కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అన్ని జిల్లాలకు.. కర్నూలు, కడపతో ప్రారంభం(పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: రాష్ట్ర విభజన నేపధ్యంలో పదమూడు సీమాంధ్ర జిల్లాలకు విశాఖ నుంచి ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులను నిర్వహించాలని విశాఖ రీజియన్ నిర్ణయించింది.

ఇందులో భాగంగా గురువారం విశాఖ నుంచి కర్నూలు, కడప ప్రాంతాలకు ప్రవేశపెట్టిన సూపర్ లగ్జరీ సర్వీసులను గురువారం జివిఎంసి కమిషనర్ ఎంవి సత్యనారాయణ ద్వారకానగర్ ఆర్టీసీ కాంప్లెక్స్‌లో ప్రారంభించారు.

కడప, కర్నూలుకు ఆర్టీసీ రెండు కొత్త బస్సు సర్వీసులను ప్రారంభించింది. అన్ని జిల్లాలకు విశాఖ నుండి ఆర్టీసీ బస్సులను నడపనున్నారు.

బస్సులు ప్రారంభం

బస్సులు ప్రారంభం

కడప, కర్నూలులకు బస్సులు ప్రారంభించిన సత్యనారాయణ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా జీవీఎంసీ కమిషనర్ సత్యనారాయణ, ఆర్డీసీ ఈడి రామకృష్ణలు మాట్లాడారు.

బస్సులు ప్రారంభం

బస్సులు ప్రారంభం

విశాఖ - కర్నూలు మధ్య నడిచే ఈ కొత్త సర్వీసు ప్రతిరోజు విశాఖపట్నం నుండి సాయంత్రం 4.30 గంటలకు బయలుదేరి రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, డోర్నాల, ఆత్మకూరు, నందికొట్కూరు మీదుగా కర్నూలకు మరుసటి రోజున ఉదయం 7.45 గంటలకు చేరుకుంటుంది.

బస్సులు ప్రారంభం

బస్సులు ప్రారంభం

మళ్ళీ అదేరోజు సాయంత్రం కర్నూలులో సాయంత్రం నాలుగు గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7.30 గంటలకు విశాఖపట్నం చేరుతుంది. విశాఖ నుంచి కర్నూలు వెళ్ళేందుకు రూ.778 చార్జీగా నిర్ణయించారు.

బస్సులు ప్రారంభం

బస్సులు ప్రారంభం

ప్రతిరోజు విశాఖ నుంచి మధ్యాహ్నం 3.30 గంటలకు బయలుదేరి రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, మార్కాపురం, కంబం, పోరుమామిళ్ళ, మైదుకూరు మీదుగా ఉదయం ఏడుగంటలకు కడప చేరుతుంది.

బస్సులు ప్రారంభం

బస్సులు ప్రారంభం

కడపలో సాయంత్రం 4.30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7.30 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. విశాఖపట్నం నుంచి కడప వెళ్ళేందుకు చార్జీ రూ.831లుగా నిర్ణయించారు.

బస్సులు ప్రారంభం

బస్సులు ప్రారంభం

దీనికి ముఖ్యమంత్రిగా హాజరైన ఆర్టీసీ విజయనగరం జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జగదీష్ బాబు మాట్లాడుతూ ప్రతి జిల్లాలకు విశాఖ నుంచి సూపర్ లగ్జరీ సర్వీసును ప్రవేశపెట్టాలనేది తమ లక్ష్యంగా పేర్కొన్నారు. ప్రయాణికులకు మెరుగైన, నాణ్యతతో కూడిన సేవలందించడం కోసం మరిన్ని బస్సులు అందుబాటులో వస్తాయన్నారు.

English summary
Photos of Vishaka to Kadapa and Kurnool Buses launched.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X