మెదక్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గాంధీ వద్ద ఇలా, ఓయులో కొవ్వొత్తులు (ఫొటోలు)

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: మెదక్ జిల్లా మాసాయిపేట వద్ద పాఠశాల బస్సును నాందేడ్ ప్యాసెంజర్ రైలు ఢీకొట్టడంతో 16 మంది చిన్నారులు మృత్యువాత పడ్డారు. ఆడుతూ పాడుతూ ఇళ్ల నుంచి పాఠశాలకు బయలుదేరిన పిల్లలను మృత్యువు రైలు రూపంలో కాటేసింది.

పాపం పున్యం ప్రపంచ మార్గం తెలియని చిన్నారులు ఈ లోకాన్ని వదిలి పెట్టి వెళ్లిపోయారు. చిన్నారుల మృతదేహాలను సికింద్రాబాదులోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. గాంధీ ఆస్పత్రి వద్ద పరిస్థితి గురువారం అత్యంత దారుణంగా, గుండెను పిండేసినట్లుగా ఉంది.

తల్లిదండ్రుల రోదనలతో నిండిపోయింది. గాయపడిన విద్యార్థులు సికింద్రాబాదులోని యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతదేహాలను తల్లిదండ్రులకు అప్పగించారు. రైలు ప్రమాదంలో మరణించి పిల్లలకు ఆత్మలకు శాంతి చేకూరాలని హైదరాబాదులోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.

విగత జీవులు...

విగత జీవులు...

మెదక్ జిల్లా మాసాయిపేట వద్ద జరిగిన రైలు ప్రమాదంలో ముక్కు పచ్చలారని ఇద్దరు చిన్నారులు విగతజీవులై ఇలా గుండెకోతను మిగిల్చారు.

గాంధీ ఆస్పత్రి వద్ద ఇలా..

గాంధీ ఆస్పత్రి వద్ద ఇలా..

తమ పిల్లల కోసం వారి బంధువులు ఇలా గాంధీ ఆస్పత్రి వద్ద చూస్తున్నారు. తమవారున్నారా, లేరా అని పరిశీలిస్తున్నారు.

పద్మారావు ఓదార్పు...

పద్మారావు ఓదార్పు...

తనవారిని కోల్పోయిన ఓ వ్యక్తిని గాంధీ ఆస్పత్రి వద్ద ఓదారుస్తూ తెలంగాణ మంత్రి పద్మారావు ఇలా కనిపించారు.

వంశీ ప్రాణాలు కోల్పోయి..

వంశీ ప్రాణాలు కోల్పోయి..

గురువారం ఉదయం పూట తల్లిదండ్రుల వద్ద సెలవు తీసుకుని పాఠశాలకు బయలుదేరిన వంశీ ఇలా పరలోకానికి బయలుదేరాడు.

ఓయులో కొవ్వొత్తుల ర్యాలీ

ఓయులో కొవ్వొత్తుల ర్యాలీ

మెదక్ జిల్లా మాసాయిపేట రైలు ప్రమాదంలో మరణించిన చిన్నారుల ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఇలా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.

English summary
The dead bodies of children were kept in Secendurabad Gandhi hospital. 16 children died in Masaipet rail accident.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X