వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబు బెలూన్లు ఎగరేశారు, ఛలోక్తి (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

అనంతపురం‌: తల్లిదండ్రులు లేని పేద పిల్లలకు ప్రభుత్వమే తల్లీ, తండ్రీ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. రాష్ట్రంలోని బడి ఈడు పిల్లలందర్నీ బడిలో చేర్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. శుక్రవారం మున్సిపల్‌ పరిధిలోని కుటాగుళ్ల ఉన్నత పాఠశాలలో ప్రభుత్వం చేపట్టిన ‘బడి పిలుస్తోంది' అనే కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించారు. రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడారు. చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమంలో బెలూన్లు ఎగరేశారు.

బడికి రాకుండా పొలంలో ఉన్నా, ఫ్యాక్టరీలో ఉన్నా మీరే అక్కడ ధర్నాచేయాలి అన్నారు. ప్రతి విద్యార్థి పాఠశాలలో మొక్కలు నాటాలన్నారు. ఆ మొక్కలు పెరిగేకొద్దీ విద్యార్థులూ పెరగాలన్నారు. భవిష్యత్‌లో ఆ మొక్క సమాజానికి ఆక్సిజన్‌ను ఇస్తుందన్నారు. విద్యార్థులు కూడా బాగా చదువుకుని సమాజానికి సేవ చేయాలని సూచించారు.

చంద్రబాబు బడి పిలుస్తోంది...

చంద్రబాబు బడి పిలుస్తోంది...

అనంతపురం జిల్లా కదిరిలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం బడి పిలుస్తోంది కార్యక్రమాన్ని ప్రారంభించారు.

చంద్రబాబు బడి పిలుస్తోంది..

చంద్రబాబు బడి పిలుస్తోంది..

రాష్ట్రంలో 6 సంవత్సరాలు నిండి 14 సంవత్సరాల్లోపు పిల్లలు బడిలో ఉండాలని చంద్రబాబు అన్నారు. ప్రభుత్వం బడి బయట ఉండే పిల్లల కోసమే ఈ కార్యక్రమం నిర్వహిస్తోందన్నారు.

చంద్రబాబు బడి పిలుస్తోంది..

చంద్రబాబు బడి పిలుస్తోంది..

అమ్మాయిలు బాగా చదువుకుని, ఉద్యోగాలు సాధించాలన్నారు. అప్పుడే అబ్బాయిలు ఎదురు కట్నమిచ్చి పెళ్ళిళ్లు చేసుకుంటారని చంద్రబాబు చలోక్తి విసిరారు.

చంద్రబాబు బడి పిలుస్తోంది...

చంద్రబాబు బడి పిలుస్తోంది...

ఈనెల 25 నుంచి ఆగస్టు 2 వరకు బడిపిలుస్తోంది కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చంద్రబాబు చెప్పారు. రాష్ట్రం నూటికి నూరు శాతం అక్షరాస్యతను సాధిస్తామన్నారు. అందుకు ప్రజల సహకారం కావాలన్నారు.

చంద్రబాబు బడి పిలుస్తోంది..

చంద్రబాబు బడి పిలుస్తోంది..

బడికి రాని పిల్లలుంటే తోటి పిల్లలు వారిని పిలుచుకు రావాలని చెప్పారు. చదువుకోవడానికి డబ్బు లేవంటే తాము ఇస్తామని పిలుపునిచ్చారు.

రైతు సదస్సులో బాబు

రైతు సదస్సులో బాబు

ప్రతి రైతు కళ్లలో ఆనందం చూసేందుకే రుణమాఫీ చేసినట్లు ఆయన చేసిన ప్రసంగం ఆ వర్గాల్లో నూతనోత్సాహాన్ని నింపింది. రైతు సదస్సులో ఆయన ప్రసంగించారు.

రైతు సదస్సులో బాబు

రైతు సదస్సులో బాబు

నిజమైన రైతులకు రుణమాఫీతో మేలు చేకూరుతుందని చంద్రబాబు భరోసా ఇచ్చారు. రైతులకు రుణమాఫీ చేయడం వైసీపీకి ఇష్టం లేకనే విమర్శలు చేస్తోందన్నారు.

రైతు సదస్సులో బాబు

రైతు సదస్సులో బాబు

ప్రతిపక్ష నేతల విమర్శలు పట్టించుకోనవసరం లేదంటూ, తనకెన్ని కష్టాలున్నా ఇచ్చిన మాట నిలబెట్టుకుని రుణమాఫీ చేశానని చంద్రబాబు చెప్పారు. పండ్లతోటలు, మొక్కల పెంపకం, డ్రిప్‌ ఇరిగేషన్‌ వంటివి ప్రోత్సహించడం వల్ల కరువు సీమ రూపాంతరం చెందుతుందన్నారు.

రైతు సదస్సులో బాబు

రైతు సదస్సులో బాబు



తమ హయాంలో ప్రారంభించిన డ్రిప్‌ ఇరిగేషన్‌ దేశంలోనే అ నంతలో ఎక్కువగా ఉండటం మహదానందంగా ఉందని చంద్రబాబు అన్నారు.

రైతు సదస్సులో బాబు

రైతు సదస్సులో బాబు

ఇజ్రాయెల్‌ తరహాలో వ్యవ సాయం చేస్తే మంచి దిగుబడులు వచ్చి రైతుకు లాభాలు చేకూరుతాయని చంద్రబాబు అన్నారు. అందుకే వందశాతం రైతులకు డ్రిప్‌ సౌకర్యం కల్పించాలని సంకల్పించామన్నారు.

రైతు సదస్సులో బాబు

రైతు సదస్సులో బాబు

ఎస్సీ, ఎస్టీ రైతులకు వందశాతం, సన్నకారు రైతుకు 90 శాతం, పెద్ద రైతులకు 70 శాతం ఇవ్వడంతో పాటు రూ.లక్ష వరకు సబ్సిడీ ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు.

రైతు సదస్సులో బాబు

రైతు సదస్సులో బాబు

వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా వర్ష పు నీటిని భూగర్భజలాలుగా మార్చి చెక్‌డ్యాం లు, పర్కులేషన్‌ ట్యాంక్‌ల ద్వారా నీటిని సమ ర్థవంతంగా వాడుకునే అవకాశాన్ని కల్పించబోతున్నట్టు చంద్రబాబు చెప్పారు.

రైతు సదస్సులో బాబు

రైతు సదస్సులో బాబు

మరో ఐదేళ్ల లో జిల్లా ప్రజలను చూస్తే పేదరికమే భయపడేలా చేసే బాధ్యత తీసుకుంటామని చంద్రబాబు చెప్పారు. వ్యవసాయ ఉత్పాదక పరిశ్రమలు స్థాపించి రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించే బాధ్యత కూడా ప్రభుత్వానిదేనన్నారు.

మొక్కల పెంపకం

మొక్కల పెంపకం

రాష్ట్రంలో మొక్కల పెంపకానికి ప్రాధాన్యత ఇస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు.

మొక్కల పెంపకం

మొక్కల పెంపకం

రాష్ట్రంలో అడవు లు తగ్గిపోవడంతో వర్షాలు కురవక భూగర్భజలాలు అడుగంటిపోతున్నాయని, ప్రతి ఒక్క రూ ఓ మొక్క నాటితే మన తరువాతి తరాలను కాపాడుతాయని చంద్రబాబు అన్నారు. ప్రతి ఇంటి వద్ద మొక్కలు నాటాలని కోరారు.

వృద్ధ మహిళలతో ఇలా..

వృద్ధ మహిళలతో ఇలా..

తనను కలిసిన వృద్ధ మహిళలను చంద్రబాబు పలకరించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యలకు పరిష్కారం చూపుతానని అన్నారు.

ఉన్నత చదువుల కోసం ఎక్కడికీ పోవాల్సిన పనిలేదన్నారు. అనంతపురంలోనే మెడికల్‌, ఇంజనీరింగ్‌ కాలేజీలు, నిట్‌ ఏర్పాటు చేస్తామన్నారు. మళ్లీ వస్తాననీ, బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకుంటే రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డులు, సన్మానం చేయిస్తానని విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు. తల్లిదండ్రుల తర్వాత గురువులదే కీలకపాత్ర అనీ, వారిని గౌరవించాలన్నారు. బాగా పనిచేసే ఉపాధ్యాయులను సన్మానిస్తామన్నారు. వారికి అవార్డులు ఇస్తామన్నారు.

వారం రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా బడి పిలుస్తోంది కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. 26న బడి ఉత్సవం, 28న బాలికోత్సవం, 30న ప్రత్యేక అవసరాల పిల్లల దినోత్సవం, 31న విద్యా సదస్సు, ఆగస్టు 1న విద్యార్థుల రోజు, 2న సామాజిక దినోత్సవం జరుపుకోవాలని ఆదేశించారు.

English summary

 Pictures: Chandrababu at Kadiri
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X