విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పాత నేరస్థుడి అరెస్టు: నకిలీ హోం గార్డులు (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: నగరంలోని పెందుర్తి, కంచరపాలెం పోలీస్ స్టేషన్ల పరిధుల్లో 9 నేరాలకు పాల్పడిన పాత నేరస్థుడిని పెదుర్తి పోలీసులు గురువాంనాడు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. క్రైం ఎడిసిపి ఎన్ వరదరాజు అతనికి సంబంధించిన వివరాలను మీడియా సమావేశంలో వెల్లడించారు.

గతంలో అతను 30కి పైగా నేరాలు చేసి జైలుకు వెళ్లాడు. అతని నుంచి 50 గ్రాముల బంగారం, 2 కిలోల వెండి స్వాధీనం చేసుకున్నారు. విజయనగరం జిల్లా మక్కువ మండలం మామిడిపల్లి గ్రామానికి చెందిన చోబోలు విజయ్ కుమార్ మధురవాడలోని రాజీవ్ గృహకల్పలో జీవిస్తున్నాడు. గతంలో అతను పెందుర్తి సాయి మాధవనగర్‌లో అద్దెకు ఉండేవాడు. చోరీలు చేయడానికి అదే ప్రాంతాన్ని ఎంచుకున్నాడు.

పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా విజయ్ కుమార్ బైక్‌పై వెళ్తూ దొరికిపోయాడు. విచారణ జరిపి మధురవాడలోని అతని ఇంట్లో ఉన్న ఎల్‌సిడి, ఫిలిప్స్ హోం థియేటర్ కూడా స్వాధీనం చేసుకున్నారు.

పాత నేరస్థుడి అరెస్టు

పాత నేరస్థుడి అరెస్టు

విజయ్ కుమార్ 2005 - 2007 మధ్య కాలంలో వివిధ ప్రాంతాల్లో 30కి పైగా నేరాలకు పాల్పడ్డాడు. అతనికి జైలు శిక్ష కూడా పడింది. రాత్రి వేళల్లో తాళం వేసి ఉన్న ఇళ్ల తాళాలు, కిటికీలు పగులగొట్టి లోపలికి ప్రవేశించి దొంగతనాలు చేసేవాడు.

పాత నేరస్థుడి అరెస్టు

పాత నేరస్థుడి అరెస్టు

2008లో విజయ్ కుమార్ జైలు నుంచి వచ్చిన తర్వాత పిఎం పాలె పోలీసు స్టేషన్‌లో పోలీసులకు ఇన్‌ఫార్మర్‌గా మారాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో అతనిపై అనుమానం వచ్చి పోలీసులు దూరం పెట్టారు.

పాత నేరస్థుడి అరెస్టు

పాత నేరస్థుడి అరెస్టు

విజయ్ కుమార్ మారికవలస రాజీవ్ గృహ కల్పలో అద్దెకు ఉంటూ నేరాలకు పాల్పడినట్లు ఎడిసిపి వరద రాజు తెలిపారు.

నకిలీ హోంగార్డులు..

నకిలీ హోంగార్డులు..

వేరేవారి పేర్లతో హోంగార్డులుగా పనిచేస్తున్న ఇద్దరు వ్యక్తులను మహారాణి పేట జోన్ పోలీసులు గురువారంనాడు అరెస్టు చేశారు. వాసుపల్లి దాసు, తోలాడ కొండబాబు అనే పేర్లతో వేరే వ్యక్తులు హోంగార్డులుగా పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

నకిలీ హోంగార్డులు..

నకిలీ హోంగార్డులు..

వాసుపల్లి దాసు, తోలాడ కొండబాబు 2003లో హోంగార్డులుగా ఎంపికై రెండు నెలలు పనిచేసి మానుకున్నారు. దాంతో హోంగార్డు రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ ఎ జగన్మోహన్ రావు పెయిందొరపేటకు చెందిన అన్నదమ్ములు పిల్లా పోతు రాజు, పిల్లా పాలరాజులను గైర్హాజరైన హోంగార్డుల స్థానంలో ఉద్యోగాలకు ఏర్పాటు చేశాడు.

నకిలీ హోంగార్డుల

నకిలీ హోంగార్డుల

ఆ ఇద్దరికి జగన్మోహన్ రావు గుర్తింపు కార్డులు, బ్యాంక్ ఖాతాలు కూడా ఏర్పాటు చేశారు. పిల్లా పాలరాజు త్రీటౌన్ పోలీసు స్టేషన్‌లో బీచ్ మొబైల్‌లో విధులు నిర్వహిస్తుండగా, పిల్లా పోతురాజు ఆరు నెలలుగా విధులకు రావడం లేదు. ఆర్ఐ రామకృష్ణకు అనుమానం వచ్చి ఫిర్యాదు చేశారు.

English summary
An old culprit in theft acse, Vijaya Kumar has been nabbed by police
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X