ఇళ్లు కూలి కంటిమీద కునుకు లేకుండా జాగరణ చేసిన ప్రజలకు అదివారం వర్షం మరింత కుంగదీసింది.

 వర్షం

వర్షం

బయటకు వెళ్దామంటే ఇంటి ముందు వరద నీరు, ఇంట్లో ఉందామంటే ఇళ్లలోకి చేరిన మురికినీటిలో జీవనం సాగిస్తున్నారు. ఎటూ పోలేక ఎవరు ఆదుకోలేక మా ఖర్మ ఇంతేనని ఒకరికి ఒకరు ఓదార్చుకుంటూ వరద నీటిలో అగచాట్లు పడుతున్నారు.

 వర్షం

వర్షం

కురుస్తున్న వర్షానికి సికింద్రాబాద్ ప్రాంతం పూర్తిగా జలమయమై అటు వాహనదారులు, ఇటు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

 వర్షం

వర్షం

బౌద్దనగర్, పుల్లయ్య బావి, న్యూ అశోక్‌నగర్, మహమ్మద్‌గూడ, బోయగూడ, పార్శీగుట్ట, అంబర్‌నగర్, ఎల్ నారాయణ నగర్, చింతబావి, దూద్‌బావి, కిందిబస్తీ, మెట్టుగూడలోని గోవిందపురం, పద్మారావునగ్‌లోని ఐడిహెచ్ కాలనీ క్వార్టర్స్ ప్రాంతాలలోని ప్రజలు జలమయంలో బతుకు జీవనం వెళ్లదిస్తున్న ఎవరూ మేమున్నమంటూ ఆపన్న హస్తం అందించేవారే కరువయ్యారు.

 వర్షం

వర్షం

సికింద్రాబాద్ ప్రాంతంలోని రహదారులు గోదార్లుగా మారాయి. సికింద్రాబాద్ క్లాక్‌టవర్, సంగీత్ చౌరస్తా, స్టేషన్ రోడ్డు, చిలకలగూడ, సీతాఫల్‌మండి, బౌద్దనగర్, అడ్డగుట్ట, పద్మారావునగర్, బోయిగూడ రైల్వే బ్రిడ్జి తదితర ప్రాంతాల ప్రధాన రహదారులు చిన్నపాటి చెరువులను తలపించడంతో ద్విచక్ర వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడటం కనిపించింది.

 వర్షం

వర్షం

మెట్టుగూడ ప్రధాన రహదారి జలమయం కావడంతో వాహనదారులకు ఎక్కడ ఏ గోతి ఉందో, ఎక్కడ ఏ ప్రమాదం జరుగుతుందోనని ఆందోళన చెందారు.

 వర్షం

వర్షం

ఆలుగడ్డబావి దగ్గరలోని రైల్వే ఆర్‌యూబీలో మోకాలి లోతు నీరు నిలిచి వాహనదారులు కష్టాలుపడ్డారు. వరద నీటి ప్రవాహం సాఫీగా సాగకపోవడంతో వర్షం పడ్డ ప్రతిసారి రహదారులతో పాటు లోతట్టు ప్రాంతాల ప్రజలు ప్రాణాలను అరచేతి పెట్టుకుని బతుకుతున్నారు.

 వర్షం

వర్షం

ఇక రాత్రి సమయంలో వర్షం పడితే ప్రజల్లో అ భయం మరింత ఎక్కువగా ఉంటుంది. ప్రతిసారి లోతట్టు ప్రాంతాలు మునిగి ఇళ్లు కూలిపోతూ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాని సమస్య పరిష్కారం కావడం లేదు.

 వర్షం

వర్షం

మరింత జఠిలంగా మారుతున్న ఏ ఏటికాయేడు శాశ్వత పరిష్కారం చేయాలంటూన్న పాలకులు, ప్రతిపాదనలు సిద్ధం చేస్తామంటున్న అధికారుల మాటలు మినహా శాశ్వత ప్రతిపాదనలు ఎందుకు చెయ్యలేక పోతున్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

 వర్షం

వర్షం

నిధులు ఖర్చు అవుతున్నా పరిష్కారం ఎందుకు కావడం లేదనేది ప్రశ్నగా మిగిలింది. వర్షాకాలంలో కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు, వారు ప్రమాదంలో ఉంటే కాపాడటం వంటి చర్యలు తీసుకోవడం కోసం జిహెచ్‌ఎంసి రెస్క్యూ టీమ్‌లను ఏర్పాటు చేస్తుండటం పారిపాటి. అయితే ఈసారి వర్షాలు పడటం లేదనో మరే కారణంతోనో తెలియదు కాని గురువారం నుంచి కురుస్తున్న వర్షాలకు ఇళ్లు కూలి, లోతట్టు ప్రాంతాలు జలమయమై ఇళ్లలోకి నీరు చేరి సామాగ్రి మొత్తం నీట మునిగి వంట చేసుకోవడానికి వీలులేని స్థితి ఉన్నా ప్రజలకు ఆపన్నహస్తం ఇచ్చేందుకు అధికారులు రాకపోవడంతో పాటు కనీసం రెస్క్యూ టీమ్‌లను ఏర్పాటు చెయ్యకపోవడం గమనార్హం.

 వర్షం

వర్షం

రెండు రోజులుగా యెడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కూకట్‌పల్లిలోని జాతీయ రహదారితో పాటు అంతర్గత రోడ్లన్ని జలమయమయ్యాయి.

 వర్షం

వర్షం

కెపిహెచ్‌బికాలనీ, కూకట్‌పల్లి, మూసాపేట్, భరత్‌నగర్ ప్రాంతంలోని జాతీయ రహదారి వర్షాల వల్ల గుంతలమయంగా మారి కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి. కొన్నిచోట్ల లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి.

 వర్షం

వర్షం

ప్రధానంగా భరత్‌నగర్ బ్రిడ్జి మూసాపేట్ చౌరస్తా మీదుగా వైజంక్షన్ వరకు, కూకట్‌పల్లి బస్టాండ్ నుండి భరత్‌నగర్ బస్టాండ్ వరకు ఇరువైపుల జాతీయ రహదారిపై ఏర్పడిన గుంతలతో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచి ట్రాఫిక్ సమస్య తలెత్తడంతో వాహనదారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

English summary
Incessant rain may have dampened the spirits of farmers, but have certainly brought back smiles on the faces of Hyderabad Metropolitan Water Supply and Sewerage Board (HMWS&SB) officials. They are now confident that Greater Hyderabad will not have to worry about drinking water till summer 2015 when the Krishna phase-III works will be completed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X