వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జూ.ఎన్టీఆర్, పవన్: ఎన్టీఆర్, చిరు ఫ్యామిలీల్లో..(పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలుగు సినీ పరిశ్రమలో ఎన్టీఆర్, చిరంజీవిలు దిగ్గజాలుగా వెలుగొందారు. అయితే, వారి కుటుంబాల్లో రాజకీయాలు చిచ్చు పెడుతున్నాయి. ఎన్టీఆర్ కుటుంబంలో ఏళ్ల కిందటే రాజకీయ విభేదాలు వచ్చాయి. చిరంజీవి కుటుంబంలోను ప్రజారాజ్యం విలీనం తర్వాత రాజుకున్న చిచ్చు.. పవన్ కల్యాణ్ పార్టీ స్థాపిస్తుండటంతో తారాస్థాయికి చేరింది.

ఎన్టీఆర్ మృతి తర్వాత నందమూరి కుటుంబం రాజకీయంగా ముక్కలయింది! టిడిపిని చంద్రబాబు నడిపిస్తున్నప్పటికీ నందమూరి హరికృష్ణతో నిత్యం తలనొప్పులు. కొంతకాలం క్రితం కొత్తగా జూనియర్ ఎన్టీఆర్ జత కలిశారు. తాజాగా బాలకృష్ణలోను అసంతృప్తి నెలకొన్నట్లుగా ప్రచారం జరిగింది.

చిరంజీవి తన పిఆర్పీని కాంగ్రెసులో విలీనం చేయక ముందు ఆయన కుటుంబ సభ్యులు అంతా ఒక్కతాటిపై నడిచారు. విలీనం తర్వాత పవన్ కళ్యాణ్‌లో అసంతృప్తి రాజుకుంది. పిఆర్పీ ద్వారా రాజకీయాల్లో ఏదో చేద్దామనుకున్న పవన్... చిరు పార్టీని కాంగ్రెసులో విలీనం చేయడంతో నీరుగారిపోయారు. ఇప్పుడు జనసేనతో ముందుకు వస్తున్నారు. ఆయన పార్టీకి కుటుంబ సభ్యలు దూరంగా ఉంటున్నారు. ఫ్యాన్స్ విషయానికి వస్తే.. అటు నందమూరి, ఇటు మెగా ఫ్యాన్స్ చీలిపోతున్నారు.

ఎన్టీఆర్ - చిరంజీవి 1

ఎన్టీఆర్ - చిరంజీవి 1

నిన్నటి వరకు స్వర్గీయ నందమూరి తారక రామారావు కుటుంబానికి పరిమితమైన రాజకీయ విభేదాలు.. ఇప్పుడు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి కుటుంబానికి పాకాయి.

ఎన్టీఆర్ 2

ఎన్టీఆర్ 2

ఎన్టీఆర్ మృతి తర్వాత ఆయన స్థాపించిన టిడిపిలో ఎన్నో పరిణామాలు వచ్చాయి. దగ్గుబాటి వెంకటేశ్వర రావు, పురంధేశ్వరి దంపతులు దూరం కావడమే కాకుండా... లక్ష్మీ పార్వతి, హరికృష్ణలు వేర్వేరు పార్టీలు పెట్టారు. కొంతకాలంగా నారా - నందమూరి కుటుంబాల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి.

చిరంజీవి 3

చిరంజీవి 3

ఇప్పుడు పవన్ కల్యాణ్ జనసేన పేరుతో కొత్త పార్టీ ఏర్పాటుకు సిద్ధం కావడంతో మెగా కుటుంబంలోను విభేదాలు వచ్చాయి. ఇప్పుడు చిరు, నాగబాబులు ఒకవైపు, పవన్ మరోవైపు ఉన్నారు.

పవన్ 4

పవన్ 4

పవన్ కళ్యాన్ తన జనసేన పార్టీని శుక్రవారం సాయంత్రం ప్రకటించనున్నారు. ఆయన నలభై అయిదు నిమిషాలు ప్రసంగిస్తారు. ఆయన ఒక్కరే మాట్లాడుతారు.

పవన్ 5

పవన్ 5

చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించినప్పుడు పవన్ జోరుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ప్రజారాజ్యం ద్వారా భవిష్యత్తులో ప్రజలకు ఏదైనా చేయాలని పవన్ భావించారట. అయితే, చిరు పిఆర్పీని కాంగ్రెసు పార్టీలో విలీనం చేసినప్పటి నుండి మెగా కుటుంబంలో చిచ్చు రాజుకుంది. ఇప్పుడు కొత్త పార్టీతో అది తారాస్థాయికి చేరుకుంది.

నాగబాబు 6

నాగబాబు 6

చిరంజీవి ఎన్నో కష్టాలకు ఓర్చి తమకు రాజబాటను నిర్మించారని, తాను తన అన్న వైపే ఉంటానని నాగబాబు ప్రకటించారు. అభిమానులు కూడా చిరు వైపే ఉంటారని చెప్పారు.

రామ్ చరణ్ తేజ 7

రామ్ చరణ్ తేజ 7

పవన్ కొత్త పార్టీ నేపథ్యంలో రామ్ చరణ్ తేజ నాలుగు రోజుల క్రితం స్పందించారు. బాబాయి అంటే తనకు అభిమానమేనని, తాను మాత్రం తన తండ్రి వైపే ఉంటానని చెప్పారు.

చంద్రబాబు 8

చంద్రబాబు 8

ఎన్టీఆర్ మృతి తర్వాత టిడిపిలో చంద్రబాబు చక్రం తిప్పుతున్నారు. నందమూరి హరికృష్ణ బాబు పైన మొదటి నుండి అసంతృప్తితో ఉన్నారు. కొంతకాలం క్రితం లోకేష్‌కు తదనంతర బాధ్యతలు ఇస్తారనే ఊహాగానాల నేపథ్యంలో నారా - నందమూరి కుటుంబాల మధ్య విభేదాలు మరింత రంజుగా మారాయి.

 జూ ఎన్టీఆర్ 9

జూ ఎన్టీఆర్ 9

లోకేష్ పేరు తెర పైకి రావడంతో హరికృష్ణ తన తనయుడు జూనియర్ ఎన్టీఆర్‌ను ముందుకు తీసుకు వచ్చారు. ఇది టిడిపిలో మొన్నటి వరకు వేడి రాజేసింది. తాను తాత స్థాపించిన టిడిపికే మద్దతిస్తానని జూనియర్ వివరణ ఇవ్వాల్సి వచ్చింది. అయినప్పటికీ ఆ తండ్రీ కొడుకుల కదలికలపై ఇప్పటికీ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో హరికృష్ణ అన్న తెలుగుదేశం పార్టీ పెట్టి చేతులు కాల్చుకున్నారు.

బాలకృష్ణ 10

బాలకృష్ణ 10


టిడిపి నేత, హీరో నందమూరి బాలకృష్ణ కూడా చంద్రబాబు పైన అసంతృప్తితో ఉన్నట్లు ఊహాగానాలు వినిపించాయి. వాటిని బాలయ్య కొట్టి పారేశారు. అయితే, బాలయ్యకు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇచ్చేందుకు చంద్రబాబు సుముఖంగా లేరని అంటున్నారు.

పురంధేశ్వరి 11

పురంధేశ్వరి 11

దగ్గుబాటి దంపతులు (వెంకటేశ్వర రావు, పురంధేశ్వరి)లు ఎప్పుడో టిడిపితో బంధం తెంపుకున్నారు. నిన్నటి వరకు కాంగ్రెసులో ఉన్న పురంధేశ్వరి ఇటీవలె బిజెపిలో చేరారు. బాబుతో కలిసి పని చేసేందుకు మొదటి నుండి వారు అయిష్టత చూపుతున్నారు. అయితే బిజెపి, టిడిపిల పొత్తు ఉంటుందన్న నేపథ్యంలో వారు ఏం చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.

 లక్ష్మీ పార్వతి 12

లక్ష్మీ పార్వతి 12

లక్ష్మీ పార్వతికి నందమూరి కుటుంబం మొదటి నుండి దూరమే. ఎన్టీఆర్ మృతి తర్వాత టిడిపి చంద్రబాబు చేతుల్లోకి వెళ్లింది. ఆ తర్వాత ఆమె ఎన్టీఆర్ టిడిపిని స్థాపించారు. ఇటీవల ఆమె తన పార్టీని వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో విలీనం చేశారు.

కల్యాణ్ రామ్ 13

కల్యాణ్ రామ్ 13

ఎన్టీఆర్ కుటుంబంలో రాజకీయంగా ప్రధానంగా మూడు గ్రూపులు ఉన్నాయి. చంద్రబాబు వెంట బాలయ్య, తారకరత్న, కల్యాణ్ రాంలు ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్, హరికృష్ణలు ఓ వైపు ఉండగా, లక్ష్మీ పార్వతి ఒంటరి!

English summary
Political rift in NTR and Chiranjeevi families.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X