హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చోరీ కార్లలో...: బిటెక్ విద్యార్థి, డ్యాన్సర్ వీరే (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కార్లలను చోరీ చేసి వాటిలో ఎర్రచందనాన్ని అక్రమ రవాణా చేస్తున్న ఓ బిటెక్ విద్యార్థిని, ఓ డ్యాన్సర్‌ను పోలీసులు అరెస్టు చేసి మంగళవారంనాడు మీడియా ముందు ప్రవేశపెటట్టారు. జల్సాలకు మరిగి విద్యార్థి తన ఇద్దరు మిత్రులతో కలిసి కార్లను దొంగతనం చేసి స్మగ్లర్లతో చేతులు కలిపి ఎర్రచందనాన్ని అక్రమ రవాణా చేస్తున్న తేజ అనే కడప జిల్లా రైల్వే కోడూరుకు చెందిన విద్యార్థిని హైదరాబాదులో పట్టుకున్నారు.

హైదరాబాదులోని బహదూర్‌పురాలో దాడి చేసి ఇద్దరిని అరెస్టు చేశారు. ఓ బిటెక్ విద్యార్థి, ఓ డ్యాన్సర్‌ను అరెస్టు చేశారు. వారికి దావూద్ ముఠాతో సంబంధాలు ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం - నిందితుడు సి. తేజ మోహన్ రాజు తన రూమ్మేట్స్ టి వినాయక, ప్రసాద్‌లతో కలిసి ఎర్రచందనాన్ని కర్ణాటకకు అక్రమంగా తరలిస్తూ వస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని కడప జిల్లాకు చెందిన ఎర్రచందనం స్మగ్లర్లు నరేష్, నయీమ్, జకీర్‌ల నుంచి వారు ఆ ఎర్రచందనాన్ని తీసుకునేవారని డిప్యూటీ పోలీసు కమిషనర్ (డిటెక్టివ్ శాఖ) జి. పాలరాజు మీడియాతో చెప్పారు.

ఎర్రచందనం ఇదే...

ఎర్రచందనం ఇదే...

బిటెక్ విద్యార్థి, తన ఇద్దరు అనుచరులతో ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్న బిటెక్ విద్యార్థి తేజ నుంచి స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం ఇదే..

కార్లు అద్దెకు తీసుకునేవాడు

కార్లు అద్దెకు తీసుకునేవాడు

కడపకు చెందిన తేజ హైదరాబాదులో బిటెక్ చేస్తూ జల్సాలకు అలవాటు పడ్డాడు. ట్రావెలింగ్ ఏజెన్సీల నుంచి కార్లను అద్దెకు తీసుకుని జల్సాగా తిరగడం అలవాటు చేసుకున్నాడు.

కార్ల చోరీకి ఇలా..

కార్ల చోరీకి ఇలా..

ఆ తర్వాత కార్ల అద్దెలకు చెల్లించలేక అప్పులు పెట్టాడు. ఈ స్థితిలో తన రూమ్మెట్స్‌తో కలిసి కార్లను దొంగిలించడానికి పూనుకున్నాడు.

స్మగ్లర్లతో లింక్

స్మగ్లర్లతో లింక్

ఇదే సమయంలో అతనికి ముగ్గురు ఎర్రచందనం స్మగ్లర్లు పరిచయమయ్యారు. దాంతో వినాయక, ప్రసాద్‌లతో కలిసి దొంగిలించిన కార్లలో ఎర్రచందనం రవాణా చేయడం అలవాటు చేసుకున్నాడు. వీరు తీసుకెళ్లిన ఎర్రచందనాన్ని కోలారులో జకీర్, నయీమ్ ఛోటా బాయ్‌కి అమ్మేవారు.

పోలీసుల చేతిలో ఇలా..

పోలీసుల చేతిలో ఇలా..

తమకు అందిన సమాచారంతో పోలీసులు బిటెక్ విద్యార్థి తేజను, డ్యాన్సర్ వినాయకను అరెస్టు చేశారు. వారి నుంచి మూడు కార్లను, 60 లక్షల రూపాయల విలువ చేసే 60 కిలోల ఎర్రచందనాన్ని స్వాధీనం చేసుకున్నారు.

ఛోటా భాయ్‌ ఇలా..

ఛోటా భాయ్‌ ఇలా..

ఛోటా భాయ్ ఆ ఎర్రచందనాన్ని మంగళూర్ ఓడ రేవు ద్వారా దుబాయ్‌కు అక్రమంగా తరలిస్తాడని చెప్పారు.

మరో వ్యక్తి పరారీలో..

మరో వ్యక్తి పరారీలో..

కార్లు చోరీ చేసి, ఎర్రచందనాన్ని అక్రమ రవాణా చేస్తున్న ఇద్దరిని అరెస్టు చేసిన విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తెలియజేశామని పాలరాజు చెప్పారు.

మరో వ్యక్తి కోసం గాలింపు..

మరో వ్యక్తి కోసం గాలింపు..

తేజకు సహకరించిన మరో నిందితుడి కోసం గాలిస్తున్నట్లు పాలరాజు చెప్పారు. ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడిన ముగ్గురు కూడా కడప జిల్లాకు చెందినవారు.

English summary
A B. Tech student and a dancer were arrested on Tuesday from Bahadurpura area here on charges of stealing cars and transporting red sanders wood to neighbouring Karnataka state, police said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X