హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

యువతితో సంబంధం, దేహశుద్ది: సెక్స్ రాకెట్ రట్టు

By Srinivas
|
Google Oneindia TeluguNews

 Public beats married man
హైదరాబాద్: భార్యాపిల్లలను వదిలేసి వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ వ్యక్తికి మహిళా సంఘాలు దేహశుద్ధి చేశారు. ఓ ఆసుపత్రిలో కాంట్రాక్ట్ ఉద్యోగిగా పని చేస్తున్న ప్రవీణ్ ఓ యువతితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. కొన్నేళ్లుగా ప్రవీణ్ ఇంటికి రాకపోవడంతో భార్య స్థానిక మహిళా సంఘాన్ని ఆశ్రయించింది.

ఓ ఇంట్లో వారిద్దరినీ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న మహిళా సంఘాల నేతలు ప్రవీణ్‌కు దేహశుద్ధి చేశారు. అనంతరం ప్రవీణ్‌ను పోలీసులకు అప్పగించారు.

సికింద్రాబాద్ పరిధిలో ఓ వ్యభిచార గృహం పైన పోలీసులు దాడులు నిర్వహించారు. ఇద్దరు మహిళలు, విటులను అదుపులోకి తీసుకున్నారు. ఇందులో నిర్వాహకురాలు, సెక్స్ వర్కర్, విటుడు ఉన్నారు. వ్యభిచారం నిర్వహిస్తున్నారనే సమాచారం అందడంతో పోలీసులు దాడి చేశారు. ఇందులో నల్గొండ జిల్లాకు చెందిన యువతి ఉంది. పోలీసులు వారిని మంగళవారం రిమాండ్‌కు తరలించారు.

తీవ్రవాదుల నుంచి తెలుగు ఇంజినీర్లకు లభించని విముక్తి

నాగాలాండ్‌లో కిడ్నాప్ గురైన ఇద్దరు తెలుగు ఇంజినీర్ల వ్యవహరంలో ప్రతిష్ఠంభన నెలకొంది. పృథ్వీ కన్‌స్ట్రక్షన్స్ యాజమాన్యం ప్రతినిధులకు బోడా లాండ్ తీవ్రవాదులకు మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయని, దీంతో ఇంజినీర్లు రఘు, ప్రదీప్‌లను విడిపెట్టేందుకు సిద్ధమైన తీవ్రవాదులు మరలా వారిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలిసిన ఇద్దరు ఇంజినీర్ల కుటుంబసభ్యుల్లో ఆందోళన నెలకొంది. ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలంటూ కుటుంబసభ్యులు విజ్ఞప్తి చేశారు.

English summary

 Public beat married man for extra marital affair in Hyderbad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X