హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కేసీఆర్ ముందు సానియా ఇలా.., కొందామని (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జాను ప్రభుత్వం నియమించనుంది. సోమవారం సానియా తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును కలిశారు. ఈ సందర్భంగా సానియాకు కేసీఆర్ కోటి రూపాయల నజరానా ప్రకటించారు. మంగళవారం మరోసారి కలువనుంది. అదే సందర్భంలో ఆమెను తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌గా అధికారికంగా ప్రకటించడంతో పాటు కోటి రూపాయల చెక్కును ముఖ్యమంత్రి అందిస్తారు.

యూఎస్‌ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్‌లో పాల్గొనేందుకు శిక్షణ కోసం సానియా అమెరికా వెళ్లనున్నారు. ఈ సందర్భంగా సీఎంను సోమవారం సచివాలయంలో కలిశారు. అకాడమీ ఏర్పాటు గురించి, రాష్ట్రంలో క్రీడల అభివృద్ధి గురించి ఆమె ముఖ్యమంత్రితో మాట్లాడారు. క్రీడల అభివృద్ధికి సహకరించాలని కోరారు.

యూఎస్ టెన్నిస్ టోర్నమెంట్‌లో పాల్గొనేందుకు శిక్షణకు అవసరమయ్యే ఖర్చు కోసం కోటి రూపాయల ఆర్థిక సహాయం ప్రకటించారు. మంగళవారం కోటి రూపాయల చెక్‌ను అధికారికంగా సానియాకు అందజేస్తారని అధికార వర్గాలు తెలిపాయి. హైదరాబాద్‌లో అకాడమీ ఏర్పాటు చేసే ఉద్దేశంతో గుత్తా జ్వాలా, పుల్లెల గోపిచంద్‌లు త్వరలోనే ముఖ్యమంత్రిని కలువనున్నారు.

కేసీఆర్‌తో సానియా మీర్జా

కేసీఆర్‌తో సానియా మీర్జా

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును సోమవారం టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా కలిశారు. కేసీఆర్‌‍ను పలువురు ప్రముఖులు కలుసుకున్నారు. బ్రిటిష్ హైకమిషనర్, జిందాల్ గ్రూప్ చైర్మన్ తదితరులు ముఖ్యమంత్రిని కలుసుకున్నారు.

కేసీఆర్‌తో సానియా మీర్జా

కేసీఆర్‌తో సానియా మీర్జా

కేసీఆర్‌తో కలిసిన అనంతరం సానియా మాట్లాడుతూ.. మర్యాదపూర్వకంగానే తాను కలిశానని చెప్పారు. మరోసారి తాను ఆయనను కలుస్తానని చెప్పారు. కాగా, సానియా మీర్జాకు కేసీఆర్ కోటి రూపాయలు ప్రకటించారు. యూఎస్ ఓపెన్ టోర్నీ శిక్షణ కోసం ఈ కోటి రూపాయలు ఇవ్వనున్నారు. ఈ చెక్‌ను మంగళవారం ఇవ్వనున్నారు.

సింగరేణి అధికారులు

సింగరేణి అధికారులు

కేసీఆర్ సింగరేణి పైన దృష్టి సారించారు. సింగరేణిని పూర్తిగా తెలంగాణ ప్రభుత్వమే టేకోవర్ చేయాలని అన్నారు. కేంద్రం షేర్లను కూడా రాష్ట్రం కొనేందుకు అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు. సింగరేణి ఉన్న జిల్లాల్లో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, మెడికల్ కళాశాల ఏర్పాటు చేస్తామన్నారు. పవర్ ప్రాజెక్టులు వచ్చే ఏడాది నవంబర్ లోగా ప్రారంభమయ్యేలా చూడాలన్నారు.

సింగరేణి అధికారులు

సింగరేణి అధికారులు

సింగరేణి ప్రపంచ మార్కెట్లోకి ప్రవేశించాలన్నారు. సింగరేణి కార్మికులకు తెలంగాణ ఇంక్రిమెంట్ ఇస్తామన్నారు. సింగరేణికి సంబంధించి ఇథియోపియా, మొజాంబిక్, ఆస్ట్రేలియా దేశాల్లో పర్యటించి అధ్యయనం చేయాలన్నారు. సింగరేణి అధికారులతో కేసీఆర్ భేటీ అయ్యారు.

English summary

 Telangana Chief Minister K Chandrasekhar Rao on Monday announced a grant of Rs 1 crore to tennis star Sania Mirza for her training and coaching.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X