గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

భారీ వర్షం: గుంటూరు జిల్లాలో బీభత్సం (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

గుంటూరు: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో కురిసిన భారీ వర్షాలకు గుంటూరు జిల్లా తల్లడిల్లింది. వాగులు, వంకలు పొంగి పొర్లాయి. గుంటూరు జిల్లా తాడికొండ మండలంలో వాగులో పడ్డ ఇద్దరిలో ఒకరు మరణించగా, మరొకరి గల్లంతయ్యారు. తాడికొండ మండలం రావెల గ్రామానికి చెందిన మూల్పూరి వాసుదేవరావు (32) తాడికొండ-కంతేరు మధ్య ఎర్రవాగులో పడి మృత్యువాతపడ్డాడు. అచ్చంపేట మండలం కోనూరు గ్రామానికి చెందిన యలగాల సీతామహాలక్ష్మి పిడుగుపాటుకు గురై మృతిచెందింది.

తాడికొండ మండలంలో వాగులో పడి ఒకరు, గుంటూరు-అమరావతి రహదారిపై లాం చప్టా వద్ద గల కొండవీటి వాగులో గుర్తు తెలియని మరో మహిళ కూడా గల్లంతైంది.మేడికొండూరు మండలం పేరేచర్ల 6వ మైలు వద్ద ప్రధాన రహదారికి గండి పడటంతో వర్షపునీరు భారీగా రైల్వేట్రాక్‌పైకి చేరుకుని రైల్వేట్రాక్ కొట్టుకుపోయింది.

చిలకలూరిపేట రిజిస్ట్రార్ ఆఫీసు, గుంటూరు నగరంలోని పలు ప్రభుత్వ కార్యాలయాలు, ప్రధాన రహదారులు, విద్యాలయాలు, గుంటూరు 1, 2 ఆర్టీసీ డిపోల్లోకి నీరు చేరింది. పెదకూరపాడులోని అంకమ్మ ఆలయ గోపురం మీద పిడుగుపడి పాక్షికంగా ధ్వంసమైంది.

గుంటూరు జిల్లా అస్తవ్యస్తం

గుంటూరు జిల్లా అస్తవ్యస్తం

గుంటూరు జిల్లాలో గురువారం ఉదయం నుంచి భారీ వర్షాలు కురిశాయి. వేలాది ఎకరాల పంట పొలాలు నీటమునిగాయి.

గుంటూరు జిల్లా అస్తవ్యస్తం

గుంటూరు జిల్లా అస్తవ్యస్తం

గురువారం వేకువఝాము నుండి రాత్రి వరకు ఎడతెరిపి లేకుండా కురిసిన భారీవర్షంతో జనజీవనం అస్తవ్యస్తమైంది.

గుంటూరు జిల్లా అస్తవ్యస్తం

గుంటూరు జిల్లా అస్తవ్యస్తం

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో కురిసిన భారీ వర్షాలకు గుంటూరు జిల్లా తల్లడిల్లింది. వాగులు, వంకలు పొంగి పొర్లాయి.

గుంటూరు జిల్లా అస్తవ్యస్తం

గుంటూరు జిల్లా అస్తవ్యస్తం

విజయవాడ-హుబ్లీ ప్యాసింజర్ రైలును 4 గంటల పాటు నిలుపుదల చేసిన అనంతరం రైల్వేట్రాక్ మరమ్మతులు చేపట్టి తిరిగి ఈ మార్గం గుండా రైళ్ల రాకపోకలు సాగించారు.

English summary
Heavy rains due to depression in Bay of Bengal, guntur district has been affected.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X