వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లొంగిపోయిన మావోయిస్టు దంపతులు వీరే (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: మావోయిస్టు అగ్రనేత, సంస్థ మొబైల్ మిలిటరీ స్కూల్ ఇన్‌ఛార్జిగా వ్యవహారిస్తున్న వరంగల్ జిల్లా జఫర్‌ఘడ్ మండలం తమ్మడిపల్లి గ్రామానికి చెందిన చంబాల రవీందర్ అలియాస్ కుక్కల రవీందర్ అలియాస్ అర్జున్(44) భార్య దేవితో కలిసి శుక్రవారం తెలంగాణ డిజిపి అనురాగ్ శర్మ ముందు లొంగిపోయారు. మావోయిస్టు నేతను డిజిపి అనురాగ్ శర్మ శుక్రవారంనాడు మీడియా ముందు హాజరుపరిచారు.

2010లో మావోయిస్టులకు శిక్షణనిచ్చే మొబైల్ మిలిటరీ స్కూల్ సంస్థకు ఇన్‌ఛార్జిగా వ్యవహారిస్తూ ఆ తర్వాత రవీందర్ రెండో బెటాలియన్ ఇన్‌ఛార్జిగా పనిచేసినట్లు తెలిపారు. ఈ ఏటా దండకారణ్యం కమ్యూనికేషన్ విభాగానికి ఇన్‌ఛార్జిగా పనిచేస్తున్న రవీందర్ మావోయిస్టులతో చేరి ఇరవై ఏళ్లు గడిచిన తర్వాత పార్టీలో ఇతర నేతలతో తలెత్తిన తీవ్ర విభేధాల కారణంగా పార్టీని వీడినట్లు డిజిపి అనురాగ్ శర్మ వివరించారు. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లోని పాఠశాల భవనాలు, సెల్ టవర్లను మావోయిస్టులు కూల్చివేయటాన్ని వ్యతిరేకించిన చంబాలా రవీందర్, ఆయన సతీమణి పార్టీని వీడి తమ ముందు లొంగిపోయినట్లు చెప్పారని డిజిపి వెల్లడించారు.

మావోయిస్టు దంపతులు

మావోయిస్టు దంపతులు

రవీందర్ అనారోగ్యం కారణంగా పోలీసులకు లొంగిపోయినట్లు అనురాగ్ శర్మ స్పష్టం చేశారు. పేద కుటుంబానికి చెందిన రవీందర్‌కు నలుగురు సోదరులు, ముగ్గురు చెల్లెళ్లున్నట్లు తెలిపారు.

మావోయిస్టు దంపతులు

మావోయిస్టు దంపతులు

1985లో టెన్త్ పూర్తి చేసిన ఆయన 1990లో పీపుల్స్‌వార్ గ్రూప్‌లో చేరారని, ఆ తర్వాత దండకారాణ్య రాష్ట్ర జోనల్ పీపుల్స్‌వార్ గ్రూప్ కమిటీ దళంలో చేరి, వెంటనే బసగూడ సౌత్ బస్తర్ నుంచి పనిచేయటం మొదలుపెట్టినట్లు డిజిపి వివరించారు.

మావోయిస్టు దంపతులు

మావోయిస్టు దంపతులు

రవీందర్ 1993 ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక గెరిల్లా దళానికి డిప్యూటీ కమాండర్‌గా పనిచేసినట్లు డిజిపి చెప్పారు.

మావోయిస్టు దంపతులు

మావోయిస్టు దంపతులు

ఆ తర్వాత 1995లో మొట్టమొదటి సారిగా ప్రవేశపెట్టిన ప్లాటూన్ ఇన్ఫర్మేషన్‌లో కూడా రవీందర్ కీలకమైన బాధ్యతలు నిర్వర్తించినట్లు డిజిపి వివరించారు. అదే దళంలో పనిచేస్తున్న వెట్టి అదిమి అలియాస్ దేవితో వివాహం చేసుకున్నాడు.

మావోయిస్టు దంపతులు

మావోయిస్టు దంపతులు

2004లో దళ కమాండర్ స్థాయికి ఎదిగిన రవీందర్ పీపుల్స్‌వార్ గ్రూప్ ఏర్పాటు చేసిన కంపెనీకి మొట్టమొదటి దళ కమాండర్‌గా వ్యవహారించినట్లు డిజిపి అనురాగ్ శర్మ తెలిపారు.

మావోయిస్టు దంపతులు

మావోయిస్టు దంపతులు

మావోయిస్టు పార్టీలో కొన్ని సార్లు అగ్రనేతలు కనీసం తన అభిప్రాయాన్ని కూడా తీసుకోకుండా ఇతర విభాగాలకు బదిలీ చేశారని, అయినా తాను కొనసాగానని రవీందర్ మీడియా ముందు చెప్పారు.

రవిపై రూ. 20లక్షలు, ఆయన సతీమణిపై రూ. 5లక్షలు ప్రభుత్వం నగదు పురస్కారాన్ని ప్రకటించినట్లు కూడా డిజిపి తెలిపారు. ఇదిలా ఉండగా, చత్తీస్‌ఘడ్‌లో వీరిద్దరిపై హత్యలు, పలు పేల్చివేతల కేసులున్నాయని, వాటిని దర్యాప్తు చేస్తున్నట్లు డిజిపి ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో మరో 166 మంది మావోయిస్టులు అజ్ఞాతంలో ఉన్నారని, వీరిలో 11 మంది కేంద్ర కమిటీ ప్రతినిధులున్నట్లు ఆయన వివరించారు.

ఇపుడిపుడే గిరిజన ప్రాంతాల్లో కాస్తా మౌలిక సదుపాయల కల్పన, అభివృద్ధి వంటివి, పాఠశాల భవనాలు, కొత్తగా ఏర్పాటవుతున్న రోడ్లు, సెల్ టవర్లను పేల్చివేయటంతో తాము వ్యతిరేకించామని, ఆయన వారి ప్రవర్తనలో మార్పు రాకపోవటంతో పార్టీని వీడి జనజీవన స్రవంతిలో కలిసేందుకే తాము లొంగిపోతున్నట్లు రవీందర్ వివరించారు.

English summary
Pictures: Maoist couple surrender
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X