వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబుకు సెగ: అమెరికాను అభివృద్ధి మన వల్లే (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

కాకినాడ: తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు మంగళవారం జిల్లాలో చేపట్టిన రోడ్‌షో సందర్భంగా అసమ్మతి సెగ తగిలింది. ప్రజల నుంచి ఆయన రోడ్ షోకు ప్రజలు పోటెత్తారు. కోరుకొండ మండలం గాడాల నుంచి రావులపాలెం వరకూ రోడ్ నిర్వహించారు. రోడ్‌షో సక్సెస్ కావడతో ఆ పార్టీ కేడర్‌లో నూతనోత్సాహం నెలకొంది. మధురపూడి ఎయిర్‌పోర్టుకు చేరిన తర్వాత ఎంఆర్‌పీఎస్ నేతలు పలువురు జిల్లాలో మాదిగలకు సీట్లు కేటాయించాలని చంద్రబాబును కోరారు.

అనంతరం గాడాల గ్రామం నుంచి రోడ్ షోకు శ్రీకారం చుట్టారు. ఆ తర్వాత కోలమూరు, కొంతమూరు, క్వారీ మార్కెట్, రాజమండ్రి, మోరంపూడి మీదుగా బొమ్మూరు చేరుకున్నారు. అక్కడ చంద్రబాబుకు కాపు, బిసి వర్గాల నుంచి ఫ్లకార్డులతో నిరసన వ్యక్తమైంది. ఈ ప్రాంతంలో బిసిలు, కాపులు అవసరం లేదా అంటూ ఫ్లకార్డులు ప్రదర్శించారు. గోరంట్ల గోబ్యాక్ అంటూ ఫ్లకార్డులు ప్రదర్శించారు.

చంద్రబాబు ప్రసంగించే సమయంలో కూడా ఆందోళన కారులు నినాదాలు ఇవ్వడంతో చంద్రబాబు జోక్యం చేసుకుని తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ గల కార్యకర్తల గల పార్టీ అని, పొత్తుల వల్ల కొన్ని త్యాగాలు తప్పలేదని న్యాయం చేస్తామని ఏమైనా వుంటే చర్చించుకుని పరిష్కరించుకుందామని కాని ఇలా రోడ్ల మీద నిరసనలు చేయడం సరికాదని చెప్పడంతో వారు శాంతించారు.

టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత కాపులను బిసిల్లో చేర్చి వారి సంక్షేమానికి పాటుపడతామని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. బిసిల్లో కాపులను చేర్చేందుకు కమీషన్ వేస్తానని చంద్రబాబు చెప్పారు. అమెరికాను కూడా మన వాళ్లే అభివృద్ధి చేశారన్నారు. బిల్‌గేట్స్‌కు నాదెళ్ళ సత్య అండగా నిలిచారని, అటువంటి శక్తి ఉన్న మనం కలసి అభివృద్ధి చేసుకుందామని చెప్పారు.

రోడ్ షోలో చంద్రబాబు

రోడ్ షోలో చంద్రబాబు

తూర్పు గోదావరి జిల్లాలో చంద్రబాబు రోడ్‌షో నిర్వహించారు. ఆయనకు ప్రజల నుంచి మంచి స్పందన లభించింది.

నిరసన సెగ..

నిరసన సెగ..

చంద్రబాబుకు కాపు, బీసీ వర్గాల నుంచి నిరసన సెగ తాకింది. బీసీలు, కాపులు ప్లకార్డులు ప్రదర్శించారు. వారికి చంద్రబాబు సర్ధి చెప్పారు.

పోలవరం పూర్తి చేస్తాం

పోలవరం పూర్తి చేస్తాం

పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి వ్యవసాయాదార పరిశ్రమను నిర్మిస్తామని ఫుడ్ పాత్ సెంటర్‌లు ఏర్పాటు చేస్తామని చంద్రబాబు తెలిపారు.

అంతర్జాతీయ స్థాయికి..

అంతర్జాతీయ స్థాయికి..

రాజమండ్రి అంతర్జాతీయ స్థాయికి అభివృద్ది చేస్తానని చంద్రబాబు తెలిపారు. జిల్లాకు ఒక నగరాన్ని రాజధాని మాదిరిగా అభివృద్ది చేస్తామని, రాజమండ్రి, కాకినాడలను హైదరాబాదు స్థాయిలో అభివృద్ధి చేస్తానని తెలిపారు.

పర్యాటక ప్రాంతంగా జిల్లా..

పర్యాటక ప్రాంతంగా జిల్లా..

తూర్పుగోదావరి జిల్లాను పర్యాటక ప్రాంతంగా చేస్తానని హామీ ఇచ్చారు. గోదావరి డెల్టా దేశానికి అన్నదాత అని, కానీ కాంగ్రెస్ వల్ల ఇక్కడ రైతులు క్రాప్ హాలీడే ప్రకటించే పరిస్ధితి ఏర్పడిందని ఆయన అన్నారు.

హామీలన్నీ అమలు చేస్తా..

హామీలన్నీ అమలు చేస్తా..

అధికారంలోకి వచ్చిన వెంటనే రైతు రుణాలు, డ్వాక్రా రుణాలు రద్దు చేస్తాను. ఈ హామీలకు కట్టుబడి ఉన్నాను ' అని పిలుపునిచ్చారు. రాత్రి పదిగంటలకు రావులపాలెంలో జరిగిన సభతో రోడ్ షో ముగిసింది. అక్కడి నుంచి ఆయన పశ్చిమ గోదావరి జిల్లా వెళ్లారు.

రావులపాలెం వస్తా..

రావులపాలెం వస్తా..

ముఖ్యమంత్రి పదవి చేపట్టగానే మొట్టమొదటగా రావులపాలెం వస్తానని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు.

సింగుపూర్‌లా సీమాంధ్ర

సింగుపూర్‌లా సీమాంధ్ర

నిరుద్యోగ యువతకు వెయ్యి నుంచి 2 వేల వరకు నిరుద్యోగ భృతి కల్పిస్తానని చంద్రబాబు అన్నారు. కుల, మత ప్రాంతాలకు అతీతంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని నూతన ఆంధ్రప్రదేశ్‌ను మరో సింగపూర్‌గా మారుస్తానన్నారు.

అమెరికాను అభివృద్ధి చేశాం....

అమెరికాను అభివృద్ధి చేశాం....

అమెరికాను కూడా మనవాళ్లే అభివృద్ధి చేశారని, హైదరాబాదును తానే అభివృద్ధి చేశానని చంద్రబాబు చెప్పుకున్నారు.

దండ వేశారు..

దండ వేశారు..

చంద్రబాబుకు రోడ్ షోలో మంచి ప్రతిస్పందన వేశారు. తూర్పు గోదావరి జిల్లా పర్యటనలు అడుగడుగునా ఆయన స్వాగతం లభించింది.

చేతులు కలిపేందుకు..

చేతులు కలిపేందుకు..

చంద్రబాబుతో చేతులు కలిపేందుకు పురుషులు, మహిళలు పోటీ పడ్డారు. ఆయన చిరునవ్వుతో వారి స్వాగతాన్ని స్వీకరించారు.

English summary
Telugudesama party president Nara Chandrababu Naidu has been well recieved by East Godavari public.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X