వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నిజాం లొంగిన పోస్టర్‌: స్త్రీలనూ ఎత్తేశారు (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ బిజెపి బుధవారంనాడు నిర్వహించిన నిరసన కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. గోల్కొండ కోటలో జాతీయ జెండాను ఎగురేయడానికి బిజెపికి పోలీసుల అనుమతి లభించకపోవడంతో బుధవారం ఆందోళనకు దిగారు.

బిజెపి నాయకులు బద్దం బాల్ రెడ్డి, నాగం జనార్దన్ రెడ్డి తదితరులు ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్నారు. గోల్కొండ కోట వద్దకు చేరుకున్న బిజెపి నాయకులను, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. మజ్లీస్ కారణంగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడానికి తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ముందుకు రావడం లేదని బిజెపి నాయకులు విమర్శించారు.

గోల్కొండ కోట వద్ద ప్రభుత్వం భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేసింది. దాదాపు 300 మందిని అక్కడ మోహరించింది. ఎట్టి పరిస్థితిలోనూ జాతీయ జెండాను ఎగురవేస్తామని బిజెపి నాయకులు ప్రకటించడంతో గోల్కొండ కోట వద్దనే కాకుండా బాపూ ఘాట్ వద్ద కూడా భారీగా పోలీసులను మోహరించారు.

నిజాం లొంగిన పోస్టర్

నిజాం లొంగిన పోస్టర్

హైదరాబాద్ రాజ్యం నిజాం ఇండియన్ యూనియన్ హోం మంత్రి సర్దార్ పటేల్ ముందు లొంగిపోయిన దృశ్యం పోస్టర్‌తో బద్దం బాల్ రెడ్డి...

మహిళల అరెస్టు

మహిళల అరెస్టు

తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగిన మహిళలను పోలీసులు అరెస్టు చేశారు.

మహిళలను అరెస్టు చేస్తూ..

మహిళలను అరెస్టు చేస్తూ..

తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగిన మహిళనలు పోలీసులు ఇలా తోసుకెళ్లారు.

ఎలా ఎత్తుకెళ్లారు..

ఎలా ఎత్తుకెళ్లారు..

తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగిన బిజెపి మహిళా కార్యకర్తలను ఇలా ఎత్తుకెళ్లారు.

ఓ మహిళా కార్యకర్తను ఇలా..

ఓ మహిళా కార్యకర్తను ఇలా..

తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ గోల్కొండ ఖిల్లా వద్ద ఆందోళనకు దిగిన బిజెపి కార్యకర్తలను పోలీసులు బలవంతంగా అరెస్టు చేశారు.

కార్యకర్తల అరెస్టు

కార్యకర్తల అరెస్టు

తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగిన బిజెపి కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు.

బిజెపి ఆందోళన ఇలా...

బిజెపి ఆందోళన ఇలా...

తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని ఆందోళన చేయడానికి గోల్కొండ కోటకు చేరుకుంటున్న బిజెపి కార్యకర్తలు

జాతీయ జెండాలతో...

జాతీయ జెండాలతో...

తెలంగాణ విమోచని దినోత్సవం సందర్భంగా గోల్కొండ కోటలో ఎగురవేయడానికి జాతీయ పతాకలతో గోల్కొండ కోట వద్దకు చేరుకున్న బిజెపి కార్యకర్తలు

మహిళా కార్యకర్తను ఇలా...

మహిళా కార్యకర్తను ఇలా...

జాతీయ జెండాతో వచ్చిన ఓ మహిళా కార్యకర్తను మహిళా పోలీసులు చుట్టుముట్టి అదుపులోకి తీసుకుంటున్న దృశ్యం

గోల్కొండ కోట వద్ద నినాదాలు..

గోల్కొండ కోట వద్ద నినాదాలు..

తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా గోల్కొండ కోటలో జాతీయ పతాకలను ఎగురేస్తామంటూ వచ్చిన మహిళా కార్యకర్తలు

సర్దార్ పటేల్ బొమ్మతో..

సర్దార్ పటేల్ బొమ్మతో..

సర్దార్ వల్లబ్ భాయ్ చిత్రాన్ని, నిజాం లొంగిపోయిన దృశ్యం చిత్రాన్ని ప్రదర్శిస్తూ బిజెపి కార్యకర్తలు ఇలా గోల్కొండ కోట వద్ద...

బిజెపి కార్యకర్తల అరెస్టు...

బిజెపి కార్యకర్తల అరెస్టు...

తెలంగాణ విమోచన దినోత్సవం సందర్బంగా గోల్కొండ కోటలో జాతీయ జెండాను ఎగురేస్తామంటూ వచ్చిన బిజెపి కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు.

ఉద్రిక్తత ఇలా...

ఉద్రిక్తత ఇలా...

గోల్కొండ కోటలో తెలంగాణ విమోచన దినోత్సవం సందర్బంగా జాతీయ జెండాలను ఎగురేస్తామంటూ బిజెపి కార్యకర్తలు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

బిజెపి నేతలు ఇలా..

బిజెపి నేతలు ఇలా..

సర్దార్ వల్లబ్ భాయ్ పటేల్ ఎదుట లొంగిపోయిన నిజాం దృశ్యానికి చెందిన చిత్రంతో బిజెపి నాయకులు ఇంద్రసేనా రెడ్డి, బద్దం బాల్ రెడ్డి, లక్ష్మణ్ తదితరులు...

నాగం ఇలా..

నాగం ఇలా..

గోల్కోండ కోట వద్ద జాతీయ జెండాను ఎగురేస్తామంటూ బిజెపి ఆందోళనకు దిగిన నేపథ్యంలో పోలీసులతో నాగం జనార్దన్ రెడ్డి ఇలా..

కిషన్ రెడ్డి ఇలా...

కిషన్ రెడ్డి ఇలా...

తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన ఆందోళనలో బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఇలా..

English summary
BJP leaders and workers have been arrested by police during protest against Telangana liberation issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X