తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విసుగు లేకుండా: జగన్ డప్పువాయిస్తే డ్యాన్స్(పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

చిత్తూరు: ఎన్నికల నేపథ్యంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి శనివారం తిరుపతిలో నిర్వహించిన జన భేరి సభ విజయవంతమైంది. తిరుపతిలో నిర్వహించిన రోడ్‌షో దాదాపు ఏడున్నర గంటల పాటు సాగింది.

ఇందులో భాగంగా వైయస్ మరణాన్ని జీర్ణించుకోలేక మృతి చెందిన కుటుంబాలను ఆయన ఓదార్చారు. ఈ సందర్భంగా ఒక్కొక్కరికి లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేసి, వారి కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

వారు ఇచ్చిన విందును జగన్ ప్రేమతో స్వీకరించారు. ఈ సందర్భంగా వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకుని, భయపడొద్దని, మంచి రోజులు వస్తాయని భరోసా ఇచ్చారు.

జగన్

జగన్

లీలామహాల్ జంక్షన్ వద్ద సాయంత్రం 6.30 గంటలకు ఏర్పాటు చేసిన జగన్ జనభేరి సభలో పాల్గొన్నారు. సుమారు వేలాది మంది తరలి వచ్చారు.

విమానాశ్రయంలో ఆహ్వానం

విమానాశ్రయంలో ఆహ్వానం

అంతకు మునుపు ఉదయం 7.45 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న ఆయన ఎమ్మెల్యే భూమన్ కరుణాకర్ రెడ్డి నివాసానికి చేరుకుని అల్పాహరం చేశారు.

రోడ్డుషో

రోడ్డుషో

తొమ్మిది గంటలకు లక్ష్మిపురం జంక్షన్ నుండి రోడ్‌షో ప్రారంభమైంది. దారిపొడవునా మహిళలు నీరాజనాలు పలికారు. కొన్ని కోట్ల జనాలు పలుచగా ఉన్నా ఎక్కువ ప్రాంతాల్లో ప్రజలు పెద్దఎత్తున గుమిగూడి జగన్‌ను చూసి చేతులు ఊపుతూ అభినందనలు తెలిపారు.

అభివాదం

అభివాదం

జగన్ కూడా రోడ్‌షో వాహనం దిగి మహిళలు, యువకుల వద్దకు వెళ్లి కరచాలనం చేస్తూ, చంటిపిల్లలను, వృద్ధులను ముద్దాడారు. పలువురు జగన్‌కు పాదాభివందనం చేశారు.

జనభేరీ

జనభేరీ

లక్ష్మిపురం జంక్షన్ నుండి ప్రారంభమైన ఈ రోడ్‌షో పాసుపోర్టు కార్యాలయం, టివిఎస్ షోరూమ్, బిగ్‌షి సినిమా థియేటర్, ఈస్టు పోలీస్ స్టేషన్, టిపి ఏరియా, బండ్లవీధి, నాలుగుకాళ్ల మండపం, గాంధీరోడ్డు, కృష్ణాపురం ఠాణా, ఎన్‌టిఆర్ సర్కిల్, ఐఎస్ మహాల్, స్విమ్స్ సర్కిల్ మీదుగా పాతప్రసూతి ఆసుపత్రి, భవానీ నగర్ జంక్షన్, వివిమహాల్ జంక్షన్, మున్సిపల్ కార్యాలయం మీదుగా లీలామహాల్ జంక్షన్ వద్ద జరిగే జనభేరి సభాప్రాంగణం వరకూ సాగింది.

విసుగు లేకుండా

విసుగు లేకుండా

జగన్ రోడ్‌షో సందర్భంగా ఎక్కడైనా కొంతమంది యువకులైనా, మహిళలైనా ఆగాలని కోరితే విసుగు లేకుండా తన వాహనాన్ని ఆపి వారి వద్దకు వెళ్లి ఆప్యాయంగా పలకరించారు.

నమస్కారం

నమస్కారం

రోడ్‌షో మార్గంలో కళాశాలల మీదుగా సాగుతున్న సమయంలో విద్యార్థులు జై జగన్ అంటూ రోడ్లపైకి వచ్చారు. వారిని చూసి జగన్ అభివాదం చేశారు.

డోలు వాయిస్తూ..

డోలు వాయిస్తూ..

ఇక వర్తక వ్యాపారులు తమ తమ దుకాణాల ముందు నిలుచుని జగన్‌కు అభివాదం చేశారు. పలుచోట్ల పూలవర్షం కురిపించారు. మహిళలు మంగళహారతులు పలికారు. పలుచోట్ల గుమ్మడికాయలతో హారతులు పలికారు. జగన్ డప్పు వాయించారు. వాటికి అనుగణంగా పలువురు అనుగుణంగా నృత్యాలు చేశారు.

English summary
YSR Congress Party chief YS Jaganmohan Reddy's road show successed in Tirupati.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X